నరసింహకవి నన్ననుగ్రహించిన తీరు
నాకు చిన్నతనంనుంచీ భాషపట్ల మక్కువ. కవిత్వంలో ప్రాస, శ్లేష, పద ప్రయోగ వైచిత్రి వీటిపట్ల ఇష్టం. ఈ గుణం మా వంశంలో ఉన్నదే. చక్కని పలుకుబడులతో, నుడికారంతో మా బామ్మ, తాతగారు, ఇంట్లో పెద్దలు మాట్లాడుతూ. వుండేవారు. ఉయ్యాల బల్లపై కూర్చొని మధ్యాహ్నంవేళ ఆంధ్ర మహాభారతం వాళ్ళు చదవడం నాకింకా గుర్తే. మా బామ్మగారు అలవోకగా చెప్పే వందల పద్యాలు, శ్లోకాలు ఆనందంగా వినేవాణ్ణి. బాగా చిన్నప్పుడు మా తాతగారి నోట, తర్వాత కాస్త జ్ఞానం తెలిసినప్పటినుంచీ చాలాసార్లు మా బామ్మగారినోట - మా వంశంలో అనేక తరాలకు పూర్వం ఉన్న 'నరసకవి' పేరు వింటూ ఉండే వాడిని. తర్వాత, మహాప్రజ్ఞాశాలి మా పెద్దనాన్న డా|| వల్లూరి విశ్వేశ్వర సుబ్రహ్మణ్య శర్మ (పూర్వ ఆచార్యులు, కంప్యూటర్సైన్స్, ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ సైన్స్, బెంగళూరు) గారి ద్వారా 'నరసకవి' (నరసింహకవి) వ్రాసిన కావ్యం 'నాగ్నజితీ పరిణయము' అనీ, ఈ విషయం శ్రీ కందుకూరి వీరేశలింగంపంతులు గారి 'ఆంధ్రకవుల చరిత్రము'లో ప్రస్తావించబడిందనీ, అయితే మా పెద్దలెవరికీ ఈ కావ్యం ఎక్కడవుందో తెలియదనీ తెలుసుకున్నాను. మా పెద్దనాన్నగారు మా ఇంట్లోని ఒక పూర్వపు ప్రతినుండి తాను వేసివుంచిన మా వల్లూరివారి 'వంశ వృక్షాన్ని' నాకు ఇచ్చారు. అందులో, నాకు 5 తరాలకు పూర్వుడు, 6వ తరంవాడైన 'నరసకవి' ఒకాయన కనిపించాడు. ఆయన తాత (నాకు 8వ తరం పూర్వుడు) 'చిననరసు' అనే ఆయన మూలపురుషుడిగా ఈ వంశవృక్షం రూపొందింది.
నా 13 ఏళ్ళ వయస్సునుండే నా కవితారచన మొదలయ్యింది. నా ఎనిమిదవ యేటనే, తాడేపల్లిగూడెంలోని మా స్కూల్లో మాచేత సరస్వతీ విద్యాపరిషత్ సంస్థవారి (డా॥ దివాకర్ల వేంకటావధాని గారు అధ్యక్షులు) సంస్కృతపరీక్షలు కట్టించి, మాకు సంస్కృతం, తెలుగు బోధించిన మా మాస్టారు కీ॥శే॥ అనుముల వేంకటేశ్వర్లుగారు వేసిన సంస్కృతభాష పునాది నాకెంతో దోహదపడింది.
నరసింహకవి నన్ననుగ్రహించిన తీరు నాకు చిన్నతనంనుంచీ భాషపట్ల మక్కువ. కవిత్వంలో ప్రాస, శ్లేష, పద ప్రయోగ వైచిత్రి వీటిపట్ల ఇష్టం. ఈ గుణం మా వంశంలో ఉన్నదే. చక్కని పలుకుబడులతో, నుడికారంతో మా బామ్మ, తాతగారు, ఇంట్లో పెద్దలు మాట్లాడుతూ. వుండేవారు. ఉయ్యాల బల్లపై కూర్చొని మధ్యాహ్నంవేళ ఆంధ్ర మహాభారతం వాళ్ళు చదవడం నాకింకా గుర్తే. మా బామ్మగారు అలవోకగా చెప్పే వందల పద్యాలు, శ్లోకాలు ఆనందంగా వినేవాణ్ణి. బాగా చిన్నప్పుడు మా తాతగారి నోట, తర్వాత కాస్త జ్ఞానం తెలిసినప్పటినుంచీ చాలాసార్లు మా బామ్మగారినోట - మా వంశంలో అనేక తరాలకు పూర్వం ఉన్న 'నరసకవి' పేరు వింటూ ఉండే వాడిని. తర్వాత, మహాప్రజ్ఞాశాలి మా పెద్దనాన్న డా|| వల్లూరి విశ్వేశ్వర సుబ్రహ్మణ్య శర్మ (పూర్వ ఆచార్యులు, కంప్యూటర్సైన్స్, ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ సైన్స్, బెంగళూరు) గారి ద్వారా 'నరసకవి' (నరసింహకవి) వ్రాసిన కావ్యం 'నాగ్నజితీ పరిణయము' అనీ, ఈ విషయం శ్రీ కందుకూరి వీరేశలింగంపంతులు గారి 'ఆంధ్రకవుల చరిత్రము'లో ప్రస్తావించబడిందనీ, అయితే మా పెద్దలెవరికీ ఈ కావ్యం ఎక్కడవుందో తెలియదనీ తెలుసుకున్నాను. మా పెద్దనాన్నగారు మా ఇంట్లోని ఒక పూర్వపు ప్రతినుండి తాను వేసివుంచిన మా వల్లూరివారి 'వంశ వృక్షాన్ని' నాకు ఇచ్చారు. అందులో, నాకు 5 తరాలకు పూర్వుడు, 6వ తరంవాడైన 'నరసకవి' ఒకాయన కనిపించాడు. ఆయన తాత (నాకు 8వ తరం పూర్వుడు) 'చిననరసు' అనే ఆయన మూలపురుషుడిగా ఈ వంశవృక్షం రూపొందింది. నా 13 ఏళ్ళ వయస్సునుండే నా కవితారచన మొదలయ్యింది. నా ఎనిమిదవ యేటనే, తాడేపల్లిగూడెంలోని మా స్కూల్లో మాచేత సరస్వతీ విద్యాపరిషత్ సంస్థవారి (డా॥ దివాకర్ల వేంకటావధాని గారు అధ్యక్షులు) సంస్కృతపరీక్షలు కట్టించి, మాకు సంస్కృతం, తెలుగు బోధించిన మా మాస్టారు కీ॥శే॥ అనుముల వేంకటేశ్వర్లుగారు వేసిన సంస్కృతభాష పునాది నాకెంతో దోహదపడింది.© 2017,www.logili.com All Rights Reserved.