వన్ మిలియన్ పౌండ్ నోట్
నా పేరు హెన్రీయాడమ్స్. నేను అమెరికా వాసిని. నాకు జీవితంలో అనుకోని ఒక వింత సంఘటన జరిగింది. నాకు తెలిసి ఇలాంటి ఘటన ప్రపంచంలో మరెవరికీ జరిగిఉండదు. 1903లో నాకు ఇరవైఏడేళ్ళ వయసు వున్నప్పుడు శాన్ ఫ్రాన్సిస్కోలోని ఒక షిబిల్డింగ్ కంపెనీ బ్రోకర్ దగ్గర నేను క్లర్క్ గా పనిచేసే వాడిని. గిడ్డంగులలో భద్రపరిచే స్టాక్స్కి సంబంధించిన అన్ని విషయాలలో నైపుణ్యం కలవాడిని. నాకంటూ ఈ ప్రపంచంలో ఎవరూ లేరు, నేను ఒంటరివాడిని.. ఒకరిమీద ఆధారపడి బ్రతకవలసిన అవసరం అయితే నాకు ఇంతవరకు రాలేదు. కేవలం నా కష్టాన్ని, సమయస్ఫూర్తిని, నేను సంపాదించుకున్న నమ్మకం, గౌరవమర్యాదలను మాత్రమే నమ్ముకుని బ్రతుకుతున్నాను. వీటివల్లనే నాకు అనుకోని అదృష్టం కలిగింది. అదృష్టం వచ్చినా నేను పొంగిపోలేదు, పొగరుగా తయారవలేదు. అతిగా ఆశపడే మనస్తత్వం కాదునాది.. ఎప్పటిలాగా స్థిరంగానే ఉన్నాను.
ప్రతి శనివారం మధ్యాహ్నం నుండి సమయం నా చేతుల్లో ఉండేది. మళ్ళీ సోమవారం వచ్చేవరకు నాకు నచ్చినట్లుగా గడిపేవాడిని. నా పనులు నేను చేసుకునేవాడిని. నాకు సముద్రయానం అంటే చాలా ఇష్టం. అందుకే సముద్రానికి దగ్గరగావుండే ప్రాంతంలో ఒక చిన్నగదిని అద్దెకితీసుకుని హాయిగా నివాసం ఉంటున్నాను. ప్రతి వారాంతంలో ఒక చిన్న స్టీమర్ బోటు అద్దెకు తీసుకుని సముద్రంలో చాలా దూరంవరకు ఒంటరిగా వెళ్ళి తిరిగి వచ్చేవాడిని. ఒక శనివారం ఎప్పటిలాగానే ఒకచిన్న బోట్ ఎక్కి సముద్రం మీదకి బయలుదేరాను. నాకు తెలియకుండానే సముద్రంలో కొన్ని గంటలకు పైగా అలా ఒక్కడినే చాలాదూరం ప్రయాణించాను. మధ్యాహ్నం అయ్యాక.........................
వన్ మిలియన్ పౌండ్ నోట్ నా పేరు హెన్రీయాడమ్స్. నేను అమెరికా వాసిని. నాకు జీవితంలో అనుకోని ఒక వింత సంఘటన జరిగింది. నాకు తెలిసి ఇలాంటి ఘటన ప్రపంచంలో మరెవరికీ జరిగిఉండదు. 1903లో నాకు ఇరవైఏడేళ్ళ వయసు వున్నప్పుడు శాన్ ఫ్రాన్సిస్కోలోని ఒక షిబిల్డింగ్ కంపెనీ బ్రోకర్ దగ్గర నేను క్లర్క్ గా పనిచేసే వాడిని. గిడ్డంగులలో భద్రపరిచే స్టాక్స్కి సంబంధించిన అన్ని విషయాలలో నైపుణ్యం కలవాడిని. నాకంటూ ఈ ప్రపంచంలో ఎవరూ లేరు, నేను ఒంటరివాడిని.. ఒకరిమీద ఆధారపడి బ్రతకవలసిన అవసరం అయితే నాకు ఇంతవరకు రాలేదు. కేవలం నా కష్టాన్ని, సమయస్ఫూర్తిని, నేను సంపాదించుకున్న నమ్మకం, గౌరవమర్యాదలను మాత్రమే నమ్ముకుని బ్రతుకుతున్నాను. వీటివల్లనే నాకు అనుకోని అదృష్టం కలిగింది. అదృష్టం వచ్చినా నేను పొంగిపోలేదు, పొగరుగా తయారవలేదు. అతిగా ఆశపడే మనస్తత్వం కాదునాది.. ఎప్పటిలాగా స్థిరంగానే ఉన్నాను. ప్రతి శనివారం మధ్యాహ్నం నుండి సమయం నా చేతుల్లో ఉండేది. మళ్ళీ సోమవారం వచ్చేవరకు నాకు నచ్చినట్లుగా గడిపేవాడిని. నా పనులు నేను చేసుకునేవాడిని. నాకు సముద్రయానం అంటే చాలా ఇష్టం. అందుకే సముద్రానికి దగ్గరగావుండే ప్రాంతంలో ఒక చిన్నగదిని అద్దెకితీసుకుని హాయిగా నివాసం ఉంటున్నాను. ప్రతి వారాంతంలో ఒక చిన్న స్టీమర్ బోటు అద్దెకు తీసుకుని సముద్రంలో చాలా దూరంవరకు ఒంటరిగా వెళ్ళి తిరిగి వచ్చేవాడిని. ఒక శనివారం ఎప్పటిలాగానే ఒకచిన్న బోట్ ఎక్కి సముద్రం మీదకి బయలుదేరాను. నాకు తెలియకుండానే సముద్రంలో కొన్ని గంటలకు పైగా అలా ఒక్కడినే చాలాదూరం ప్రయాణించాను. మధ్యాహ్నం అయ్యాక.........................© 2017,www.logili.com All Rights Reserved.