భారతావనిలో వివాహం అనేది అతి ముఖ్యమైన, అందరికీ అత్యంత సంతోష కరమైన మరియు అతి పవిత్రమైన క్రతువు. ఈ మహా క్రతువు యొక్క యజ్ఞఫలం మన జీవిత పర్యంతం హాయిగా, ఆనందంగా అనుభవించి సంతోషంగా గడుపుకోవాలని పెద్దలందరూ హృదయపూర్వకంగా కళ్యాణ సంరంభంలో ఆశీర్వదిస్తారు. అనేక దేవతలను ఆవాహన చేసి, వారిని పూజించి ఆ తర్వాత వివాహ యజ్ఞం జరిపించి అనేక దేవతల ఆశీస్సులు నవ దంపతులకు కలిగాయని సంతసం పొందుతారు. ఆ సంతోష సమయంలో అన్నదానం, వస్త్రదానం, గో, భూదానాలు కూడా చేసి సబ్రాహ్మణులను గౌరవించి వారి ఆశీర్వాదములు పొంది సంతసిస్తారు.
పెద్దలు మరియు సత్పురుషుల ఆశీర్వాదాలు పొందడం ముఖ్యమైనా అది ఒక మానవ కార్యక్రమమే అవుతుంది. కాని సృష్టికర్త బ్రహ్మ వ్రాసిన జీవిత సరళిని ఆయన నిర్ణయించిన రీతిలో నడిపించేది నవగ్రహాలేనని మన పూర్వులు అనేక శాస్త్రాల ద్వారా స్పష్టం చేశారు. ఒక్కొక్క పద్ధతిలో బ్రహ్మ లిఖితానుసారంగా మనకు జీవితంలో ఒకసారి పరమపద సోపాన పటంలోని కాలసర్పాలలాగా లేదా మరొకసారి ఉన్నతమైన స్థితికి మార్గమైన నిచ్చెనలు లాగా మనకు అనుకూల, ప్రతికూల అంశాలను అనుభవపూర్వకంగా జీవితంలో కలిగిస్తూ వుంటారు. వాటి వలన మనకు సుఖదుఃఖాలు కలుగుతూ ఉంటాయి. అలా కలిగించడం నవగ్రహాల ధర్మం మరియు అది వారి ప్రవృత్తి కాబట్టి వారి కార్యం వారు నియమానుసారంగా నిర్వర్తిస్తూనే ఉంటారు. అందువల్లనే జీవితంలో మనం పూలబాటలో నడచినా ఒక్కొక్కప్పుడు ముళ్లమార్గాన్ని కూడా దాటవలసి వస్తుంది. ఒక కార్యాలయంలో ఉన్నతాధికారి చేసిన నిర్ణయాలను మిగిలిన వారు ఏ విధంగా అమలు పరుస్తారో అదే విధంగా బ్రహ్మ లిఖితాన్ని నవగ్రహాలు అమలుపరుస్తున్నాయను కోవచ్చు.
మన జాతకచక్రంలో మనం ఏ సమయంలో ఏ రాశి ప్రభావంలో ఉంటామో ఆ రాశి అధిపతి యొక్క గుణగణాల కర్మను వారు కలిగించే కష్టసుఖాలను అనుభవిస్తాము. అందుకనే గ్రహస్థితి బాగా లేనప్పుడు మనం ఏమీ చెయ్యలేము. గ్రహస్థితి బాగున్నప్పుడు......................
జాతక కళ్యాణ విశ్లేషణ రచయితగా నా మాట... భారతావనిలో వివాహం అనేది అతి ముఖ్యమైన, అందరికీ అత్యంత సంతోష కరమైన మరియు అతి పవిత్రమైన క్రతువు. ఈ మహా క్రతువు యొక్క యజ్ఞఫలం మన జీవిత పర్యంతం హాయిగా, ఆనందంగా అనుభవించి సంతోషంగా గడుపుకోవాలని పెద్దలందరూ హృదయపూర్వకంగా కళ్యాణ సంరంభంలో ఆశీర్వదిస్తారు. అనేక దేవతలను ఆవాహన చేసి, వారిని పూజించి ఆ తర్వాత వివాహ యజ్ఞం జరిపించి అనేక దేవతల ఆశీస్సులు నవ దంపతులకు కలిగాయని సంతసం పొందుతారు. ఆ సంతోష సమయంలో అన్నదానం, వస్త్రదానం, గో, భూదానాలు కూడా చేసి సబ్రాహ్మణులను గౌరవించి వారి ఆశీర్వాదములు పొంది సంతసిస్తారు. పెద్దలు మరియు సత్పురుషుల ఆశీర్వాదాలు పొందడం ముఖ్యమైనా అది ఒక మానవ కార్యక్రమమే అవుతుంది. కాని సృష్టికర్త బ్రహ్మ వ్రాసిన జీవిత సరళిని ఆయన నిర్ణయించిన రీతిలో నడిపించేది నవగ్రహాలేనని మన పూర్వులు అనేక శాస్త్రాల ద్వారా స్పష్టం చేశారు. ఒక్కొక్క పద్ధతిలో బ్రహ్మ లిఖితానుసారంగా మనకు జీవితంలో ఒకసారి పరమపద సోపాన పటంలోని కాలసర్పాలలాగా లేదా మరొకసారి ఉన్నతమైన స్థితికి మార్గమైన నిచ్చెనలు లాగా మనకు అనుకూల, ప్రతికూల అంశాలను అనుభవపూర్వకంగా జీవితంలో కలిగిస్తూ వుంటారు. వాటి వలన మనకు సుఖదుఃఖాలు కలుగుతూ ఉంటాయి. అలా కలిగించడం నవగ్రహాల ధర్మం మరియు అది వారి ప్రవృత్తి కాబట్టి వారి కార్యం వారు నియమానుసారంగా నిర్వర్తిస్తూనే ఉంటారు. అందువల్లనే జీవితంలో మనం పూలబాటలో నడచినా ఒక్కొక్కప్పుడు ముళ్లమార్గాన్ని కూడా దాటవలసి వస్తుంది. ఒక కార్యాలయంలో ఉన్నతాధికారి చేసిన నిర్ణయాలను మిగిలిన వారు ఏ విధంగా అమలు పరుస్తారో అదే విధంగా బ్రహ్మ లిఖితాన్ని నవగ్రహాలు అమలుపరుస్తున్నాయను కోవచ్చు. మన జాతకచక్రంలో మనం ఏ సమయంలో ఏ రాశి ప్రభావంలో ఉంటామో ఆ రాశి అధిపతి యొక్క గుణగణాల కర్మను వారు కలిగించే కష్టసుఖాలను అనుభవిస్తాము. అందుకనే గ్రహస్థితి బాగా లేనప్పుడు మనం ఏమీ చెయ్యలేము. గ్రహస్థితి బాగున్నప్పుడు......................© 2017,www.logili.com All Rights Reserved.