తీరం చేరిన నావ
ములాఖాత్ విత్ చార్మినార్ అండ్ జెఫ్రీ
తెలంగాణా చరిత్ర ఆ రోజు మళ్లీ ఒళ్లు విరుచుకుని ముఖ్యమైన మలుపు తిరిగిన రోజు.
చరిత్ర పుటలలో మరో కొత్త అధ్యాయం ప్రారంభమైన రోజు.
ఆరోజు తెలంగాణా విముక్తి దినం.
ఆ దినం 18 ఫిబ్రవరి 2014
లార్డ్ బజార్కు వెళ్లే సందు మలుపులో అప్పట్నించి ఇప్పటి వరకు అట్లనే ఉండి పాతబడి ముసలిదైన ఇక్బాల్ హెూటలకు అరవై మూడు సంవత్సరాల స్వామి ప్రవేశించి ఖాళీగా ఉన్న ఒక కుర్చీలో కూచుని ఎదురుగా కనబడుతున్న నాలుగున్నర శతాబ్దాలు నిండిన చార్మినార్ను కళ్లతోనే కావలించుకుని పలకరింపుగా ఒక చిన్న చిర్నవ్వు నవ్వాడు.
"ముబారక్ హెూ స్వామి సాబ్. ముబారక్ హె. హృదయ పూర్వక శుభాకాంక్షలు. హార్టీ కంగ్రాచ్యులేషన్స్" అంటూ చార్మినార్ నిండుగా నవ్వుతూ స్వామిని
పలకరించింది.
"థాంక్యూ" అని ముక్తసరిగా జవాబిచ్చాడు స్వామి.
"గదేంది. సంతోషంగా లేవేంది? ఈరోజు తెలంగాణా రాష్ట్రం సిద్దించింది కదా. అరవై సంవత్సరాల తెలంగాణా కల నెరవేరింది కదా. మరి ముఖం అట్ల ముడుచుకున్నవేంది?" ప్రశ్నించింది చార్మినార్.
ఆరోజే అనేక అవాంతరాలు, ఆటంకాలు, గందరగోళాల మధ్యన ప్రత్యేక తెలంగాణా రాష్ట్రం బిల్లు పార్లమెంటులో ఆమోదించబడి పాస్ అయ్యింది.........................
తీరం చేరిన నావ ములాఖాత్ విత్ చార్మినార్ అండ్ జెఫ్రీ తెలంగాణా చరిత్ర ఆ రోజు మళ్లీ ఒళ్లు విరుచుకుని ముఖ్యమైన మలుపు తిరిగిన రోజు. చరిత్ర పుటలలో మరో కొత్త అధ్యాయం ప్రారంభమైన రోజు. ఆరోజు తెలంగాణా విముక్తి దినం. ఆ దినం 18 ఫిబ్రవరి 2014 లార్డ్ బజార్కు వెళ్లే సందు మలుపులో అప్పట్నించి ఇప్పటి వరకు అట్లనే ఉండి పాతబడి ముసలిదైన ఇక్బాల్ హెూటలకు అరవై మూడు సంవత్సరాల స్వామి ప్రవేశించి ఖాళీగా ఉన్న ఒక కుర్చీలో కూచుని ఎదురుగా కనబడుతున్న నాలుగున్నర శతాబ్దాలు నిండిన చార్మినార్ను కళ్లతోనే కావలించుకుని పలకరింపుగా ఒక చిన్న చిర్నవ్వు నవ్వాడు. "ముబారక్ హెూ స్వామి సాబ్. ముబారక్ హె. హృదయ పూర్వక శుభాకాంక్షలు. హార్టీ కంగ్రాచ్యులేషన్స్" అంటూ చార్మినార్ నిండుగా నవ్వుతూ స్వామిని పలకరించింది. "థాంక్యూ" అని ముక్తసరిగా జవాబిచ్చాడు స్వామి. "గదేంది. సంతోషంగా లేవేంది? ఈరోజు తెలంగాణా రాష్ట్రం సిద్దించింది కదా. అరవై సంవత్సరాల తెలంగాణా కల నెరవేరింది కదా. మరి ముఖం అట్ల ముడుచుకున్నవేంది?" ప్రశ్నించింది చార్మినార్. ఆరోజే అనేక అవాంతరాలు, ఆటంకాలు, గందరగోళాల మధ్యన ప్రత్యేక తెలంగాణా రాష్ట్రం బిల్లు పార్లమెంటులో ఆమోదించబడి పాస్ అయ్యింది.........................© 2017,www.logili.com All Rights Reserved.