అపర భీష్ముడు కెసియార్
తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడాలన్న డిమాండుతో కె. చంద్రశేఖర రావు (కెసియార్) అధ్యక్షుడిగా ఏర్పడిన తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) 1994 నుంచి 2004 వరకు ఉమ్మడి రాష్ట్రాన్ని పాలిస్తూ వచ్చిన టిడిపి ప్రభుత్వాన్ని గద్దె దింపడానికై కాంగ్రెసు పార్టీతో, సిపిఐ, సిపిఎంలతో జట్టు కట్టి 2004లో కేంద్రంలో యుపిఏ-1 ప్రభుత్వం ఏర్పడగా, రాష్ట్రంలో కాంగ్రెసు ముఖ్యమంత్రిగా అధికారంలోకి వచ్చిన వైయస్ రాజశేఖర రెడ్డి (వైయస్సార్) తెలంగాణ ఉద్యమాన్ని నీరు కార్చడానికి ప్రయత్నించడంతో కెసియార్ కోపగించి ఉన్నారు. 2004 నాటి కాంగ్రెసు విజయానికి తెరాసతో పొత్తే కారణమైందన్న అంచనాతో చంద్రబాబు 2009 ఎన్నికల నాటికి తెరాస, సిపిఐ, సిపిఎంలతో కలిసి 'మహా కూటమి'గా ఏర్పరిచే ప్రయత్నాలు చేస్తున్నారు. కానీ కెసియార్ ఎటూ తేల్చకుండా, అందరితో బేరాలాడుతూ నానుస్తున్నారు. 2009 సంవత్సరం విచ్చేసే నాటికి పరిస్థితి యిది. 2009 జనవరిలో జరిగిన సంఘటనలపై వ్యాఖ్యానంతో యీ పుస్తకం ప్రారంభమౌతోంది.
ఆకాశంలో చంద్రుడు, శుక్రుడు ఒక పక్కకు చేరిన రోజుల్లోనే మహా కూటమి వారి ఆకాశంలో యిద్దరు చంద్రులు ఒకేసారి వెలిశారు. నవ్వుల వెన్నెలలు కురిపించారు కానీ పొత్తు గురించి ప్రకటన చేయడానికి సిద్ధపడలేదు. ఉత్తరాయణం రావాలన్నారు కెసియార్. ఉత్తరాయణం అనగానే భీష్ముడు గుర్తుకు వస్తాడు అందరికీ. కురుక్షేత్ర యుద్ధంలో నేల కొరిగాక భీష్ముడు అంపశయ్య మీద పడి వుండి, మకర సంక్రాంతి అనంతరం ఉత్తరాయణం ప్రారంభమై, స్వర్గద్వారాలు తెరుచు కున్నాక అప్పుడు చావు పోతే కోరుకుంటానులే అన్నాడు. ఉత్తరాయణంలో స్వర్గద్వారాల సౌలభ్యం ఉందని తెలిసిన భీష్ముడు దుర్యోధ నాదులు యుద్ధం షెడ్యూల్ చేసినపుడు 'నాయనలారా! ఇంతకాలం ఆగినది ఎలాగూ,,,,,,,,,,,,,,,,,
అపర భీష్ముడు కెసియార్ తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడాలన్న డిమాండుతో కె. చంద్రశేఖర రావు (కెసియార్) అధ్యక్షుడిగా ఏర్పడిన తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) 1994 నుంచి 2004 వరకు ఉమ్మడి రాష్ట్రాన్ని పాలిస్తూ వచ్చిన టిడిపి ప్రభుత్వాన్ని గద్దె దింపడానికై కాంగ్రెసు పార్టీతో, సిపిఐ, సిపిఎంలతో జట్టు కట్టి 2004లో కేంద్రంలో యుపిఏ-1 ప్రభుత్వం ఏర్పడగా, రాష్ట్రంలో కాంగ్రెసు ముఖ్యమంత్రిగా అధికారంలోకి వచ్చిన వైయస్ రాజశేఖర రెడ్డి (వైయస్సార్) తెలంగాణ ఉద్యమాన్ని నీరు కార్చడానికి ప్రయత్నించడంతో కెసియార్ కోపగించి ఉన్నారు. 2004 నాటి కాంగ్రెసు విజయానికి తెరాసతో పొత్తే కారణమైందన్న అంచనాతో చంద్రబాబు 2009 ఎన్నికల నాటికి తెరాస, సిపిఐ, సిపిఎంలతో కలిసి 'మహా కూటమి'గా ఏర్పరిచే ప్రయత్నాలు చేస్తున్నారు. కానీ కెసియార్ ఎటూ తేల్చకుండా, అందరితో బేరాలాడుతూ నానుస్తున్నారు. 2009 సంవత్సరం విచ్చేసే నాటికి పరిస్థితి యిది. 2009 జనవరిలో జరిగిన సంఘటనలపై వ్యాఖ్యానంతో యీ పుస్తకం ప్రారంభమౌతోంది. ఆకాశంలో చంద్రుడు, శుక్రుడు ఒక పక్కకు చేరిన రోజుల్లోనే మహా కూటమి వారి ఆకాశంలో యిద్దరు చంద్రులు ఒకేసారి వెలిశారు. నవ్వుల వెన్నెలలు కురిపించారు కానీ పొత్తు గురించి ప్రకటన చేయడానికి సిద్ధపడలేదు. ఉత్తరాయణం రావాలన్నారు కెసియార్. ఉత్తరాయణం అనగానే భీష్ముడు గుర్తుకు వస్తాడు అందరికీ. కురుక్షేత్ర యుద్ధంలో నేల కొరిగాక భీష్ముడు అంపశయ్య మీద పడి వుండి, మకర సంక్రాంతి అనంతరం ఉత్తరాయణం ప్రారంభమై, స్వర్గద్వారాలు తెరుచు కున్నాక అప్పుడు చావు పోతే కోరుకుంటానులే అన్నాడు. ఉత్తరాయణంలో స్వర్గద్వారాల సౌలభ్యం ఉందని తెలిసిన భీష్ముడు దుర్యోధ నాదులు యుద్ధం షెడ్యూల్ చేసినపుడు 'నాయనలారా! ఇంతకాలం ఆగినది ఎలాగూ,,,,,,,,,,,,,,,,,© 2017,www.logili.com All Rights Reserved.