Kovvali Navalalu Konni

Rs.280
Rs.280

Kovvali Navalalu Konni
INR
In Stock
280.0
Rs.280


In Stock
Ships in 5 - 15 Days
Check for shipping and cod pincode

Description

          సామాన్య జనాన్ని రంజింప చేసిన 1000 నవలలను రూపొందించిన ప్రముఖ రచయిత, కర్మయోగి, నిరాడంబరుడు, సాహితీ తపస్వి శ్రీ కొవ్వలి లక్ష్మీనరసింహారావు 1912లో పశ్చమ గోదావరి జిల్లా తణుకులో జన్మించారు. తండ్రి లక్ష్మీనారాయణ, తల్లి కాంతమ్మ, తండ్రి ప్లీడరు గుమాస్తా వృతిని అవలంబించి రాజమహేంద్రవరానికి నివాసం మార్చుకున్నందున లక్ష్మీనరసింహారావుకు కూడా అదే స్వస్థలం అయింది. తల్లి చిన్నప్పుడే గతించడంవల్ల  తండ్రే తక్కిన సోదరులతో పాటుగా ఆయనను పెంచి పోషించారు. 14 సంవత్సరాలు నిండేసరికి స్కూల్ ఫైనల్ పరీక్ష రాశారు. స్థానిక గ్రంధాలయంలోని పుస్తకాలన్నింటినీ చదివారు. కొంతకాలం దేశ సంచారం చేశారు.

          ఆనాటి సామాజిక, సాహిత్య పరిస్థితులను తీసుకొని శృంగారము, ప్రేమ మొదలగు వానిని జోడించి వ్యావహారిక భాషలో 2, 3 గంటల్లో చదవడానికి అనువైన నవలలను ముఖ్యంగా 'కాలక్షేపపు నవలలు' 1000 రాసి 'వేయి నవలల కొవ్వలి' అయ్యారు.

           కొవ్వలి రచనలలో పైకి ప్రేమ, శృంగారం ఎక్కువగా కనబడినా సాంఘిక దురాచారాల నిర్మూలన, వితంతు వివాహోద్యమం, బాల్య వివాహ నిరసన, వృద్ధ వివాహాల అవహేళన, స్త్త్రి విద్య, కులమత విభేద నిర్మూలన ఇతివృత్తాలుగా వుండి సముచిత ఆదరణ పొందగలిగాయి. అంతేకాక అందరినీ ఆకట్టుకునే రీతిలో రసవత్తరంగా ముఖ్యంగా మధ్య తరగతి స్త్రీలకు ఆమోదకరంగా తన రచనలను రూపొందించారు. ఆ రోజుల్లో (1940 లలో) ఆంద్ర సాహిత్య చదువరులకు చలువ పందిళ్లు కప్పించిన మహా రచయిత శ్రీ కొవ్వలి.

        1940లలో శ్రీ కొవ్వలి పేరు ఊరూరా, వాడవాడలా చదువరులున్న ప్రతి ఇంటా జపించబడింది. ఆబాలగోపాలాన్ని ఆనంద డోలికల్లో ముంచి తేల్చింది.

      యావత్ ప్రపంచంలోనూ 1000 నవలలు రచించిన ఖ్యాతి శ్రీ కొవ్వలికే దక్కింది.ఆయన రచనలను ఆదరించినంతగా ఆనాడు మరొకరి నవలలను ప్రజలు ఆదరించలేదు. చదువులను ఎగ్గొట్టి వారి నవలలు విస్తారంగా చదివిన ఆనాటి పసివాళ్ళల్లో ఈనాటి పెద్దలెందరో ఉన్నారు.

       కొవ్వలికి మద్రాసు, ఉస్మానియా, శ్రీ వేంకటేశ్వర విశ్వవిద్యాలయ తెలుగు శాఖలు మాన్యతా పత్రాలు (సర్టిఫికెట్స్ ఆఫ్ ఆనర్ ) ఇచ్చి గౌరవించింది.భారత ప్రభుత్వ విద్యాశాఖ కూడా వీరిని సముచితంగా గౌరవించింది.

 

"తెలుగు నవలా రచనా పధశోధకులు

 తెలుగు ప్రజల పట్టనాభిలాష పోషకులు

 వెయ్యి నవలలు వేవేగ వ్రాయసములు" ఐన

 శ్రీ కొవ్వలి 1975 జూన్ 8న  మహాప్రస్థానమొందారు. 

 - కొవ్వలి లక్ష్మీనరసింహారావు

          సామాన్య జనాన్ని రంజింప చేసిన 1000 నవలలను రూపొందించిన ప్రముఖ రచయిత, కర్మయోగి, నిరాడంబరుడు, సాహితీ తపస్వి శ్రీ కొవ్వలి లక్ష్మీనరసింహారావు 1912లో పశ్చమ గోదావరి జిల్లా తణుకులో జన్మించారు. తండ్రి లక్ష్మీనారాయణ, తల్లి కాంతమ్మ, తండ్రి ప్లీడరు గుమాస్తా వృతిని అవలంబించి రాజమహేంద్రవరానికి నివాసం మార్చుకున్నందున లక్ష్మీనరసింహారావుకు కూడా అదే స్వస్థలం అయింది. తల్లి చిన్నప్పుడే గతించడంవల్ల  తండ్రే తక్కిన సోదరులతో పాటుగా ఆయనను పెంచి పోషించారు. 14 సంవత్సరాలు నిండేసరికి స్కూల్ ఫైనల్ పరీక్ష రాశారు. స్థానిక గ్రంధాలయంలోని పుస్తకాలన్నింటినీ చదివారు. కొంతకాలం దేశ సంచారం చేశారు.           ఆనాటి సామాజిక, సాహిత్య పరిస్థితులను తీసుకొని శృంగారము, ప్రేమ మొదలగు వానిని జోడించి వ్యావహారిక భాషలో 2, 3 గంటల్లో చదవడానికి అనువైన నవలలను ముఖ్యంగా 'కాలక్షేపపు నవలలు' 1000 రాసి 'వేయి నవలల కొవ్వలి' అయ్యారు.            కొవ్వలి రచనలలో పైకి ప్రేమ, శృంగారం ఎక్కువగా కనబడినా సాంఘిక దురాచారాల నిర్మూలన, వితంతు వివాహోద్యమం, బాల్య వివాహ నిరసన, వృద్ధ వివాహాల అవహేళన, స్త్త్రి విద్య, కులమత విభేద నిర్మూలన ఇతివృత్తాలుగా వుండి సముచిత ఆదరణ పొందగలిగాయి. అంతేకాక అందరినీ ఆకట్టుకునే రీతిలో రసవత్తరంగా ముఖ్యంగా మధ్య తరగతి స్త్రీలకు ఆమోదకరంగా తన రచనలను రూపొందించారు. ఆ రోజుల్లో (1940 లలో) ఆంద్ర సాహిత్య చదువరులకు చలువ పందిళ్లు కప్పించిన మహా రచయిత శ్రీ కొవ్వలి.         1940లలో శ్రీ కొవ్వలి పేరు ఊరూరా, వాడవాడలా చదువరులున్న ప్రతి ఇంటా జపించబడింది. ఆబాలగోపాలాన్ని ఆనంద డోలికల్లో ముంచి తేల్చింది.       యావత్ ప్రపంచంలోనూ 1000 నవలలు రచించిన ఖ్యాతి శ్రీ కొవ్వలికే దక్కింది.ఆయన రచనలను ఆదరించినంతగా ఆనాడు మరొకరి నవలలను ప్రజలు ఆదరించలేదు. చదువులను ఎగ్గొట్టి వారి నవలలు విస్తారంగా చదివిన ఆనాటి పసివాళ్ళల్లో ఈనాటి పెద్దలెందరో ఉన్నారు.        కొవ్వలికి మద్రాసు, ఉస్మానియా, శ్రీ వేంకటేశ్వర విశ్వవిద్యాలయ తెలుగు శాఖలు మాన్యతా పత్రాలు (సర్టిఫికెట్స్ ఆఫ్ ఆనర్ ) ఇచ్చి గౌరవించింది.భారత ప్రభుత్వ విద్యాశాఖ కూడా వీరిని సముచితంగా గౌరవించింది.   "తెలుగు నవలా రచనా పధశోధకులు  తెలుగు ప్రజల పట్టనాభిలాష పోషకులు  వెయ్యి నవలలు వేవేగ వ్రాయసములు" ఐన  శ్రీ కొవ్వలి 1975 జూన్ 8న  మహాప్రస్థానమొందారు.   - కొవ్వలి లక్ష్మీనరసింహారావు

Features

  • : Kovvali Navalalu Konni
  • : Kovvali Lakshmi Narasimharao
  • : Vishalandra
  • : VISHALA304
  • : Paperback
  • : August, 2013
  • : 571
  • : Telugu

Reviews

Be the first one to review this product

Discussion:Kovvali Navalalu Konni

Be the first to start a discussion Start a new discussion

Browse all Discussions on Books
Powered by infibeam