Hitchcock Numchi Nolan Daka- 3 books set

By Surya Prakash Joytsla (Author)
Rs.750
Rs.750

Hitchcock Numchi Nolan Daka- 3 books set
INR
MANIMN2878
In Stock
750.0
Rs.750


In Stock
Ships in 4 - 9 Days
Check for shipping and cod pincode

Description

                      నా విశ్వ సినీ ప్రయత్నం మీ చేతిలో ఉన్న ఈ పుస్తకం. రెండున్నర సంవత్సరాల పాటు ఆంధ్రజ్యోతి 'నవ్య' వీక్లీలో రాసిన ప్రపంచ సినిమా విశ్లేషణల, వివరాల సమాహారమిది. ముందుగా కొన్ని వారాలే రాద్దామనుకున్నాను. కానీ పాఠకుల ఆదరణ, పలువురు సినీ ప్రముఖుల, దర్శకుల, రచయితలతో పాటు, ఆంధ్రజ్యోతి సంపాదకుల ప్రోత్సాహం... ముందుకు నడిపించాయి. ఆ తర్వాత మిత్రులు, తెలిసిన వాళ్లు, తెలియని వాళ్లు చాలామంది... “నవ్యలో వచ్చిన మీ ఆర్టికల్స్ కొన్ని చదివాను... చాలా బాగున్నాయి... మిగతావన్నీ ఎక్కడ దొరుకుతాయి? కట్టింగ్స్ ఉంటే ఇస్తారా!!” అని అడగడం మొదలెట్టారు. ప్రతి ఒక్కరూ ఆర్టికల్స్ అన్నీ ఒక పుస్తకంగా తీసుకొస్తే బాగుంటుందని కాంక్షించారు. పుస్తకాలకు మార్కెట్ లేదనే భయం ఉన్నా... పదే పదే అడగడంతో ధైర్యం తెచ్చుకుని, వ్యయ ప్రయాసలకోర్చి ' హిచ్ కాక్ నుంచి నోలన్ దాకా” పేరుతో ప్రపంచ సినిమాపై నా విశ్లేషణలను మూడు భాగాలుగా మీ ముందుకు తీసుకొస్తున్నాను. ఈ పుస్తకం అందులో మొదటిది. సినిమా ఫీలో పనిచేసే.. ఈతరం టెక్నీషియన్స్ కి, ప్రేక్షకులకు, పాఠకులకు ఈ పుస్తకం చేరుకోవాలని నా కోరిక. ప్రపంచంలోని అనేక సంఘటనలను సినిమా ప్రతిబింబిస్తుంది. ప్రతిభావంతుడైన దర్శకుడు సమాజానికి ఏమీ బోధించడు, కేవలం ఒక అద్దంలా ఉండి తాను చూసిన వాటిని సినిమా ద్వారా మన ముందు పరుస్తాడు. ఆ సినిమాల నుండి మనం ఏం తీసుకుంటామనేది మన నైతికత, ఆసక్తి, ఆలోచన మీద ఆధారపడి ఉంటుంది. ఆకోణంలో నాకు అర్ధమైన మేరకు రాసిన ఈ పుస్తకం మీకు ఎంతో కొంత ఉపయోగ పడుతుందని ఆశిస్తున్నాను

                                                                                                                              - సూర్య ప్రకాష్ జోశ్యుల

                      నా విశ్వ సినీ ప్రయత్నం మీ చేతిలో ఉన్న ఈ పుస్తకం. రెండున్నర సంవత్సరాల పాటు ఆంధ్రజ్యోతి 'నవ్య' వీక్లీలో రాసిన ప్రపంచ సినిమా విశ్లేషణల, వివరాల సమాహారమిది. ముందుగా కొన్ని వారాలే రాద్దామనుకున్నాను. కానీ పాఠకుల ఆదరణ, పలువురు సినీ ప్రముఖుల, దర్శకుల, రచయితలతో పాటు, ఆంధ్రజ్యోతి సంపాదకుల ప్రోత్సాహం... ముందుకు నడిపించాయి. ఆ తర్వాత మిత్రులు, తెలిసిన వాళ్లు, తెలియని వాళ్లు చాలామంది... “నవ్యలో వచ్చిన మీ ఆర్టికల్స్ కొన్ని చదివాను... చాలా బాగున్నాయి... మిగతావన్నీ ఎక్కడ దొరుకుతాయి? కట్టింగ్స్ ఉంటే ఇస్తారా!!” అని అడగడం మొదలెట్టారు. ప్రతి ఒక్కరూ ఆర్టికల్స్ అన్నీ ఒక పుస్తకంగా తీసుకొస్తే బాగుంటుందని కాంక్షించారు. పుస్తకాలకు మార్కెట్ లేదనే భయం ఉన్నా... పదే పదే అడగడంతో ధైర్యం తెచ్చుకుని, వ్యయ ప్రయాసలకోర్చి ' హిచ్ కాక్ నుంచి నోలన్ దాకా” పేరుతో ప్రపంచ సినిమాపై నా విశ్లేషణలను మూడు భాగాలుగా మీ ముందుకు తీసుకొస్తున్నాను. ఈ పుస్తకం అందులో మొదటిది. సినిమా ఫీలో పనిచేసే.. ఈతరం టెక్నీషియన్స్ కి, ప్రేక్షకులకు, పాఠకులకు ఈ పుస్తకం చేరుకోవాలని నా కోరిక. ప్రపంచంలోని అనేక సంఘటనలను సినిమా ప్రతిబింబిస్తుంది. ప్రతిభావంతుడైన దర్శకుడు సమాజానికి ఏమీ బోధించడు, కేవలం ఒక అద్దంలా ఉండి తాను చూసిన వాటిని సినిమా ద్వారా మన ముందు పరుస్తాడు. ఆ సినిమాల నుండి మనం ఏం తీసుకుంటామనేది మన నైతికత, ఆసక్తి, ఆలోచన మీద ఆధారపడి ఉంటుంది. ఆకోణంలో నాకు అర్ధమైన మేరకు రాసిన ఈ పుస్తకం మీకు ఎంతో కొంత ఉపయోగ పడుతుందని ఆశిస్తున్నాను                                                                                                                               - సూర్య ప్రకాష్ జోశ్యుల

Features

  • : Hitchcock Numchi Nolan Daka- 3 books set
  • : Surya Prakash Joytsla
  • : Chaaya Resource Centre
  • : MANIMN2878
  • : Paperback
  • : Dec-2021
  • : 3 book set
  • : Telugu

Reviews

Be the first one to review this product

Discussion:Hitchcock Numchi Nolan Daka- 3 books set

Be the first to start a discussion Start a new discussion

Browse all Discussions on Books
Powered by infibeam