ప్రణయ నిశ్శబ్దం
'గుప్పెడు మల్లెలు నీ గుండెపై రాలినట్టనిపిస్తే... లిప్తపాటు కళ్లు మూసుకో...! అవి నీకై నాలో మెదిలిన ఊహలు...!'
"ముద్దుగున్నవే పిల్ల" తలారబోసుకున్న వెంట్రుకల కొసల నుండి జాలువారుతున్న నీటి బిందువుని చూస్తోంటే...
నాలో నేను ఎప్పటిలా, స్తబ్దత ఆకారానికి చిరునవ్వు ముసుగేసుకున్న మరబొమ్మలా, చక్కగున్నాను.
రెప్ప వాల్చాను...
కను కొనల నుండి జారిన కన్నీటి చుక్క పాదాన్ని అద్దింది...
నా భావైక వెన్నెల మైదానంలో నీతో కలిసి ప్రయాణం చేస్తూనే ఉన్నాను....
మౌన గీతిక లా...
'ప్రణయ నిశ్శబ్దం' లా...!!
***
ముసురు...!
తడిపొడి నేలపై ఉండీ లేనట్టు, అద్దీ అద్దనట్టు అదే తుంపర. “ముప్పై రెండు..." మందార రెక్క పై పడిన తుంపర, బిందువుగా మారి, జారే ఒక్కో చుక్కనీ లెక్క పెట్టగా వచ్చిన సంఖ్య 32...
అచ్చు నా వయసే...
చివ్వరి చుక్క రాలబోతూ ఆగింది... ఆకాశానికేసి చూసా. తుంపర ఆగిపోయింది.
ఈ ముసిరే తుంపరకున్న అదుపు, నీ ఆలోచనలతో ముసిరే నా మనసుకి లేకపోయింది.
తలనో లేదో..................................
ప్రణయ నిశ్శబ్దం 'గుప్పెడు మల్లెలు నీ గుండెపై రాలినట్టనిపిస్తే... లిప్తపాటు కళ్లు మూసుకో...! అవి నీకై నాలో మెదిలిన ఊహలు...!' "ముద్దుగున్నవే పిల్ల" తలారబోసుకున్న వెంట్రుకల కొసల నుండి జాలువారుతున్న నీటి బిందువుని చూస్తోంటే... నాలో నేను ఎప్పటిలా, స్తబ్దత ఆకారానికి చిరునవ్వు ముసుగేసుకున్న మరబొమ్మలా, చక్కగున్నాను. రెప్ప వాల్చాను... కను కొనల నుండి జారిన కన్నీటి చుక్క పాదాన్ని అద్దింది... నా భావైక వెన్నెల మైదానంలో నీతో కలిసి ప్రయాణం చేస్తూనే ఉన్నాను.... మౌన గీతిక లా... 'ప్రణయ నిశ్శబ్దం' లా...!! *** ముసురు...! తడిపొడి నేలపై ఉండీ లేనట్టు, అద్దీ అద్దనట్టు అదే తుంపర. “ముప్పై రెండు..." మందార రెక్క పై పడిన తుంపర, బిందువుగా మారి, జారే ఒక్కో చుక్కనీ లెక్క పెట్టగా వచ్చిన సంఖ్య 32... అచ్చు నా వయసే... చివ్వరి చుక్క రాలబోతూ ఆగింది... ఆకాశానికేసి చూసా. తుంపర ఆగిపోయింది. ఈ ముసిరే తుంపరకున్న అదుపు, నీ ఆలోచనలతో ముసిరే నా మనసుకి లేకపోయింది. తలనో లేదో..................................© 2017,www.logili.com All Rights Reserved.