తోవ ఎక్కడ సోఫియా..?
------------------- ---------------------------------------------------------------------కె. శ్రీనివాస్
ఈ నవల చదవడం ఒక గొప్ప అనుభవం. యాత్రానుభవం.
సౌందర్య భరితమైన బాహ్య నైసర్గికతలోకి, సంక్షుభితమైన మనో వల్మీకంలోకి చేసే హైకింగ్. ఏటవాలుగా, జారుడుగా, ఎగుడుదిగుడుగా, అగాధాల అంచున, ప్రవాహాల మీదుగా, ఊపిరాడకుండా, గడ్డకట్టుకుపోతూ పాఠకులు ఇందులోని ప్రధానపాత్రతో పాటు ప్రయాణం చేస్తారు. వణికిపోతారు, జ్వరపడతారు, ముగ్ధులవుతారు, మంచుకొండల కేన్వాసు మీద రంగురంగుల దృశ్యాలను, ఆశ్చర్యాలను అనుభవిస్తారు. కలవరపడతారు. ప్రకృతిని, మానవ వికృతులను జమిలిగా మనముందు ఆవిష్కరించి రచయిత సతీశ్ చప్పరికి బాగా కలవరపరిస్తారు,
'ఘాంద్రుక్' నేపాల్లోని అన్నపూర్ణ యాత్రామార్గంలోని ఒక చిన్న ఊరు. కానీ, పర్యాటకులకు, ఆరోహకులకు ప్రమాద, సౌందర్యభరితమైన తమ సాహస వలయం ముగింపునకు వచ్చే ముందు చేరుకునే మజిలీ. ప్రయాణాన్ని సమీక్షించుకునే చోటు, కొత్త స్థైర్యంతో అడుగు ముందుకు వేసే మెట్టు. కథానాయకుడు సిద్ధార్థ హోస్మనె విరక్తి, అనురక్తి నడుమ కొట్టుమిట్టాడుతూ, బయటి లోపలి ఆరోహణ అవరోహణలను సాగిస్తూ, నిర్ణయం అనివార్యమైన పతాక సన్నివేశంలో ఘాండ్రుక్ను చేరతాడు. హైకింగ్ ఇక ముగుస్తుంది. మధనం ముగిసిందా, లేదా మనసు విప్పారి సంబుద్ధుడయ్యాడా అన్న ప్రశ్న సిద్ధార్ధకు మాత్రమే సంబంధించింది కాదు. పాఠకులు కూడా ఆ కొండకొమ్ము మీద నిలిచి, ధవళగిరి కాంతుల నుంచి ఏ స్పష్టతను అందుకుంటారన్నది ఒక శేష ప్రశ్న....................
తోవ ఎక్కడ సోఫియా..? ------------------- ---------------------------------------------------------------------కె. శ్రీనివాస్ఈ నవల చదవడం ఒక గొప్ప అనుభవం. యాత్రానుభవం. సౌందర్య భరితమైన బాహ్య నైసర్గికతలోకి, సంక్షుభితమైన మనో వల్మీకంలోకి చేసే హైకింగ్. ఏటవాలుగా, జారుడుగా, ఎగుడుదిగుడుగా, అగాధాల అంచున, ప్రవాహాల మీదుగా, ఊపిరాడకుండా, గడ్డకట్టుకుపోతూ పాఠకులు ఇందులోని ప్రధానపాత్రతో పాటు ప్రయాణం చేస్తారు. వణికిపోతారు, జ్వరపడతారు, ముగ్ధులవుతారు, మంచుకొండల కేన్వాసు మీద రంగురంగుల దృశ్యాలను, ఆశ్చర్యాలను అనుభవిస్తారు. కలవరపడతారు. ప్రకృతిని, మానవ వికృతులను జమిలిగా మనముందు ఆవిష్కరించి రచయిత సతీశ్ చప్పరికి బాగా కలవరపరిస్తారు, 'ఘాంద్రుక్' నేపాల్లోని అన్నపూర్ణ యాత్రామార్గంలోని ఒక చిన్న ఊరు. కానీ, పర్యాటకులకు, ఆరోహకులకు ప్రమాద, సౌందర్యభరితమైన తమ సాహస వలయం ముగింపునకు వచ్చే ముందు చేరుకునే మజిలీ. ప్రయాణాన్ని సమీక్షించుకునే చోటు, కొత్త స్థైర్యంతో అడుగు ముందుకు వేసే మెట్టు. కథానాయకుడు సిద్ధార్థ హోస్మనె విరక్తి, అనురక్తి నడుమ కొట్టుమిట్టాడుతూ, బయటి లోపలి ఆరోహణ అవరోహణలను సాగిస్తూ, నిర్ణయం అనివార్యమైన పతాక సన్నివేశంలో ఘాండ్రుక్ను చేరతాడు. హైకింగ్ ఇక ముగుస్తుంది. మధనం ముగిసిందా, లేదా మనసు విప్పారి సంబుద్ధుడయ్యాడా అన్న ప్రశ్న సిద్ధార్ధకు మాత్రమే సంబంధించింది కాదు. పాఠకులు కూడా ఆ కొండకొమ్ము మీద నిలిచి, ధవళగిరి కాంతుల నుంచి ఏ స్పష్టతను అందుకుంటారన్నది ఒక శేష ప్రశ్న....................© 2017,www.logili.com All Rights Reserved.