Pradama Balasiksha

Rs.130
Rs.130

Pradama Balasiksha
INR
TELBOOK076
In Stock
130.0
Rs.130


In Stock
Ships in 5 - 15 Days
Check for shipping and cod pincode

Description

              ఈ పుస్తకం పేరు 'ప్రధమ బాల శిక్ష'! తెలుగు వారి పిల్లల లేత మనస్సులలో ప్రప్రధమ సంస్కారాలుగా పడ దగిన విషయాల సంపుటి!

             తెలుగువారి పిల్లలకు మొట్ట మొదటగా - విశాల భారతీయ సంస్కృతీ భావజాలంతో బాటు, మాతృభాష కమ్మదనంతో కూడ అనుబంధం ఏర్పడాలంటే - వేమన పద్యసాహిత్యాన్ని మించినది లేదు! వీటివల్ల, తేట తెలుగు మాటలతో పరిచయం, తెలుగు పలుకుబడిలోని తియ్యదనం, తెలుగు జాతీయాల గొప్పదనం, తెలుగు కవిత్వపు సౌందర్యం - అన్నీ ఒకే ప్రయత్నంలోనే తెలిసే వీలు ఉంది !

            అందుకే, వేయికి పైగా వేమన పద్యాలను పరిశీలించి, పిల్లల కోసమే ఎంచి ఏర్చి కూర్చిన సూక్తుల మణిహారం, కంఠమాల యీ బాలబోధ! ఇందులోని ప్రతి సూక్తి ఒక ఆణిముత్యమే!

             పుస్తకం మొదటి భాగంలో - మొత్తం సుక్తుల పాఠాన్ని వరుసగా యివ్వటం జరిగింది. ఉచ్చారణలో ఒక లయ రావడానికై - ఎక్కడ ఆపి చదివితే బాగుంటుందో సూచించటానికై - ప్రతి సూక్తి మధ్య భాగంలో ఎక్కువ స్థలం వదలటమైంది - ఈ సూక్తులను పిల్లలచే కంఠస్తం చేయించటం అనేది ప్రధాన ఉద్దేశం కాబట్టి!

           రెండవ భాగంలో సూక్తితో బాటు తాత్పర్యం కూడా ఉన్నది. ఏది ఎందుకు చేయాలో, చేస్తే లాభ మేమిటో, చేయకపోతే నష్ట మేమిటో (Rationale)ని - వివరించే ప్రయత్నం జరిగింది! తాత్పర్యం ధారాళంగా చదవలేని, అర్ధం చేసుకోలేని పిల్లలకు భావాన్ని వివరించటంలో - తల్లి దండ్రులకు, ఉపాధ్యాయులకు సహాయకారిగా ఉండేటట్లుగా - తాత్పర్యం ఇవ్వబడ్డది. వేమన సూక్తులలోనే చాలా తేట తెలుగు పదాల పరిచయం కలుగుతుంది. తాత్పర్యంలో మరిన్ని తెలుగు, సంస్కృత పాదాలను పరిచయం చేయటం జరిగింది!

          మూడవ భాగంలో - అతి అందమైన వేమన పద్యాలను కొన్నిటిని అందిస్తున్నాము! ఈ పద్యాలన్నీ గూడా - తెలుగు లోని కమ్మని అందాలు, భావాల సుగంధాలు, వీనులకు విందుగా ఉండే పదాల పొందిక, మొదలైన లక్షణాలతో - చిన్నారుల (Little Hearts)కీ గూడా అనుభూతిని కలిగించేంత సుందరమైనవి! (Pre - School Nursery Rhymes)గా జిలిబిలి పలుకులు తెలుగు చిన్నారులకు నేర్ప దగినవన్నీ!

           ఈ పుస్తకం నవల వలె, వరుసగా చదవ దగినది కాదు. ఒక రోజుకు ఒక సూక్తిగా దాని భావాన్ని ఒంటబట్టించుకోటమే ముఖ్యం! ఈ చిన్ని పుస్తకానికి పిల్లలే పాఠకులు! సూక్తులను సులభంగా కంఠస్థం చేయించటమే ప్రధమ ధ్యేయం.

- భాగవతుల శ్రీనివాసరావు

 

 

 

              ఈ పుస్తకం పేరు 'ప్రధమ బాల శిక్ష'! తెలుగు వారి పిల్లల లేత మనస్సులలో ప్రప్రధమ సంస్కారాలుగా పడ దగిన విషయాల సంపుటి!              తెలుగువారి పిల్లలకు మొట్ట మొదటగా - విశాల భారతీయ సంస్కృతీ భావజాలంతో బాటు, మాతృభాష కమ్మదనంతో కూడ అనుబంధం ఏర్పడాలంటే - వేమన పద్యసాహిత్యాన్ని మించినది లేదు! వీటివల్ల, తేట తెలుగు మాటలతో పరిచయం, తెలుగు పలుకుబడిలోని తియ్యదనం, తెలుగు జాతీయాల గొప్పదనం, తెలుగు కవిత్వపు సౌందర్యం - అన్నీ ఒకే ప్రయత్నంలోనే తెలిసే వీలు ఉంది !             అందుకే, వేయికి పైగా వేమన పద్యాలను పరిశీలించి, పిల్లల కోసమే ఎంచి ఏర్చి కూర్చిన సూక్తుల మణిహారం, కంఠమాల యీ బాలబోధ! ఇందులోని ప్రతి సూక్తి ఒక ఆణిముత్యమే!              పుస్తకం మొదటి భాగంలో - మొత్తం సుక్తుల పాఠాన్ని వరుసగా యివ్వటం జరిగింది. ఉచ్చారణలో ఒక లయ రావడానికై - ఎక్కడ ఆపి చదివితే బాగుంటుందో సూచించటానికై - ప్రతి సూక్తి మధ్య భాగంలో ఎక్కువ స్థలం వదలటమైంది - ఈ సూక్తులను పిల్లలచే కంఠస్తం చేయించటం అనేది ప్రధాన ఉద్దేశం కాబట్టి!            రెండవ భాగంలో సూక్తితో బాటు తాత్పర్యం కూడా ఉన్నది. ఏది ఎందుకు చేయాలో, చేస్తే లాభ మేమిటో, చేయకపోతే నష్ట మేమిటో (Rationale)ని - వివరించే ప్రయత్నం జరిగింది! తాత్పర్యం ధారాళంగా చదవలేని, అర్ధం చేసుకోలేని పిల్లలకు భావాన్ని వివరించటంలో - తల్లి దండ్రులకు, ఉపాధ్యాయులకు సహాయకారిగా ఉండేటట్లుగా - తాత్పర్యం ఇవ్వబడ్డది. వేమన సూక్తులలోనే చాలా తేట తెలుగు పదాల పరిచయం కలుగుతుంది. తాత్పర్యంలో మరిన్ని తెలుగు, సంస్కృత పాదాలను పరిచయం చేయటం జరిగింది!           మూడవ భాగంలో - అతి అందమైన వేమన పద్యాలను కొన్నిటిని అందిస్తున్నాము! ఈ పద్యాలన్నీ గూడా - తెలుగు లోని కమ్మని అందాలు, భావాల సుగంధాలు, వీనులకు విందుగా ఉండే పదాల పొందిక, మొదలైన లక్షణాలతో - చిన్నారుల (Little Hearts)కీ గూడా అనుభూతిని కలిగించేంత సుందరమైనవి! (Pre - School Nursery Rhymes)గా జిలిబిలి పలుకులు తెలుగు చిన్నారులకు నేర్ప దగినవన్నీ!            ఈ పుస్తకం నవల వలె, వరుసగా చదవ దగినది కాదు. ఒక రోజుకు ఒక సూక్తిగా దాని భావాన్ని ఒంటబట్టించుకోటమే ముఖ్యం! ఈ చిన్ని పుస్తకానికి పిల్లలే పాఠకులు! సూక్తులను సులభంగా కంఠస్థం చేయించటమే ప్రధమ ధ్యేయం. - భాగవతుల శ్రీనివాసరావు      

Features

  • : Pradama Balasiksha
  • : Baghavathula Srinivasarao
  • : Telugu Book House
  • : TELBOOK076
  • : Paperback
  • : 2 Books Set
  • : Telugu

Reviews

Be the first one to review this product

Discussion:Pradama Balasiksha

Be the first to start a discussion Start a new discussion

Browse all Discussions on Books
Powered by infibeam