వలసపాలన కాలంలో భౌగోళిక ఉత్తరాంధ్రలో భూసంబంధాలు రైతాంగ, గిరిజన ఉద్యమాలు
విశాఖ, గంజాం జిల్లాల విస్తీర్ణం :- నేడు భౌగోళికంగా ఉత్తరాంధ్రగా పిలవబడుతున్న శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ జిల్లాలలోని ప్రాంతం వలస పాలనకాలంలో 1936 వరకూ గంజాం, విశాఖపట్నం (వైజాగపటం) జిల్లాలో విస్తరించిఉంది. 1936 నాటికి గంజాం జిల్లా మొత్తం విస్తీర్ణం 8,372 చదరపు మైళ్లు కాగా, వైజాగపటం జిల్లా విస్తీర్ణం 17,222 చదరపు మైళ్లు. ఆనాటికి మద్రాస్ ప్రెసిడెన్సీలోనే అత్యధిక జనాభా వైజాగపటం జిల్లాలో ఉంది. భౌగోళికంగా దట్టమైన అడవులు, పర్వత ప్రాంతాలతో ఈ రెండు జిల్లాలు నిండిఉండి వ్యూహాత్మక ప్రాంతంగా ఉండేవి.
ఆనాడు గంజాం జిల్లాలో 15 తాలూకాలు, వైజాగపటం జిల్లాలో 22 తాలూకాలు ఉండేవి. ఇందులో ఏజన్సీ ప్రాంతాలుగా ప్రకటించబడినవి సూరాడ తాలూకాలోని కొంత ప్రాంతం, సోంపేట తాలూకాలోని కొంత ప్రాంతం, పర్లాకిమిడీ తాలూకాలోని కొంత ప్రాంతం గంజాం జిల్లాలో ఉన్నాయి. విశాఖ జిల్లాలో ఉన్న 22 తాలూకాలో 15 తాలూకాలలో ఏజన్సీ ప్రాంతాలుండేవి. ఇందులో పూర్తిస్థాయిలో ఏజన్సీగా ప్రకటించబడిన ప్రాంతాలుగా కోరాపుట్, నవరంగపూర్, జైపూర్, మల్కనగిరి, సాద్వా బిసంకటక్, గుణుపూర్, రాయఘడలున్నాయి. పాక్షిక ఏజన్సీ ప్రాంతాలు పార్వతీపురం, సాలూరు, పాలకొండ, శృంగవరపుకోట, గొలుగొండ, వీరవల్లి తాలూకాలలో ఉన్నాయి. 1901 జనాభా లెక్కల ప్రకారం, గంజాం జిల్లా జనాభా 20,10,256 కాగా వైజాగపటం జిల్లా జనాభా 29,33,650 సూక్ష్మంగా ఈ జిల్లాల భౌగోళిక నేపథ్యమిది.
ఈ ప్రాంతంలో బ్రిటిష్ వలసపాలకుల ఆధిపత్యం :- ప్రాధమికంగా ఈ రెండు జిల్లాలు మొఘలాయిలు తర్వాత కాలంలో ఫ్రెంచివారి ఆధిపత్యంలో కొనసాగాయి. అయినప్పటికీ ఈ ప్రాంతాలు స్థానికంగా కొండజాతికి చెందిన రాజుల ఆధీనంలోనూ, క్షత్రియ, వెలమ కులాలకు చెందిన వారి పాలనలోనే కొనసాగాయి. ఆనాటికి రాజులు శిస్తు వసూలు చేసే అధికారం, రక్షణకోసం స్వంత సైనిక బలగాలను పోషించుకునే అధికారం కల్గిఉన్నారు. అయితే ఈ ప్రాంతంలో అత్యధికభాగం విజయనగరం రాజుల ఆధీనంలోనే ఉండేది. బొబ్బిలి యుద్ధం తదనంతర పరిణామాలలో ఈ గడ్డపైకి బ్రిటిష్ వలసపాలకులను విజయనగరం రాజు ఆనందగజపతిరాజు ఆహ్వానించాడు. బ్రిటిష్వారితో చేతులు కలిపి ఫ్రెంచివారిని యుద్ధంలో ఓడించడం ద్వారా ఈ ప్రాంతంపై బ్రిటిష్ వలసపాలన ప్రత్యక్షంగా ప్రారంభమైంది. ఈ యుద్ధానంతర పరిణామాలలో నైజాం నవాబు సలాబతంగ్కు, బ్రిటిష్ ఈస్టిండియా కంపెనీ వారికి జరిగిన సంధిలో భాగంగా మొత్తంగా ఈప్రాంతం బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ పాలనలోకి వెళ్లింది. అయినప్పటికీ స్థానికంగా ఈ ప్రాంతాలకే చెందిన రాజుల ప్రత్యక్ష పర్యవేక్షణలోనే సామాన్యప్రజానీకం ఉంది. యుద్ధం జరిగి, విజయం సాధిస్తే జరగబోయే పరిణామాలను గురించి విజయనగరం రాజులకు, ఆంగ్లేయులకు మధ్య ఒక ఒప్పందం కూడా కుదిరింది. ఆ ఒప్పందానికి కీలకాంశాలు ఇలా ఉన్నాయి...................
వలసపాలన కాలంలో భౌగోళిక ఉత్తరాంధ్రలో భూసంబంధాలు రైతాంగ, గిరిజన ఉద్యమాలు విశాఖ, గంజాం జిల్లాల విస్తీర్ణం :- నేడు భౌగోళికంగా ఉత్తరాంధ్రగా పిలవబడుతున్న శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ జిల్లాలలోని ప్రాంతం వలస పాలనకాలంలో 1936 వరకూ గంజాం, విశాఖపట్నం (వైజాగపటం) జిల్లాలో విస్తరించిఉంది. 1936 నాటికి గంజాం జిల్లా మొత్తం విస్తీర్ణం 8,372 చదరపు మైళ్లు కాగా, వైజాగపటం జిల్లా విస్తీర్ణం 17,222 చదరపు మైళ్లు. ఆనాటికి మద్రాస్ ప్రెసిడెన్సీలోనే అత్యధిక జనాభా వైజాగపటం జిల్లాలో ఉంది. భౌగోళికంగా దట్టమైన అడవులు, పర్వత ప్రాంతాలతో ఈ రెండు జిల్లాలు నిండిఉండి వ్యూహాత్మక ప్రాంతంగా ఉండేవి. ఆనాడు గంజాం జిల్లాలో 15 తాలూకాలు, వైజాగపటం జిల్లాలో 22 తాలూకాలు ఉండేవి. ఇందులో ఏజన్సీ ప్రాంతాలుగా ప్రకటించబడినవి సూరాడ తాలూకాలోని కొంత ప్రాంతం, సోంపేట తాలూకాలోని కొంత ప్రాంతం, పర్లాకిమిడీ తాలూకాలోని కొంత ప్రాంతం గంజాం జిల్లాలో ఉన్నాయి. విశాఖ జిల్లాలో ఉన్న 22 తాలూకాలో 15 తాలూకాలలో ఏజన్సీ ప్రాంతాలుండేవి. ఇందులో పూర్తిస్థాయిలో ఏజన్సీగా ప్రకటించబడిన ప్రాంతాలుగా కోరాపుట్, నవరంగపూర్, జైపూర్, మల్కనగిరి, సాద్వా బిసంకటక్, గుణుపూర్, రాయఘడలున్నాయి. పాక్షిక ఏజన్సీ ప్రాంతాలు పార్వతీపురం, సాలూరు, పాలకొండ, శృంగవరపుకోట, గొలుగొండ, వీరవల్లి తాలూకాలలో ఉన్నాయి. 1901 జనాభా లెక్కల ప్రకారం, గంజాం జిల్లా జనాభా 20,10,256 కాగా వైజాగపటం జిల్లా జనాభా 29,33,650 సూక్ష్మంగా ఈ జిల్లాల భౌగోళిక నేపథ్యమిది. ఈ ప్రాంతంలో బ్రిటిష్ వలసపాలకుల ఆధిపత్యం :- ప్రాధమికంగా ఈ రెండు జిల్లాలు మొఘలాయిలు తర్వాత కాలంలో ఫ్రెంచివారి ఆధిపత్యంలో కొనసాగాయి. అయినప్పటికీ ఈ ప్రాంతాలు స్థానికంగా కొండజాతికి చెందిన రాజుల ఆధీనంలోనూ, క్షత్రియ, వెలమ కులాలకు చెందిన వారి పాలనలోనే కొనసాగాయి. ఆనాటికి రాజులు శిస్తు వసూలు చేసే అధికారం, రక్షణకోసం స్వంత సైనిక బలగాలను పోషించుకునే అధికారం కల్గిఉన్నారు. అయితే ఈ ప్రాంతంలో అత్యధికభాగం విజయనగరం రాజుల ఆధీనంలోనే ఉండేది. బొబ్బిలి యుద్ధం తదనంతర పరిణామాలలో ఈ గడ్డపైకి బ్రిటిష్ వలసపాలకులను విజయనగరం రాజు ఆనందగజపతిరాజు ఆహ్వానించాడు. బ్రిటిష్వారితో చేతులు కలిపి ఫ్రెంచివారిని యుద్ధంలో ఓడించడం ద్వారా ఈ ప్రాంతంపై బ్రిటిష్ వలసపాలన ప్రత్యక్షంగా ప్రారంభమైంది. ఈ యుద్ధానంతర పరిణామాలలో నైజాం నవాబు సలాబతంగ్కు, బ్రిటిష్ ఈస్టిండియా కంపెనీ వారికి జరిగిన సంధిలో భాగంగా మొత్తంగా ఈప్రాంతం బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ పాలనలోకి వెళ్లింది. అయినప్పటికీ స్థానికంగా ఈ ప్రాంతాలకే చెందిన రాజుల ప్రత్యక్ష పర్యవేక్షణలోనే సామాన్యప్రజానీకం ఉంది. యుద్ధం జరిగి, విజయం సాధిస్తే జరగబోయే పరిణామాలను గురించి విజయనగరం రాజులకు, ఆంగ్లేయులకు మధ్య ఒక ఒప్పందం కూడా కుదిరింది. ఆ ఒప్పందానికి కీలకాంశాలు ఇలా ఉన్నాయి...................© 2017,www.logili.com All Rights Reserved.