పురాణగాథలు, వివిధ భావవ్యక్తీకరణ రూపాల మధ్య స్పందనలు, మార్పిడులను అర్థం చేసుకోవాలంటే అసలు పురాణగాథలంటే ఏమిటో క్షుణ్ణంగా అర్థం చేసుకోవాలి. అదీ, కేవలం ఒక నాగరికతకు సంబంధించినవే కాదు, అన్ని నాగరికతలనూ పరిగణించాలి. సామాజిక వ్యవస్థలో పురాణగాథలు వైవిధ్యమైన పాత్రను పోషిస్తాయి. ఆ వైవిధ్యాలను అర్థం చేసుకున్నప్పుడే పురాణగాథలు, వివిధ భావవ్యక్తీకరణ రూపాల మధ్య మార్పిడులు బాగా అర్థం అవుతాయి.
గిరీష్ కర్నాడ్ ఉపయోగించిన పౌరాణిక ఇతివృత్తాల వివరించి చర్చించే ముందు ఆధునికత ఆవిర్భవించిన తరువాత సాహిత్యంలో పౌరాణికాల వినియోగ శైలిలో మార్పులను పరిగణించాలి. జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో విమర్శకుల ప్రశంసలు అందుకున్న గిరీష్ కర్నాడ్ ఆధునిక భారతదేశపు ప్రఖ్యాత నాటకకర్తల్లో ఒకరైనందున, ప్రాచీన, ఆధునిక సాహిత్యాలలో పౌరాణికాల వినియోగంలోని అంతరాన్ని ప్రధమంగా శోధించవలసిన అవసరం ఉంది. తద్వారా తన రచనల్లో కర్నాడ్ పౌరాణికాలని ఎంతటి ప్రావీణ్యంతో వినియోగించారో అర్థం చేసుకోడానికి ఉపయుక్తమైన నేపథ్యం లభిస్తుంది.
ఈ అంశాలని చర్చించే ముందు, పురాణం అంటే ఏమిటి, వివిధ సమాజాల్లో, నేపథ్యాల్లో అది ఏ విధంగా పరిణమించింది.
పురాణగాథ అంటే అతీత శక్తులు గల జీవులు లేక మనుషుల కథ. సాధారణంగా, విశ్వ సృష్టి, మానవ సృష్టికి సంబంధించినవి ఈ కథలు. Myth and literature అనే సంకలనానికి తన నిశితమైన ఉపోద్ఘాతంలో జాన్ బి వికరి ఇలా వ్యాఖ్యానించారు: "పురాణగాథల రచనా క్రమంలో ఆలోచనా ప్రక్రియలోని కల్పనాశక్తి అంతర్లీనంగా...................
అధ్యాయం-1 పురాణగాథలు, భావవ్యక్తీకరణలు పురాణగాథలు, వివిధ భావవ్యక్తీకరణ రూపాల మధ్య స్పందనలు, మార్పిడులను అర్థం చేసుకోవాలంటే అసలు పురాణగాథలంటే ఏమిటో క్షుణ్ణంగా అర్థం చేసుకోవాలి. అదీ, కేవలం ఒక నాగరికతకు సంబంధించినవే కాదు, అన్ని నాగరికతలనూ పరిగణించాలి. సామాజిక వ్యవస్థలో పురాణగాథలు వైవిధ్యమైన పాత్రను పోషిస్తాయి. ఆ వైవిధ్యాలను అర్థం చేసుకున్నప్పుడే పురాణగాథలు, వివిధ భావవ్యక్తీకరణ రూపాల మధ్య మార్పిడులు బాగా అర్థం అవుతాయి. గిరీష్ కర్నాడ్ ఉపయోగించిన పౌరాణిక ఇతివృత్తాల వివరించి చర్చించే ముందు ఆధునికత ఆవిర్భవించిన తరువాత సాహిత్యంలో పౌరాణికాల వినియోగ శైలిలో మార్పులను పరిగణించాలి. జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో విమర్శకుల ప్రశంసలు అందుకున్న గిరీష్ కర్నాడ్ ఆధునిక భారతదేశపు ప్రఖ్యాత నాటకకర్తల్లో ఒకరైనందున, ప్రాచీన, ఆధునిక సాహిత్యాలలో పౌరాణికాల వినియోగంలోని అంతరాన్ని ప్రధమంగా శోధించవలసిన అవసరం ఉంది. తద్వారా తన రచనల్లో కర్నాడ్ పౌరాణికాలని ఎంతటి ప్రావీణ్యంతో వినియోగించారో అర్థం చేసుకోడానికి ఉపయుక్తమైన నేపథ్యం లభిస్తుంది. ఈ అంశాలని చర్చించే ముందు, పురాణం అంటే ఏమిటి, వివిధ సమాజాల్లో, నేపథ్యాల్లో అది ఏ విధంగా పరిణమించింది. పురాణగాథ అంటే అతీత శక్తులు గల జీవులు లేక మనుషుల కథ. సాధారణంగా, విశ్వ సృష్టి, మానవ సృష్టికి సంబంధించినవి ఈ కథలు. Myth and literature అనే సంకలనానికి తన నిశితమైన ఉపోద్ఘాతంలో జాన్ బి వికరి ఇలా వ్యాఖ్యానించారు: "పురాణగాథల రచనా క్రమంలో ఆలోచనా ప్రక్రియలోని కల్పనాశక్తి అంతర్లీనంగా...................© 2017,www.logili.com All Rights Reserved.