Boyakottamulu Pandrendu

Rs.180
Rs.180

Boyakottamulu Pandrendu
INR
ETCBKTEL08
Out Of Stock
180.0
Rs.180
Out of Stock
Out Of Stock
Check for shipping and cod pincode

Description

                నల్లమల ప్రాంతం నుండి బోయలు అద్దంకి ప్రాంతానికి వలసపోవడంతో ప్రారంభమైన ఈ నవల 200 సంవత్సాల తరువాత పండరంగడనే సేనాధిపతి చాళుక్య సైన్యంతో పండ్రెండు బోయకొట్టాల మీద దాడి చేసి కట్టెపు దుర్గాన్ని నేలమట్టం చేయడంతో ముగుస్తుంది. బోయల మొదటి రాజు వీరనబోయడు. అతని తర్వాత అతనికి నలుగురు వారసులు. రెండో వీరనబోయడు, పులిరాజు బోయడు, కసవన బోయడు, నన్నిదొరబోయడు, పొన్నిదొర బోయడు మొదలైన బోయరాజులు పరిపాలన చెయ్యడం - బోయల ఆచార వ్యవహారాలు, అధికారం కోసం వాళ్ళల్లో వాళ్ళే పోట్లాడుకోవడం మొదలైన సన్నివేశాలను రచయిత ఈ నవలలో చిత్రించాడు. బోయరాజులతోపాటు ఆ రోజుల్లో తెలుగు దేశాన్ని పాలిస్తున్న వేంగిచాళుక్యరాజులు తెలుగుభాషాభివృద్ధికి చేసిన సేవలను ఈ నవలలో మనం చదువుతాం. మరోవైపు పల్లవుల రాజ్యం, పల్లవరాజులకు బోయలకు ఉన్న మంచి సంబంధలూ, పల్లవులకూ, చాళుక్యులకూ మధ్య ఉన్న వైరం, ఈ ఇరు వంశాల్లోని సామ్రాజ్యాన్ని విస్తరించుకోవాలన్న ఆకాంక్ష కారణంగా జరిగిన యుద్ధాలు, ఈ ఇరువురి మధ్య నలిగిన బోయప్రజలు - ఇలా ఈ నవలలో ఆనాటి అనేక పరిస్థితుల చిత్రణ ఉంది.

                పండరంగడు వేయించిన అద్దంకి శాసనం ఆధారంగా ఇంత పెద్ద చారిత్రక నవలను రచించడం చాల కష్టసాధ్యమైన విషయం. చరిత్రలో సాధారణంగా గెలిచిన వారి ప్రస్తావనే ఉంటుంది. పండ్రెండు బోయకొట్టాలను ధ్వంసం చేశానని పండరంగడు గర్వంగా చెప్పుకుంటూ ఈ అద్దంకి శాసనాన్ని వేయించాడు. ఆ పండ్రెండు బోయకొట్టాల్ని నిర్మించుకొన్న బోయలెవ్వరు? వాళ్ళు ఎక్కడి నుండి అక్కడికొచ్చారు? వాళ్ళెలా జీవించారు? వాళ్లనుపాలించిన రాజులెవరు? వాళ్ళ ఆచార వ్యవహారాలేమిటి? పల్లవులకు చాళుక్యులకూ మధ్య యుద్దాలెందుకు జరిగాయి? ఆనాటి తెలుగు భాష, తెలుగు సాహిత్యం ఎలా అభివృద్ధి చెందాయి? దేశ కవిత్వాన్ని చాళుక్య రాజులెలా పోషించారు? మొదలైన అనేక ఆసక్తికరమైన అంశాలను గూర్చి ఆలోచించి, ఊహించి, పరిశోధించి ఒక సంవత్సర కాలం శ్రమించి కారణం బాలసుబ్రహ్మణ్యం పిళ్ళె ఈ నవలను రచించారు.

                 ఈ నవలను పాఠకులు తప్పకుండా ఆదరిస్తారని ఆశిస్తున్నాను. 

- అంపశయ్య నవీన్

                నల్లమల ప్రాంతం నుండి బోయలు అద్దంకి ప్రాంతానికి వలసపోవడంతో ప్రారంభమైన ఈ నవల 200 సంవత్సాల తరువాత పండరంగడనే సేనాధిపతి చాళుక్య సైన్యంతో పండ్రెండు బోయకొట్టాల మీద దాడి చేసి కట్టెపు దుర్గాన్ని నేలమట్టం చేయడంతో ముగుస్తుంది. బోయల మొదటి రాజు వీరనబోయడు. అతని తర్వాత అతనికి నలుగురు వారసులు. రెండో వీరనబోయడు, పులిరాజు బోయడు, కసవన బోయడు, నన్నిదొరబోయడు, పొన్నిదొర బోయడు మొదలైన బోయరాజులు పరిపాలన చెయ్యడం - బోయల ఆచార వ్యవహారాలు, అధికారం కోసం వాళ్ళల్లో వాళ్ళే పోట్లాడుకోవడం మొదలైన సన్నివేశాలను రచయిత ఈ నవలలో చిత్రించాడు. బోయరాజులతోపాటు ఆ రోజుల్లో తెలుగు దేశాన్ని పాలిస్తున్న వేంగిచాళుక్యరాజులు తెలుగుభాషాభివృద్ధికి చేసిన సేవలను ఈ నవలలో మనం చదువుతాం. మరోవైపు పల్లవుల రాజ్యం, పల్లవరాజులకు బోయలకు ఉన్న మంచి సంబంధలూ, పల్లవులకూ, చాళుక్యులకూ మధ్య ఉన్న వైరం, ఈ ఇరు వంశాల్లోని సామ్రాజ్యాన్ని విస్తరించుకోవాలన్న ఆకాంక్ష కారణంగా జరిగిన యుద్ధాలు, ఈ ఇరువురి మధ్య నలిగిన బోయప్రజలు - ఇలా ఈ నవలలో ఆనాటి అనేక పరిస్థితుల చిత్రణ ఉంది.                 పండరంగడు వేయించిన అద్దంకి శాసనం ఆధారంగా ఇంత పెద్ద చారిత్రక నవలను రచించడం చాల కష్టసాధ్యమైన విషయం. చరిత్రలో సాధారణంగా గెలిచిన వారి ప్రస్తావనే ఉంటుంది. పండ్రెండు బోయకొట్టాలను ధ్వంసం చేశానని పండరంగడు గర్వంగా చెప్పుకుంటూ ఈ అద్దంకి శాసనాన్ని వేయించాడు. ఆ పండ్రెండు బోయకొట్టాల్ని నిర్మించుకొన్న బోయలెవ్వరు? వాళ్ళు ఎక్కడి నుండి అక్కడికొచ్చారు? వాళ్ళెలా జీవించారు? వాళ్లనుపాలించిన రాజులెవరు? వాళ్ళ ఆచార వ్యవహారాలేమిటి? పల్లవులకు చాళుక్యులకూ మధ్య యుద్దాలెందుకు జరిగాయి? ఆనాటి తెలుగు భాష, తెలుగు సాహిత్యం ఎలా అభివృద్ధి చెందాయి? దేశ కవిత్వాన్ని చాళుక్య రాజులెలా పోషించారు? మొదలైన అనేక ఆసక్తికరమైన అంశాలను గూర్చి ఆలోచించి, ఊహించి, పరిశోధించి ఒక సంవత్సర కాలం శ్రమించి కారణం బాలసుబ్రహ్మణ్యం పిళ్ళె ఈ నవలను రచించారు.                  ఈ నవలను పాఠకులు తప్పకుండా ఆదరిస్తారని ఆశిస్తున్నాను.  - అంపశయ్య నవీన్

Features

  • : Boyakottamulu Pandrendu
  • : Karanam Balasubrahmanyam Pille
  • : Karanam Balasubrahmanayam Pille
  • : ETCBKTEL08
  • : Paperback
  • : December, 2013
  • : 273
  • : Telugu

Reviews

Be the first one to review this product

Discussion:Boyakottamulu Pandrendu

Be the first to start a discussion Start a new discussion

Browse all Discussions on Books
Powered by infibeam