అంతరిక్షంలో ఎక్కడినుంచో, ఇంకొక గాలక్సీ నుంచో ఏమో, అత్యంత ఆశ్చర్యకరమైన గులాబి రంగు మేఘాలు మన భూమి మీదకు వస్తాయి. వాటి అన్వేషణ కోసం భారతీయ శాస్త్రజ్ఞుల బృందం అంటార్కటికాలో వెళ్లి వారితో రకరకాల సంఘటనలలో తలపడుతుంది. 'మేఘాలు' అంటార్కిటికాలో ఉన్న మంచును అతి పెద్ద మొత్తాలలో కోసి అంతరిక్షంలోకి తీసుకొనిపోవడం శాస్త్రజ్ఞులు గమనిస్తారు. 'మేఘాలు' ఎటువంటి పరమాణు నిర్మాణాన్ని అయినా సరే, మానవ శరీరలైనా సరే, పునఃసృష్టించగలవు. నవలలోని పాత్రలు వారి వారి ప్రతి రూపాలతో తారస పడతారు. కాపీ చేయబడిన ఒక విమానాన్ని, కాపీ చేయబడిన ఒక ఊరిని చూస్తారు. మానవ మెదడులలోని ఆలోచనలకు (భూత, భవిష్యత్ కాలానికి చెందిన ఆలోచనలకూ) కూడా మేఘాలు భౌతిక రూపకల్పన చేయగలరని మానవులు గ్రహిస్తారు. అటువంటి ప్రపంచంలోకి మన కథా పాత్రలు చొచ్చుకొని పోతారు. భూమి మీద జీవనాన్ని ఎందుకు మోడలీకరిస్తున్నారో శాస్త్రజ్ఞులకి అర్థం కాదు. అంతరిక్ష వాసులతో సంపర్కం ఏర్పరచుకోవడానికి (అంటే సంభాషించడానికి) చేసిన కొన్ని ప్రయోగాలు విఫలం అవుతాయి. ఆంతర్జాతీయ సదస్సులలో శాస్త్రజ్ఞులూ, రచయితలూ చర్చలు జరుపుతారు. ఎట్టకేలకు ఏమవుతుంది? శాస్త్రజ్ఞులు చిక్కుముడి విప్పగలుగుతారా? ఇంకోక గాలక్సీ కి చెందిన ఉత్కృష్ట నాగరికతతో సంభాషించ గలుగుతారా? నవల చదివి తెలుసుకోండి.
- చట్టి శ్రీనివాసరావు