వరం
ఆరోజు, మిట్టమధ్యాహ్నం. హైదరాబాదుకు తూర్పు దిక్కున సుమారు తొంభై కిలోమీటర్ల దూరంలో ఒక చిన్న పల్లెటూరు. ఆ ఊరి పొలిమేర బొడ్రాయికి ఉత్తర దిక్కుగా మరో కిలోమీటర్ దూరంలో పచ్చని చేన్లంచున పెద్ద వేపచెట్టుకి వేలాడుతున్న వెదురుబొంగుల ఉయ్యాలలో పడుకొని ఊగుతున్నాను.
తాటికల్లు తాగడం అదే మొదటిసారి. పుల్లటి వాసనొచ్చే కల్లు మాత్రమే తెలుసుకానీ, అప్పుడే చెట్టు నుండి తీసిన కల్లు కొబ్బరినీళ్లలా ఉంటుందని రుచి చూశాకే తెలిసింది. అనుకుందే తడవుగా పీకలదాకా తాగాను.
నెత్తికెక్కింది. తల తిరిగింది. కడుపులో తిప్పింది. కంప చెట్ల పొదల్లో దూరాక దెబ్బకి కడుపంతా పూడిక తీసిన బావిలా అయ్యింది.
ఒళ్ళు తిమ్మిరెక్కింది. కళ్ళు మూసుకుపోతున్నాయి. చెవులు సరిగ్గా వినిపించడం. లేదు. చల్లటి వేపగాలికి ఉయ్యాలూగుతుంటే మేఘాల్లో తేలిపోతునట్టుంది. భూమి నా చుట్టూ తిరుగుతుందా? లేక నేనే భూమి చుట్టూ తిరుగుతున్నానా? ఏం గుర్తొచ్చిందోగానీ మొహం మీద వెర్రి నవ్వొకటి పుట్టింది.
నేనే గనక ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రినైతే తాటికల్లుని రాష్ట్ర మధురపానీయంగా ప్రకటిస్తానని మనసులో అనుకుంటూ ఉండగా, ఒక పెద్ద అరుపు వినిపించింది.........................
వరం ఆరోజు, మిట్టమధ్యాహ్నం. హైదరాబాదుకు తూర్పు దిక్కున సుమారు తొంభై కిలోమీటర్ల దూరంలో ఒక చిన్న పల్లెటూరు. ఆ ఊరి పొలిమేర బొడ్రాయికి ఉత్తర దిక్కుగా మరో కిలోమీటర్ దూరంలో పచ్చని చేన్లంచున పెద్ద వేపచెట్టుకి వేలాడుతున్న వెదురుబొంగుల ఉయ్యాలలో పడుకొని ఊగుతున్నాను. తాటికల్లు తాగడం అదే మొదటిసారి. పుల్లటి వాసనొచ్చే కల్లు మాత్రమే తెలుసుకానీ, అప్పుడే చెట్టు నుండి తీసిన కల్లు కొబ్బరినీళ్లలా ఉంటుందని రుచి చూశాకే తెలిసింది. అనుకుందే తడవుగా పీకలదాకా తాగాను. నెత్తికెక్కింది. తల తిరిగింది. కడుపులో తిప్పింది. కంప చెట్ల పొదల్లో దూరాక దెబ్బకి కడుపంతా పూడిక తీసిన బావిలా అయ్యింది. ఒళ్ళు తిమ్మిరెక్కింది. కళ్ళు మూసుకుపోతున్నాయి. చెవులు సరిగ్గా వినిపించడం. లేదు. చల్లటి వేపగాలికి ఉయ్యాలూగుతుంటే మేఘాల్లో తేలిపోతునట్టుంది. భూమి నా చుట్టూ తిరుగుతుందా? లేక నేనే భూమి చుట్టూ తిరుగుతున్నానా? ఏం గుర్తొచ్చిందోగానీ మొహం మీద వెర్రి నవ్వొకటి పుట్టింది. నేనే గనక ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రినైతే తాటికల్లుని రాష్ట్ర మధురపానీయంగా ప్రకటిస్తానని మనసులో అనుకుంటూ ఉండగా, ఒక పెద్ద అరుపు వినిపించింది.........................© 2017,www.logili.com All Rights Reserved.