నిదుర పట్టడం లేదన్నావని నా హృదయం నీకిచ్చాను,
ఎదసడిలో లాలిపాట వింటావనే నమ్మకంతో.
అడుగుల బాటలో పడేసి, దానిపై నడిచి
ముళ్ళ దారి అదొస్తే, దిక్కు తోచక వాడుకున్నావన్నావు.
కాలక్షేపం కావటం లేదన్నావని నా క్షణాలు నీకిచ్చాను,
కలతను వీడి, కలలో విహరిస్తావనే ఆశతో.
తెల్లవారగానే రెప్పల బయటే వాటిని విడిచేసి
కనుపాపలు మోయలేని భారమైపోయాయన్నావు.
చీకటిలో బ్రతుకు లేదన్నావని నా కలలను నీకిచ్చాను,
ఇద్దరం కలిసి ఒకే వెలుగును చూస్తామనే ఆనందంతో.
నిశ్వాసల సుడిగాలులతో ఆర్పేసి
ఈ వెలుగే సరికొత్త నీడలను సృష్టిస్తోంది, అక్కర్లేదన్నావు.
కాలం అందటం లేదన్నావని నా శాశ్వతత్వాన్ని నీకిచ్చాను,
కాలాతీతంగా మన ప్రేమ నిలుస్తుందనే విశ్వాసంతో.
చేతివ్రేళ్ళ నడుమ ఇసుకలా చేజార్చి
అమరత్వాన్ని పొందే దైవత్వం ఉండజాలదన్నావు.
పుస్తకం మూసేసి, మౌనంగా స్టాఫ్ రూమ్లో కూర్చున్నాడు వేణు సార్. మిగతా....................
నిదుర పట్టడం లేదన్నావని నా హృదయం నీకిచ్చాను, ఎదసడిలో లాలిపాట వింటావనే నమ్మకంతో. అడుగుల బాటలో పడేసి, దానిపై నడిచిముళ్ళ దారి అదొస్తే, దిక్కు తోచక వాడుకున్నావన్నావు. కాలక్షేపం కావటం లేదన్నావని నా క్షణాలు నీకిచ్చాను, కలతను వీడి, కలలో విహరిస్తావనే ఆశతో. తెల్లవారగానే రెప్పల బయటే వాటిని విడిచేసి కనుపాపలు మోయలేని భారమైపోయాయన్నావు. చీకటిలో బ్రతుకు లేదన్నావని నా కలలను నీకిచ్చాను, ఇద్దరం కలిసి ఒకే వెలుగును చూస్తామనే ఆనందంతో. నిశ్వాసల సుడిగాలులతో ఆర్పేసిఈ వెలుగే సరికొత్త నీడలను సృష్టిస్తోంది, అక్కర్లేదన్నావు. కాలం అందటం లేదన్నావని నా శాశ్వతత్వాన్ని నీకిచ్చాను, కాలాతీతంగా మన ప్రేమ నిలుస్తుందనే విశ్వాసంతో. చేతివ్రేళ్ళ నడుమ ఇసుకలా చేజార్చిఅమరత్వాన్ని పొందే దైవత్వం ఉండజాలదన్నావు. పుస్తకం మూసేసి, మౌనంగా స్టాఫ్ రూమ్లో కూర్చున్నాడు వేణు సార్. మిగతా....................© 2017,www.logili.com All Rights Reserved.