ప్రజాస్వామ్య పరిరక్షణోద్యమం ఎప్పటికీ అత్యంత స్ఫూర్తిదాయకం
----- శ్రీ నారా చంద్రబాబు నాయుడు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి
1984 ఆగస్ట్లో తెలుగుదేశం పార్టీలో ఏర్పడిన సంక్షోభ సమయంలో శ్రీ నారా చంద్రబాబు నాయుడు పార్టీ - సంస్థాగత నిర్మాణ వ్యవహారాలు, శిక్షణా శిబిరాల నిర్వహణ మొదలైన కార్యక్రమాలలో నిమగ్నమై ఉన్నారు. అప్పటికి తెలుగుదేశం పార్టీలో ఉన్న ప్రథమ, ద్వితీయ శ్రేణి నాయకుల్లో రాజకీయానుభవం అత్యధికులకు ఎటువంటి లేదు.
తెలుగుదేశంతోనే పలువురు రాజకీయ అరంగేట్రం చేశారు. ఆ నేపథ్యంలోనే కార్యకర్తల బలం పుష్కలంగా ఉన్న తెలుగుదేశం పార్టీని సంస్థాగతంగా మరింత బలోపేతం చేయాలన్న లక్ష్యంతో.. శ్రీ చంద్రబాబు నాయుడు పార్టీ వ్యవహారాలపై దృష్టి పెట్టారు. పరిపాలన వ్యవహారాలలో శ్రీ ఎన్.టి. రామారావు తలమునకలై ఉండగా, పార్టీని గ్రామస్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు క్రియాశీలంగా మార్చడానికి శ్రీ చంద్రబాబు నాయుడు కృషి చేశారు. ఆ సమయంలోనే, నాదెండ్ల తిరుగుబాటు ఉదంతం చోటు చేసుకుంది. పార్టీలో ఏర్పడిన సంక్షోభాన్ని సమర్ధవంతంగా ఎదుర్కొని, పదవీచుత్యులైన శ్రీ ఎన్.టి. రామారావు 32 రోజుల తర్వాత ముఖ్యమంత్రి పదవి అధిష్టించడంలో చంద్రబాబునాయుడి గారి పాత్ర ఎంతో కీలకం ముఖ్యంగా నెలరోజులకు పైగా సాగిన ప్రజాస్వామ్య పరిరక్షణోద్యమం రాష్ట్రంలో, దేశవ్యాప్తంగా ఉవ్వెత్తున ఎగసి.. దేశంలోని కాంగ్రెసేతర ప్రతిపక్షాలు, వామపక్షాలు, బీజేపీతో సహా అన్ని ఏకమై కేంద్రంలోని శ్రీమతి ఇందిరాగాంధీ ప్రభుత్వపు మెడలు వంచి విజయం కైవసం చేసుకోవడంలో శ్రీ చంద్రబాబు నాయుడుది కీలకపాత్ర. తెరవెనుక వుండి నిశ్శబ్దంగా ఎటువంటి ప్రచారం లేకుండా ఆనాడు ఆయన పోషించిన పాత్ర అనన్య సామాన్యం.
నాటి ప్రజాస్వామ్య పరిరక్షణోద్యమంలో పాల్గొన్న నాయకులందరూ శ్రీ చంద్రబాబు నాయుడి ముందస్తు వ్యూహాలు, విపక్ష నేతల సహకారం స్వీకరించడం వల్లనే.. తాము విజయతీరానికి చేరినట్లు చెప్పడం గమనార్హం! 41 సంవత్సరాల క్రితం జరిగిన నాటి ఉదంతంలో తాను పోషించిన పాత్రను ఇప్పటివరకు శ్రీ చంద్రబాబు నాయుడు బహిరంగంగా ఎక్కడా ప్రస్తావించలేదు. మొట్టమొదటిసారిగా ఈ పుస్తక రచయితలకు ఆ అవకాశం కల్పించారు. నాడు చోటు చేసుకొన్న రాజకీయ పరిణామాలను విపులంగా ప్రస్తావించారు...........................
ప్రజాస్వామ్య పరిరక్షణోద్యమం ఎప్పటికీ అత్యంత స్ఫూర్తిదాయకం ----- శ్రీ నారా చంద్రబాబు నాయుడు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి 1984 ఆగస్ట్లో తెలుగుదేశం పార్టీలో ఏర్పడిన సంక్షోభ సమయంలో శ్రీ నారా చంద్రబాబు నాయుడు పార్టీ - సంస్థాగత నిర్మాణ వ్యవహారాలు, శిక్షణా శిబిరాల నిర్వహణ మొదలైన కార్యక్రమాలలో నిమగ్నమై ఉన్నారు. అప్పటికి తెలుగుదేశం పార్టీలో ఉన్న ప్రథమ, ద్వితీయ శ్రేణి నాయకుల్లో రాజకీయానుభవం అత్యధికులకు ఎటువంటి లేదు. తెలుగుదేశంతోనే పలువురు రాజకీయ అరంగేట్రం చేశారు. ఆ నేపథ్యంలోనే కార్యకర్తల బలం పుష్కలంగా ఉన్న తెలుగుదేశం పార్టీని సంస్థాగతంగా మరింత బలోపేతం చేయాలన్న లక్ష్యంతో.. శ్రీ చంద్రబాబు నాయుడు పార్టీ వ్యవహారాలపై దృష్టి పెట్టారు. పరిపాలన వ్యవహారాలలో శ్రీ ఎన్.టి. రామారావు తలమునకలై ఉండగా, పార్టీని గ్రామస్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు క్రియాశీలంగా మార్చడానికి శ్రీ చంద్రబాబు నాయుడు కృషి చేశారు. ఆ సమయంలోనే, నాదెండ్ల తిరుగుబాటు ఉదంతం చోటు చేసుకుంది. పార్టీలో ఏర్పడిన సంక్షోభాన్ని సమర్ధవంతంగా ఎదుర్కొని, పదవీచుత్యులైన శ్రీ ఎన్.టి. రామారావు 32 రోజుల తర్వాత ముఖ్యమంత్రి పదవి అధిష్టించడంలో చంద్రబాబునాయుడి గారి పాత్ర ఎంతో కీలకం ముఖ్యంగా నెలరోజులకు పైగా సాగిన ప్రజాస్వామ్య పరిరక్షణోద్యమం రాష్ట్రంలో, దేశవ్యాప్తంగా ఉవ్వెత్తున ఎగసి.. దేశంలోని కాంగ్రెసేతర ప్రతిపక్షాలు, వామపక్షాలు, బీజేపీతో సహా అన్ని ఏకమై కేంద్రంలోని శ్రీమతి ఇందిరాగాంధీ ప్రభుత్వపు మెడలు వంచి విజయం కైవసం చేసుకోవడంలో శ్రీ చంద్రబాబు నాయుడుది కీలకపాత్ర. తెరవెనుక వుండి నిశ్శబ్దంగా ఎటువంటి ప్రచారం లేకుండా ఆనాడు ఆయన పోషించిన పాత్ర అనన్య సామాన్యం. నాటి ప్రజాస్వామ్య పరిరక్షణోద్యమంలో పాల్గొన్న నాయకులందరూ శ్రీ చంద్రబాబు నాయుడి ముందస్తు వ్యూహాలు, విపక్ష నేతల సహకారం స్వీకరించడం వల్లనే.. తాము విజయతీరానికి చేరినట్లు చెప్పడం గమనార్హం! 41 సంవత్సరాల క్రితం జరిగిన నాటి ఉదంతంలో తాను పోషించిన పాత్రను ఇప్పటివరకు శ్రీ చంద్రబాబు నాయుడు బహిరంగంగా ఎక్కడా ప్రస్తావించలేదు. మొట్టమొదటిసారిగా ఈ పుస్తక రచయితలకు ఆ అవకాశం కల్పించారు. నాడు చోటు చేసుకొన్న రాజకీయ పరిణామాలను విపులంగా ప్రస్తావించారు...........................© 2017,www.logili.com All Rights Reserved.