మొత్తానికి అవ్వ, ఆర్టీసీ బస్సు లోపలకు వచ్చేసింది. ఎలా వచ్చిందని? నదీ ప్రవాహంలో పడిన ఒక ఎండిన పండుటాకు నీటి కెరటాలు ఎలా సాగితే అలా, తన ప్రయత్నంతో నిమిత్తం లేకుండానే, సాగిపోయినట్టుగా అవ్వ బస్సు లోపలకు వచ్చేసింది. దారం తెగిపోయిన తరవాత పతంగు, తెన్ను ఏదీ తోచకుండా, వీచే గాలి ఎటువెడితే అటు ఎగిరిపోయినా.. చివరకు ఏ గుడిగోపురం మీది కలశానికో చిక్కుకుని స్థిరపడినట్టుగా... సుడులు తిరిగే జనం పోటు మధ్యలో చిక్కుకుని, అవ్వ బస్సు లోపలికే వచ్చేసింది. బస్సు ఆగే చోట, ఆ రోడ్డు మీద, ఒక వారగా గొంతు కూర్చుని, ఎప్పట్నించి ఉన్నదో ఆ అవ్వ! 'ఎక్కుదునా.. మానుదునా..' అనే సంశయాల గుంజాటనలో ఎంతసేపుగా వేచిఉన్నదో ఆ అవ్వ! బస్సుబస్సునూ ఆడజనసంద్రములు ముంచెత్తుతుండగా.. లేచి అందులో దుమికితే, బతుకుదునా చచ్చుదునా అనే భయాల పెనగులాటతో జంకి, ఎన్ని పొద్దులుగా నిరీక్షిం చినదో ఆ అవ్వ. చివరకు పైనమై వొచ్చినంక పేనాల మీద గుబులేటికి అని తెగించి, లేచి నిల్చున్నది. అంతే! ఆ అవ్వను జనప్రవాహం, అదే- ఆడజన ప్రవాహం, బస్సు ఆగిన వెంటనే బయటినుంచి లోనికి ఎగసిన ఒక కెరటంలా, ఎత్తి లోపల పడవేసింది. చాలాసే పటినుంచి ఆమెను గమనిస్తున్నప్పటికీ.. భుజబలమూ, అనుభవజనితమైన వ్యూహమూ. కౌశలమూ, బలహీనులను తోసివేయగల పాటవమూ ఉన్నదానిని గనుక.. బస్సు ఆగీ ఆగకముందే లోనికి చొరబడి సీటు దక్కించుకున్న భాగ్యశీలిని నేను!
బస్సు ఎలా ఉన్నదని? మేడారం జాతరలో సమ్మక్క సారలమ్మలు గద్దెనెక్కేనాడు. గద్దె దగ్గరకు పోటెత్తుతున్న జనసందోహం ఉంటుందే అలాగున్నది! తొక్కిడిగా ఆడవాళ్లే. చెప్పులే ఎరగని వాళ్లు, చెప్పులున్న వాళ్లు, హైహీల్స్ తొడిగిన వాళ్లు, బూట్లు వంటివి వేసిన వాళ్లు. అన్ని రకాలూ ఉన్నారు. ఒకరి కాళ్లను మరొకరు తొక్కేసుకుంటున్నారు. ఒకరి తొడలను మరొకరు మోకాళ్లతో పొడిచేసుకుంటున్నారు! బంగారం చెమ్కీలు అద్దిన మట్టిగాజులు వేసిన వాళ్లు, అచ్చమైన బంగారమే - బ్రేస్లెట్లుగానూ మట్టిగాజులకు అటూఇటూ...................
మొత్తానికి అవ్వ, ఆర్టీసీ బస్సు లోపలకు వచ్చేసింది. ఎలా వచ్చిందని? నదీ ప్రవాహంలో పడిన ఒక ఎండిన పండుటాకు నీటి కెరటాలు ఎలా సాగితే అలా, తన ప్రయత్నంతో నిమిత్తం లేకుండానే, సాగిపోయినట్టుగా అవ్వ బస్సు లోపలకు వచ్చేసింది. దారం తెగిపోయిన తరవాత పతంగు, తెన్ను ఏదీ తోచకుండా, వీచే గాలి ఎటువెడితే అటు ఎగిరిపోయినా.. చివరకు ఏ గుడిగోపురం మీది కలశానికో చిక్కుకుని స్థిరపడినట్టుగా... సుడులు తిరిగే జనం పోటు మధ్యలో చిక్కుకుని, అవ్వ బస్సు లోపలికే వచ్చేసింది. బస్సు ఆగే చోట, ఆ రోడ్డు మీద, ఒక వారగా గొంతు కూర్చుని, ఎప్పట్నించి ఉన్నదో ఆ అవ్వ! 'ఎక్కుదునా.. మానుదునా..' అనే సంశయాల గుంజాటనలో ఎంతసేపుగా వేచిఉన్నదో ఆ అవ్వ! బస్సుబస్సునూ ఆడజనసంద్రములు ముంచెత్తుతుండగా.. లేచి అందులో దుమికితే, బతుకుదునా చచ్చుదునా అనే భయాల పెనగులాటతో జంకి, ఎన్ని పొద్దులుగా నిరీక్షిం చినదో ఆ అవ్వ. చివరకు పైనమై వొచ్చినంక పేనాల మీద గుబులేటికి అని తెగించి, లేచి నిల్చున్నది. అంతే! ఆ అవ్వను జనప్రవాహం, అదే- ఆడజన ప్రవాహం, బస్సు ఆగిన వెంటనే బయటినుంచి లోనికి ఎగసిన ఒక కెరటంలా, ఎత్తి లోపల పడవేసింది. చాలాసే పటినుంచి ఆమెను గమనిస్తున్నప్పటికీ.. భుజబలమూ, అనుభవజనితమైన వ్యూహమూ. కౌశలమూ, బలహీనులను తోసివేయగల పాటవమూ ఉన్నదానిని గనుక.. బస్సు ఆగీ ఆగకముందే లోనికి చొరబడి సీటు దక్కించుకున్న భాగ్యశీలిని నేను! బస్సు ఎలా ఉన్నదని? మేడారం జాతరలో సమ్మక్క సారలమ్మలు గద్దెనెక్కేనాడు. గద్దె దగ్గరకు పోటెత్తుతున్న జనసందోహం ఉంటుందే అలాగున్నది! తొక్కిడిగా ఆడవాళ్లే. చెప్పులే ఎరగని వాళ్లు, చెప్పులున్న వాళ్లు, హైహీల్స్ తొడిగిన వాళ్లు, బూట్లు వంటివి వేసిన వాళ్లు. అన్ని రకాలూ ఉన్నారు. ఒకరి కాళ్లను మరొకరు తొక్కేసుకుంటున్నారు. ఒకరి తొడలను మరొకరు మోకాళ్లతో పొడిచేసుకుంటున్నారు! బంగారం చెమ్కీలు అద్దిన మట్టిగాజులు వేసిన వాళ్లు, అచ్చమైన బంగారమే - బ్రేస్లెట్లుగానూ మట్టిగాజులకు అటూఇటూ...................© 2017,www.logili.com All Rights Reserved.