Brahamanavadampai Ambedkar Tirugubatu

By Dr Kathi Padhmarao (Author)
Rs.300
Rs.300

Brahamanavadampai Ambedkar Tirugubatu
INR
MANIMN2672
In Stock
300.0
Rs.300


In Stock
Ships in 4 - 9 Days
Check for shipping and cod pincode

Description

                      డా||కత్తి పద్మారావు గారు భారదతదేశంలో అంబేడ్కర్ మీద రచనలు చేయడంలో ప్రామాణికమైన మేధావి, ఆయన ఇప్పటికి అంబేడ్కర్ మీద "సాంఘిక విప్లవమూర్తి - డా॥బి.ఆర్. అంబేడ్కర్", "అంబేడ్కర్ - గాంధీ", "అంబేడ్కర్ - తత్వశాస్త్రం - దృక్పథం", "అంబేడ్కర్ - బుద్దుడు", "అంబేడ్కర్ - లోహియా”, “భారత రాజకీయాలు - అంబేడ్కర్" వంటి ఎన్నో పరిశోధనా గ్రంథాలు రచించారు. ఈ క్రమంలో వస్తున్న సిద్ధాంత గ్రంథమిది. డా॥ బి. ఆర్. అంబేడ్కర్ బ్రాహ్మణవాదం మీద తిరుగులేని పోరాటం చేశారు. బ్రాహ్మణులు రాసిన అన్ని గ్రంథాలు వేదాలు, దర్శనాలు, స్మృతులు, పురాణాలు అన్నీ అధ్యయనం చేసి వాటికి ప్రత్యామ్నాయ వాజ్మయ సృష్టి చేశారు. ఆ తిరుగుబాటు తత్త్వం, ఆ తిరుగుబాటు జ్ఞానం ఈనాటి ప్రతి దళిత బహుజన

                       మైనారిటీలకు, స్త్రీలకు అవసరం. ఆయన సిద్ధాంతాలు భారతదేశాన్ని పునర్నిర్మిస్తున్నాయి. ఈ గ్రంథంలో డా|| కత్తి పద్మారావు గారు అత్యంత లోతుగా మనకు ఆయన సిద్ధాంతాలు అందించారు. డా|| బి.ఆర్. అంబేడ్కర్ రచనలు, ప్రసంగాలు, జీవితం, వ్యక్తిత్వం, తాత్త్వికత, నైతికత, ఆధునికత, అభ్యుదయం, పోరాటస్ఫూర్తి ఈ గ్రంథంలో మనకు వెల్లివిరుస్తాయి. సరళమైన భాషలో రచించిన ఈ గ్రంథం పాఠకుల హృదయంలోకి, మెదడులోకి చొచ్చుకుపోతుంది. ఈ గ్రంథంలో అంబేడ్కర్ సూక్తులు మన మెదడును మేల్కొలుపుతాయి. అంబేడ్కర్‌తో పాటు మరికొందరు సామాజిక వైతాళికులను కూడా ఈ గ్రంథంలో విశ్లేషించడం జరిగింది. ఉపన్యాసకులకు, సిద్ధాంత కర్తలకు, నాయకులకు, కార్యకర్తలకు, ఈ గ్రంథం కరదీపిక అవుతుంది. ఈ గ్రంథంలో అంబేడ్కర్ చిత్రాలు మనకు స్పూర్తినిస్తాయి. ఇది మహాకవి డా|| కత్తి పద్మారావు గారి 75వ గ్రంథం. లోకాయత ప్రచురణలు ప్రచురించిన అన్ని గ్రంథాలను పాఠకలోకం తమ వెలుగు దివ్వెలు'గా స్వీకరిస్తుంది. ఈ గ్రంథంలో శైలి, భాషణ, రచనా నిర్మాణ దక్షత, అభివ్యక్తి ప్రావీణ్యత పాఠకులను తప్పక ఉత్తేజపరుస్తాయి. మహాకవి డా|| కత్తి పద్మారావు గారికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వై.ఎస్.ఆర్. లైఫ్ టైం అచీవ్ మెంట్ అవార్డు (జీవిత సాఫల్య పురస్కారం) ఇచ్చిన సందర్భముగా వస్తున్న గ్రంథమిది. భావజాల యుద్ధానికి ఆయుధం ఈ గ్రంథం.

                                                                                                                              - లోకాయత ప్రచురణలు

                      డా||కత్తి పద్మారావు గారు భారదతదేశంలో అంబేడ్కర్ మీద రచనలు చేయడంలో ప్రామాణికమైన మేధావి, ఆయన ఇప్పటికి అంబేడ్కర్ మీద "సాంఘిక విప్లవమూర్తి - డా॥బి.ఆర్. అంబేడ్కర్", "అంబేడ్కర్ - గాంధీ", "అంబేడ్కర్ - తత్వశాస్త్రం - దృక్పథం", "అంబేడ్కర్ - బుద్దుడు", "అంబేడ్కర్ - లోహియా”, “భారత రాజకీయాలు - అంబేడ్కర్" వంటి ఎన్నో పరిశోధనా గ్రంథాలు రచించారు. ఈ క్రమంలో వస్తున్న సిద్ధాంత గ్రంథమిది. డా॥ బి. ఆర్. అంబేడ్కర్ బ్రాహ్మణవాదం మీద తిరుగులేని పోరాటం చేశారు. బ్రాహ్మణులు రాసిన అన్ని గ్రంథాలు వేదాలు, దర్శనాలు, స్మృతులు, పురాణాలు అన్నీ అధ్యయనం చేసి వాటికి ప్రత్యామ్నాయ వాజ్మయ సృష్టి చేశారు. ఆ తిరుగుబాటు తత్త్వం, ఆ తిరుగుబాటు జ్ఞానం ఈనాటి ప్రతి దళిత బహుజన                        మైనారిటీలకు, స్త్రీలకు అవసరం. ఆయన సిద్ధాంతాలు భారతదేశాన్ని పునర్నిర్మిస్తున్నాయి. ఈ గ్రంథంలో డా|| కత్తి పద్మారావు గారు అత్యంత లోతుగా మనకు ఆయన సిద్ధాంతాలు అందించారు. డా|| బి.ఆర్. అంబేడ్కర్ రచనలు, ప్రసంగాలు, జీవితం, వ్యక్తిత్వం, తాత్త్వికత, నైతికత, ఆధునికత, అభ్యుదయం, పోరాటస్ఫూర్తి ఈ గ్రంథంలో మనకు వెల్లివిరుస్తాయి. సరళమైన భాషలో రచించిన ఈ గ్రంథం పాఠకుల హృదయంలోకి, మెదడులోకి చొచ్చుకుపోతుంది. ఈ గ్రంథంలో అంబేడ్కర్ సూక్తులు మన మెదడును మేల్కొలుపుతాయి. అంబేడ్కర్‌తో పాటు మరికొందరు సామాజిక వైతాళికులను కూడా ఈ గ్రంథంలో విశ్లేషించడం జరిగింది. ఉపన్యాసకులకు, సిద్ధాంత కర్తలకు, నాయకులకు, కార్యకర్తలకు, ఈ గ్రంథం కరదీపిక అవుతుంది. ఈ గ్రంథంలో అంబేడ్కర్ చిత్రాలు మనకు స్పూర్తినిస్తాయి. ఇది మహాకవి డా|| కత్తి పద్మారావు గారి 75వ గ్రంథం. లోకాయత ప్రచురణలు ప్రచురించిన అన్ని గ్రంథాలను పాఠకలోకం తమ వెలుగు దివ్వెలు'గా స్వీకరిస్తుంది. ఈ గ్రంథంలో శైలి, భాషణ, రచనా నిర్మాణ దక్షత, అభివ్యక్తి ప్రావీణ్యత పాఠకులను తప్పక ఉత్తేజపరుస్తాయి. మహాకవి డా|| కత్తి పద్మారావు గారికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వై.ఎస్.ఆర్. లైఫ్ టైం అచీవ్ మెంట్ అవార్డు (జీవిత సాఫల్య పురస్కారం) ఇచ్చిన సందర్భముగా వస్తున్న గ్రంథమిది. భావజాల యుద్ధానికి ఆయుధం ఈ గ్రంథం.                                                                                                                               - లోకాయత ప్రచురణలు

Features

  • : Brahamanavadampai Ambedkar Tirugubatu
  • : Dr Kathi Padhmarao
  • : Lokayatha Prachuranalu
  • : MANIMN2672
  • : Paperback
  • : oct,2021
  • : 338
  • : Telugu

Reviews

Be the first one to review this product

Discussion:Brahamanavadampai Ambedkar Tirugubatu

Be the first to start a discussion Start a new discussion

Browse all Discussions on Books
Powered by infibeam