అంతరిక్షయాత్ర
1975 ఫిబ్రవరి 28 ఉదయం గం.9-20ని.
గ్రౌండ్ కంట్రోల్ రూంకు సరిగ్గా మైలు దూరంలో వున్న 'లాంచింగ్ పాడ్' దగ్గర శ్రీహరి కోట రాకెట్ సెంటర్ వాన్ నిదానంగా ఆగింది.
వాన్ ముందు వచ్చిన సెక్యూరిటీ పైలట్స్ పరిసరాలను పరికించి 'ఓ.కె.' చెప్పారు. వాన్ నుండి రాకెట్ సెంటర్ డైరెక్టర్ మిశ్రా, వ్యోమగాములు కమలాకర్, పద్మాకర్ క్రిందకు దిగారు.
వెనుకనున్న వాన్లో నుండి సెక్యూరిటీ స్టాఫ్ బిలబిలమంటూ దిగారు.
100 ఎకరాల విశాల భూభాగం మధ్యన భారీ ఎత్తున నిర్మించబడిన రాకెట్ లాంచింగు పాడ్ దగ్గరకు నడిచారు ముగ్గురూ, సెక్యూరిటీ స్టాఫ్ సహా.
మిలటరీ కమాండర్ ఆదేశాల ప్రకారం సెక్యూరిటీ ఫోర్స్ అంతా లాంచింగు పాడ్ చుట్టూ వలయాకారంలో ఆయుధాలతో పొజిషన్లో నిలబడ్డారు.
300 అడుగుల ఎత్తున పటిష్టమైన లోహాలతో తయారు చేయబడిన క్యాచింగు గాంట్రీకీ ఫిక్స్ చేయబడి వుంది స్పేస్ షిప్. సూర్యకిరణాలు స్పేస్ షిప్పై బడి వింతకాంతులను విరజిమ్ముతున్నాయి. రాకెట్ క్యాచింగు గాంట్రీకి మూడువైపులా రాకెటులో ప్రవేశించడానికి అనువుగా ఫోర్టీన్ స్టోరీ గాంట్రీలు ఎరేంజ్ చేయబడివున్నాయి. రాకెట్ వివిధ భాగాలను ఆయా సెక్షన్లకు చెందిన అధికారులు తనిఖీ చేస్తున్నారు.
250 అడుగుల ఎత్తు కలిగి స్థూపాకారంలో వున్న రాకెట్కు పైన మార్స్-2 స్పేస్ షిప్ అమర్చబడివుంది. స్పేస్ షిప్ అకారం బోర్లించిన గరాటాలా, పైన సూదిమొనగా వుంది. క్రింద వెడల్పుగా వుంది. స్పేస్ షిప్ కవర్ భాగం అనేక పటిష్టమైన ధాతువులతో నిర్మింపబడివుంది.......................
అంతరిక్షయాత్ర 1975 ఫిబ్రవరి 28 ఉదయం గం.9-20ని. గ్రౌండ్ కంట్రోల్ రూంకు సరిగ్గా మైలు దూరంలో వున్న 'లాంచింగ్ పాడ్' దగ్గర శ్రీహరి కోట రాకెట్ సెంటర్ వాన్ నిదానంగా ఆగింది. వాన్ ముందు వచ్చిన సెక్యూరిటీ పైలట్స్ పరిసరాలను పరికించి 'ఓ.కె.' చెప్పారు. వాన్ నుండి రాకెట్ సెంటర్ డైరెక్టర్ మిశ్రా, వ్యోమగాములు కమలాకర్, పద్మాకర్ క్రిందకు దిగారు. వెనుకనున్న వాన్లో నుండి సెక్యూరిటీ స్టాఫ్ బిలబిలమంటూ దిగారు. 100 ఎకరాల విశాల భూభాగం మధ్యన భారీ ఎత్తున నిర్మించబడిన రాకెట్ లాంచింగు పాడ్ దగ్గరకు నడిచారు ముగ్గురూ, సెక్యూరిటీ స్టాఫ్ సహా. మిలటరీ కమాండర్ ఆదేశాల ప్రకారం సెక్యూరిటీ ఫోర్స్ అంతా లాంచింగు పాడ్ చుట్టూ వలయాకారంలో ఆయుధాలతో పొజిషన్లో నిలబడ్డారు. 300 అడుగుల ఎత్తున పటిష్టమైన లోహాలతో తయారు చేయబడిన క్యాచింగు గాంట్రీకీ ఫిక్స్ చేయబడి వుంది స్పేస్ షిప్. సూర్యకిరణాలు స్పేస్ షిప్పై బడి వింతకాంతులను విరజిమ్ముతున్నాయి. రాకెట్ క్యాచింగు గాంట్రీకి మూడువైపులా రాకెటులో ప్రవేశించడానికి అనువుగా ఫోర్టీన్ స్టోరీ గాంట్రీలు ఎరేంజ్ చేయబడివున్నాయి. రాకెట్ వివిధ భాగాలను ఆయా సెక్షన్లకు చెందిన అధికారులు తనిఖీ చేస్తున్నారు. 250 అడుగుల ఎత్తు కలిగి స్థూపాకారంలో వున్న రాకెట్కు పైన మార్స్-2 స్పేస్ షిప్ అమర్చబడివుంది. స్పేస్ షిప్ అకారం బోర్లించిన గరాటాలా, పైన సూదిమొనగా వుంది. క్రింద వెడల్పుగా వుంది. స్పేస్ షిప్ కవర్ భాగం అనేక పటిష్టమైన ధాతువులతో నిర్మింపబడివుంది.......................© 2017,www.logili.com All Rights Reserved.