Cinemalu Manavi Vallavi

By Satyajith Rey (Author), V B Sowmya (Author)
Rs.150
Rs.150

Cinemalu Manavi Vallavi
INR
NAVOPH0180
In Stock
150.0
Rs.150


In Stock
Ships in 5 - 15 Days
Check for shipping and cod pincode

Description

             సినిమా అంటే ఇష్టం వున్న ఎవరికైనా సత్యజిత్ రేని పరిచయం చెయ్యాలని ప్రయత్నించడం దుస్సాహసం అవుతుంది. ప్రపంచ సినిమా కాన్వాస్ పై మువ్వన్నెల రంగులద్దిన తొలి భారతీయ దర్శకుడిగా రే అందరికి సుపరిచితుడు. అప్పటి సినిమాలకు భిన్నంగా, వాస్తవికతే ప్రధాన మాధ్యమంగా మన సినిమాకి ఒక పరిభాషని ఏర్పరిచి, ముందు తరాలలో ఎందరికో దిశానిర్దేశ్యం చేసిన మహానుభావుడాయన. అలాంటి దర్శకుడి దృష్టి నుంచి చరిత్రనూ చూసే అవకాశంగా ఈ పుస్తకాన్ని అభివర్ణించవచ్చు. అందుకే ఈ పుస్తకం సిని ప్రేమికులకు, ఔత్సాహికులకు ఒక మార్గదర్శి అనడంలో ఎలాంటి సందేహమూ లేదు.

            సత్యజిత్ రే స్వతహాగా దర్శకుడే కాక కధకుడు, సంగీతజ్ఞుడు, చిత్రకారుడు కావటం వల్ల ఆయన చెప్పే ప్రతి విషయం ఇట్టే చదివించేస్తుంది

            ఎప్పోడో అరవై డబ్బై ఏళ్ళ క్రితం రాసిన ఈ వ్యాసాలలో చిత్ర నిర్మాణ పరిస్థితులను, సినిమా పరిభాషను గురించి ఆయన చేసే వ్యాఖ్యలను గమనిస్తే ఈ నాటికీ సినిమా వ్యవస్థ ఏ మాత్రం మారలేదని అర్ధం అవుతుంది. మూకీ చిత్రాల నుంచి శబ్దచిత్రాలకు జరిగిన మార్పులలో శబ్దప్రాధాన్యత పెరిగి, దృశ్య ప్రాధాన్యత తగ్గిందని వాపోయినా, "స్టార్" నటులకోసం కధలలో మార్పులు చేస్తున్నారని బాధపడినా, యునియన్ విధానం పై వ్యంగాస్త్రాలు వేసినా, స్టూడియో భారీ బడ్జెట్ సినిమాల పరాజయాల గురించి మాట్లాడినా, అన్నీ ఈ నాటికీ వాస్తవాలుగా కనిపించి ఆశ్చర్యపరుస్తాయి. ఆలోచింపజేస్తాయి.

            సినిమాను ఒక కళగానే కాక ఒక సబ్జేట్ గా చదవాలనుకునే వారికి తెలుగు పుస్తకాల కొరత స్పష్టంగా కనిపిస్తోంది. తెలుగులో సినిమా గురించి వివరణాత్మకంగా, విశ్లేషణాత్మకంగా వచ్చిన పుస్తకాలు చాలా అరుదు. సత్యజిత్ రే ఈ పుస్తకం మొదట్లోనే చెప్పినట్లు - "సాధారణంగా ఒక దర్శకుడు తన సినిమాల గురించి రాయడం చాలా అరుదు" అనేది సాంకేతిక నిపుణులందరి విషయంలోనూ నిజం కావడమే కారణం కావచ్చు. కానీ అలా చెప్పిన ఆయనే వివిధ పత్రికలలో వ్యాసాలను రాసి, వాటిని ఒక పుస్తకంగా తేవడం సినీ ప్రేమికుల అదృష్టమనే చెప్పాలి. అలంటి అదృష్టాన్ని తెలుగు వారికి కూడా అందజేయాలన్న అభిమతమే మా ఈ తోలి ప్రయత్నాన్ని కారణం. మీ ఆదరణే ఇలాంటి మరెన్నో ప్రయత్నాలకు ప్రోత్సాహకం కాగలదని మా నమ్మకం.

- సత్యజిత్ రే 

             సినిమా అంటే ఇష్టం వున్న ఎవరికైనా సత్యజిత్ రేని పరిచయం చెయ్యాలని ప్రయత్నించడం దుస్సాహసం అవుతుంది. ప్రపంచ సినిమా కాన్వాస్ పై మువ్వన్నెల రంగులద్దిన తొలి భారతీయ దర్శకుడిగా రే అందరికి సుపరిచితుడు. అప్పటి సినిమాలకు భిన్నంగా, వాస్తవికతే ప్రధాన మాధ్యమంగా మన సినిమాకి ఒక పరిభాషని ఏర్పరిచి, ముందు తరాలలో ఎందరికో దిశానిర్దేశ్యం చేసిన మహానుభావుడాయన. అలాంటి దర్శకుడి దృష్టి నుంచి చరిత్రనూ చూసే అవకాశంగా ఈ పుస్తకాన్ని అభివర్ణించవచ్చు. అందుకే ఈ పుస్తకం సిని ప్రేమికులకు, ఔత్సాహికులకు ఒక మార్గదర్శి అనడంలో ఎలాంటి సందేహమూ లేదు.             సత్యజిత్ రే స్వతహాగా దర్శకుడే కాక కధకుడు, సంగీతజ్ఞుడు, చిత్రకారుడు కావటం వల్ల ఆయన చెప్పే ప్రతి విషయం ఇట్టే చదివించేస్తుంది             ఎప్పోడో అరవై డబ్బై ఏళ్ళ క్రితం రాసిన ఈ వ్యాసాలలో చిత్ర నిర్మాణ పరిస్థితులను, సినిమా పరిభాషను గురించి ఆయన చేసే వ్యాఖ్యలను గమనిస్తే ఈ నాటికీ సినిమా వ్యవస్థ ఏ మాత్రం మారలేదని అర్ధం అవుతుంది. మూకీ చిత్రాల నుంచి శబ్దచిత్రాలకు జరిగిన మార్పులలో శబ్దప్రాధాన్యత పెరిగి, దృశ్య ప్రాధాన్యత తగ్గిందని వాపోయినా, "స్టార్" నటులకోసం కధలలో మార్పులు చేస్తున్నారని బాధపడినా, యునియన్ విధానం పై వ్యంగాస్త్రాలు వేసినా, స్టూడియో భారీ బడ్జెట్ సినిమాల పరాజయాల గురించి మాట్లాడినా, అన్నీ ఈ నాటికీ వాస్తవాలుగా కనిపించి ఆశ్చర్యపరుస్తాయి. ఆలోచింపజేస్తాయి.             సినిమాను ఒక కళగానే కాక ఒక సబ్జేట్ గా చదవాలనుకునే వారికి తెలుగు పుస్తకాల కొరత స్పష్టంగా కనిపిస్తోంది. తెలుగులో సినిమా గురించి వివరణాత్మకంగా, విశ్లేషణాత్మకంగా వచ్చిన పుస్తకాలు చాలా అరుదు. సత్యజిత్ రే ఈ పుస్తకం మొదట్లోనే చెప్పినట్లు - "సాధారణంగా ఒక దర్శకుడు తన సినిమాల గురించి రాయడం చాలా అరుదు" అనేది సాంకేతిక నిపుణులందరి విషయంలోనూ నిజం కావడమే కారణం కావచ్చు. కానీ అలా చెప్పిన ఆయనే వివిధ పత్రికలలో వ్యాసాలను రాసి, వాటిని ఒక పుస్తకంగా తేవడం సినీ ప్రేమికుల అదృష్టమనే చెప్పాలి. అలంటి అదృష్టాన్ని తెలుగు వారికి కూడా అందజేయాలన్న అభిమతమే మా ఈ తోలి ప్రయత్నాన్ని కారణం. మీ ఆదరణే ఇలాంటి మరెన్నో ప్రయత్నాలకు ప్రోత్సాహకం కాగలదని మా నమ్మకం. - సత్యజిత్ రే 

Features

  • : Cinemalu Manavi Vallavi
  • : Satyajith Rey
  • : Navatarangam
  • : NAVOPH0180
  • : Paperback
  • : 218
  • : Telugu

Reviews

Be the first one to review this product

Discussion:Cinemalu Manavi Vallavi

Be the first to start a discussion Start a new discussion

Browse all Discussions on Books
Powered by infibeam