ఆ గదిలో సమావేశమైన బృందంలో పట్టుమని పదిమంది కూడా లేరు. ఓ పాత సీలింగు ఫ్యాను బద్ధకంగా తిరుగుతోంది. గదిలో గాలి ఆడటంలేదు. ఆ ఉక్కకి ప్రతి ఒక్కరూ చెమటలు కక్కుతున్నారు. అయినా వాళ్ళు అదేమీ పట్టించుకునే స్థితిలో లేరు.
గదంతా విషాదం ఆవరించినట్టుగా ఉంది. ఉన్నది పదిమందే అయినా, గది యావత్తు కిక్కిరిసిపోయినట్టుగా ఉంది. అందరూ తలలు వేళ్లాడేసుకుని కూర్చున్నారు. ఆ మధ్యాహ్నం జరిగిన హైజాక్ ప్రయత్నం రసాభాసయిపోయి వాళ్ళ సహచరుడు పోలీసు తుపాకిగుళ్ళకి బలైపోయాడు. దాంతో వాళ్ళకి ఎక్కడలేని నైరాశ్యం ముంచుకొచ్చింది. నిస్సహాయతతో, నిరాశతో కృంగిపోయారు. వారందరూ యువకులు, అందమైన వాళ్ళు, ఒక ఆశయానికి నిబద్ధులయిన వాళ్లు తమ ఆశయంకోసం తనువులర్పించ టానికి తయారయి ఉన్నారు. పట్టుబడ్డా ప్రాణాల కోసం దేబిరించేవాళ్లు కాదు. ఓటమికన్నా మరణమే మేలనే దృఢ సంకల్పం వాళ్ళది.
అయినా వాళ్ళీరోజు ఓడిపోయినట్లుగా బాధపడుతున్నారు. అయినా తుడిచి పెట్టుకుపోయామని మాత్రం అనుకోవటం లేదు. ఎన్నో వ్యతిరేక పరిస్థితుల్ని తట్టుకుని బాల్సా పోరాడాడు. ఎన్నో ఓటములు చవిచూశాడు. కాని ఓటమికి తలవంచలేదు. అంతిమ విజయం ఖల్సాదే. అది వాళ్ళందరికీ తెలుసు. అది చరిత్ర సత్యం. దాన్నుంచే తరిగిపోయిన ఉత్సాహాన్ని తిరిగి పుంజుకుని నిరంతరాయంగా పోరాడతారు. అయినా వాళ్లూ మానవమాత్రులే. మానవ సహజమయిన బాధ, దుఃఖం వాళ్ళని కృంగదీశాయి..................
ఆ గదిలో సమావేశమైన బృందంలో పట్టుమని పదిమంది కూడా లేరు. ఓ పాత సీలింగు ఫ్యాను బద్ధకంగా తిరుగుతోంది. గదిలో గాలి ఆడటంలేదు. ఆ ఉక్కకి ప్రతి ఒక్కరూ చెమటలు కక్కుతున్నారు. అయినా వాళ్ళు అదేమీ పట్టించుకునే స్థితిలో లేరు. గదంతా విషాదం ఆవరించినట్టుగా ఉంది. ఉన్నది పదిమందే అయినా, గది యావత్తు కిక్కిరిసిపోయినట్టుగా ఉంది. అందరూ తలలు వేళ్లాడేసుకుని కూర్చున్నారు. ఆ మధ్యాహ్నం జరిగిన హైజాక్ ప్రయత్నం రసాభాసయిపోయి వాళ్ళ సహచరుడు పోలీసు తుపాకిగుళ్ళకి బలైపోయాడు. దాంతో వాళ్ళకి ఎక్కడలేని నైరాశ్యం ముంచుకొచ్చింది. నిస్సహాయతతో, నిరాశతో కృంగిపోయారు. వారందరూ యువకులు, అందమైన వాళ్ళు, ఒక ఆశయానికి నిబద్ధులయిన వాళ్లు తమ ఆశయంకోసం తనువులర్పించ టానికి తయారయి ఉన్నారు. పట్టుబడ్డా ప్రాణాల కోసం దేబిరించేవాళ్లు కాదు. ఓటమికన్నా మరణమే మేలనే దృఢ సంకల్పం వాళ్ళది. అయినా వాళ్ళీరోజు ఓడిపోయినట్లుగా బాధపడుతున్నారు. అయినా తుడిచి పెట్టుకుపోయామని మాత్రం అనుకోవటం లేదు. ఎన్నో వ్యతిరేక పరిస్థితుల్ని తట్టుకుని బాల్సా పోరాడాడు. ఎన్నో ఓటములు చవిచూశాడు. కాని ఓటమికి తలవంచలేదు. అంతిమ విజయం ఖల్సాదే. అది వాళ్ళందరికీ తెలుసు. అది చరిత్ర సత్యం. దాన్నుంచే తరిగిపోయిన ఉత్సాహాన్ని తిరిగి పుంజుకుని నిరంతరాయంగా పోరాడతారు. అయినా వాళ్లూ మానవమాత్రులే. మానవ సహజమయిన బాధ, దుఃఖం వాళ్ళని కృంగదీశాయి..................© 2017,www.logili.com All Rights Reserved.