తమలపాకు తీగ సురేష్
"The concrete proof of the existence of man : poetry"
-Cardozay Arogon, Great Latin American Poet "Poetry, in short, the secret energy of daily
life"
మునిసురేష్ పిళ్లై ప్రాథమికంగా కథకుడనుకుంటా. రెండు కథా సంపుటాలు- ఒక నవల అచ్చేశాడు. కానీ ఆయన కవిత్వం రాస్తాడని - కథల కంటే ముందు కవిత్వం.
రాసేవాడని యిపుడు తెలుస్తుంది. 'షష్ఠముడు' అతని అచ్చు అవుతున్న మొదటి కవితా సంపుటం.
కథలు రాసేవాడు కవిత్వం రాయగూడదని, కవిత్వం రాసేవాడు కథలు రాయగూ డదని - రూలేమీ లేదు. రెండు ప్రక్రియల్ని సమర్థవంతంగా పాఠకులు పండిపోయేట్టు రాసినవాళ్లు వున్నారు. నవీన్ పుణ్యమా అంటూ సురేష్ నాకు పరిచయం. అద్భుతమయిన కథలు రాశాడు. తన ప్రాంతపు నైసర్గిక స్వరూపాన్ని, జీవన సారాన్ని- భోగోళిక నేపథ్యపు తాత్వికతని తన కథల్లో దింపేశాడు. అతను పుట్టి పెరిగిన ప్రాంతమో- అతని కౌటుంబిక నేపథ్యమో, అతన్ని గొప్ప కథకుడుగా తయారుచేశాయి. అతని తండ్రి నడిపిన పత్రిక 'ఆదర్శిని' వల్లనైతేనేమి- అతను ఒక రకంగా ప్రెస్లో పుట్టి పెరిగినట్టు. తొలిదశలోనే అన్నింటినీ ఆకళింపు చేసుకుని- ప్రయాణం సాగించాడు. దేన్నయితే మనం కవిత్వం............
తమలపాకు తీగ సురేష్ "The concrete proof of the existence of man : poetry" -Cardozay Arogon, Great Latin American Poet "Poetry, in short, the secret energy of daily life" మునిసురేష్ పిళ్లై ప్రాథమికంగా కథకుడనుకుంటా. రెండు కథా సంపుటాలు- ఒక నవల అచ్చేశాడు. కానీ ఆయన కవిత్వం రాస్తాడని - కథల కంటే ముందు కవిత్వం. రాసేవాడని యిపుడు తెలుస్తుంది. 'షష్ఠముడు' అతని అచ్చు అవుతున్న మొదటి కవితా సంపుటం. కథలు రాసేవాడు కవిత్వం రాయగూడదని, కవిత్వం రాసేవాడు కథలు రాయగూ డదని - రూలేమీ లేదు. రెండు ప్రక్రియల్ని సమర్థవంతంగా పాఠకులు పండిపోయేట్టు రాసినవాళ్లు వున్నారు. నవీన్ పుణ్యమా అంటూ సురేష్ నాకు పరిచయం. అద్భుతమయిన కథలు రాశాడు. తన ప్రాంతపు నైసర్గిక స్వరూపాన్ని, జీవన సారాన్ని- భోగోళిక నేపథ్యపు తాత్వికతని తన కథల్లో దింపేశాడు. అతను పుట్టి పెరిగిన ప్రాంతమో- అతని కౌటుంబిక నేపథ్యమో, అతన్ని గొప్ప కథకుడుగా తయారుచేశాయి. అతని తండ్రి నడిపిన పత్రిక 'ఆదర్శిని' వల్లనైతేనేమి- అతను ఒక రకంగా ప్రెస్లో పుట్టి పెరిగినట్టు. తొలిదశలోనే అన్నింటినీ ఆకళింపు చేసుకుని- ప్రయాణం సాగించాడు. దేన్నయితే మనం కవిత్వం............
© 2017,www.logili.com All Rights Reserved.