Langna Nadi

Rs.450
Rs.450

Langna Nadi
INR
GOLLAPU148
In Stock
450.0
Rs.450


In Stock
Ships in 5 - 15 Days
Check for shipping and cod pincode

Description

                   ఆర్ష విద్యాభూషణ్, దైవజ్ఞశోరోమణి, విద్యావిశారద, జ్యోతిషసరస్వతి, జ్యోతిషశిరోమణి, జ్యోతిషవల్లభ, జ్యోతిషమహామహోపాధ్యాయ బిరుదాంకితులు "బ్రహ్మశ్రీ దివాకరుని వేంకట సుబ్బారావు గారిచే రచించబడిన లగ్ననాడీ గొప్ప నాడీ జోతిష్య గ్రంధము.

                  లగ్ననాడీ అనే ఈ పుస్తకంలో మేషలగ్నము నుండి మీనలగ్నము వరకు ఫలితములు. ఇందులో లగ్న స్వభావము, జాతుకుల సహజ లక్షణములు, రాశిస్థితి గ్రహఫలములు, యోగములు, రాజయోగములు, గ్రహముల భావస్థితి, యుతి, దృష్టి ఫలితములు, ధన, విద్య, సంతాన, ఆరోగ్య, కళత్ర, రాజయోగములు మరెన్నో...ఇతర యోగాములతో సహా వివరంగా అందించడం జరిగింది.

శ్రీ దివాకరుని వేంకట సుబ్బారావు(రచయిత గురించి) :

                   శ్రీ దివాకరుని వేంకట సుబ్బారావు గారు, గుంటూరు జిల్లా, తెనాలి తాలూకా, చింతలపూడి గ్రామములో ది.14-1-1910న శ్రీమతి పిచ్చమ్మ, శ్రీరామయ్య దంపతులకు జన్మించిరి. వీరి పాఠశాల విద్య తెనాలిలోను, ఉన్నత విద్య గుంటూరు మరియు మద్రాసు పట్టణములలోను జరిగినది. ఆరోజులలో శ్రీ కాసు బ్రహ్మానందరెడ్డి గారు ఎన్ని ఉన్నత పదువులు అధిరోహించినా వీరిరివురి స్నేహబంధము వారు దివంగతలయ్యే వరకు కొనసాగినది. విద్యాభ్యాసానంతరము, శ్రీసుబ్బారావు గారు భారత ప్రభుత్వ రక్షణశాఖలో సివిల్ ఉద్యోగిగా అనేక పదవులు నిర్వహించి 1968సంవత్సరంలో పదవీ విరమణ చేసినారు.

                 వీరికి చిన్నతనము నుండి జ్యోతిష్యశాస్త్రము మీద ఆసక్తి వున్న కారణముచేత, ఆశాస్త్రములో విశేషమైన కృషి సల్పిరి. వీరు వ్రాసిన అనేక పరిశీలనా వ్యాసములు, సాధికి రచనలు ఆనాటి ప్రముఖ పత్రికలు భారతి, ఆంధ్రపత్రిక, ఆంధ్రప్రభ, జ్యోతిష్య విజ్ఞాన పత్రిక, గోల్కొండ పత్రిక, Astrological Magazine మున్నగు వానిలో ప్రచురింపబడినవి. వీరికి సంస్కృతములోనే గాక, ఆంగ్ల, తమిళ, హిందీభాషలలో గూడ మంచి ప్రావీణ్యమువున్న కారణముచేత, ఆయా భాషల ప్రాచీన గ్రంధముల నుండి గూడ జ్యోతిష్యశాస్త్రమునకు సంబంధించిన విషయములను, రహస్యములను వీరి రచనలలో సందర్భోచితముగా వుదహరించుట చేతను వీరిగ్రంథములకు విశేష ప్రాచుర్యము లభించినది.

                1960 దశకంలో వీరు పరాశరహోర (రెండు భాగములు), ఆయుర్భావము, ధనయోగాఫలప్రదర్శనము, రాజయోగములు, జాతక బలము - ఫలము, గ్రహసంబంధములు, Benifies & Malafies(ఆంగ్లములో), 1970 దశకంలో జ్యోతిషసిద్ధాంతము, భాగ్యభావము, కళత్రభావము, అష్టకవర్గు - ఫలక్రమము, గ్రహరాశులు (మేషము నుండి మీనము వరకు) మున్నగు గ్రంధములను, 1980 దశకంలో జ్యోతిష సర్వస్వము (3 భాగములు), ద్వాదశ భావఫలములు (2 భాగములు) Maha Yogas(ఆంగ్లములో) రచించిరి. ఇవిగాకవారి రచనలనేకములు ఆకాశవాణిలో ప్రసారమయినవి. భారతదేశములో జరిగిన పెక్కు జ్యోతిషసభలలో కీలక ఉపన్యాసములు చేయుటయే గాక, నవీన సిద్ధాంతములను ప్రతిపాదించిన, ఈ శాస్త్రములో వారికి గల పరిశోధనాశక్తి, ప్రజ్ఞాపాటవములను చాటి చెప్పి అనేకమంది జ్యోతిష్యులకు ఆదర్శప్రయులు, మార్గదర్శకులును అయినారు. జ్యోతిష పరిజ్ఞానము, ఆసక్తి వున్నవారికి సుబ్బారావు గారి గ్రంధములు ఎంతగానో ఉపయుక్తము అయినవి. ఇవి చదువని జ్యోతిష్యులు ఆంధ్రప్రదేశములో లేరనుట అతిశయోక్తికాదు. ప్రముఖ జ్యోతిషగ్రంధములను సమీక్ష చేయుచూ - "జ్యోతిషంలో శాస్త్రమే గాక అనుభవము గూడా ఎక్కువ ఉపయోగపడుతుంది. శ్రీదివాకరుని వెంకట సుబ్బారావు గారు వారి అనుభవాన్ని వారి గ్రంధములలో జ్యోతిషముపై ఉత్సాహం కలిగేటట్లుగా రచన సాగించినారు" అని ప్రశంసించినారు. మరియొక ప్రముఖ సమీక్షకులు శ్రీ ఆయాస్య ఇలా వ్రాసినారు - జ్యోతిషములో విషయాన్ని సుస్పష్టంగా సులభం చేసి రచన సాగించగల కొద్దిమంది జ్యోతిర్విద్యావేత్తలలో శ్రీదివాకరుని వేంకట సుబ్బారావు గారు అగ్రగణ్యులు. వీరి రామాయణ గ్రంధములలో అందలి ప్రధాన పత్రాలను గురించి, జ్యోతిష సంబంధముగా అనేక రహస్యములను వెల్లడించినారు".

              శ్రీ దివాకరుని వేంకట సుబ్బారావుగారు జ్యోతిష శాస్త్రములో చేసిన కృషికి, సేవలకు మెచ్చుకొని పెక్కు సంస్థలు అనేక సన్మానములను, బిరుదు ప్రధానములను చేసినారు.

                   ఆర్ష విద్యాభూషణ్, దైవజ్ఞశోరోమణి, విద్యావిశారద, జ్యోతిషసరస్వతి, జ్యోతిషశిరోమణి, జ్యోతిషవల్లభ, జ్యోతిషమహామహోపాధ్యాయ బిరుదాంకితులు "బ్రహ్మశ్రీ దివాకరుని వేంకట సుబ్బారావు గారిచే రచించబడిన లగ్ననాడీ గొప్ప నాడీ జోతిష్య గ్రంధము.                   లగ్ననాడీ అనే ఈ పుస్తకంలో మేషలగ్నము నుండి మీనలగ్నము వరకు ఫలితములు. ఇందులో లగ్న స్వభావము, జాతుకుల సహజ లక్షణములు, రాశిస్థితి గ్రహఫలములు, యోగములు, రాజయోగములు, గ్రహముల భావస్థితి, యుతి, దృష్టి ఫలితములు, ధన, విద్య, సంతాన, ఆరోగ్య, కళత్ర, రాజయోగములు మరెన్నో...ఇతర యోగాములతో సహా వివరంగా అందించడం జరిగింది. శ్రీ దివాకరుని వేంకట సుబ్బారావు(రచయిత గురించి) :                    శ్రీ దివాకరుని వేంకట సుబ్బారావు గారు, గుంటూరు జిల్లా, తెనాలి తాలూకా, చింతలపూడి గ్రామములో ది.14-1-1910న శ్రీమతి పిచ్చమ్మ, శ్రీరామయ్య దంపతులకు జన్మించిరి. వీరి పాఠశాల విద్య తెనాలిలోను, ఉన్నత విద్య గుంటూరు మరియు మద్రాసు పట్టణములలోను జరిగినది. ఆరోజులలో శ్రీ కాసు బ్రహ్మానందరెడ్డి గారు ఎన్ని ఉన్నత పదువులు అధిరోహించినా వీరిరివురి స్నేహబంధము వారు దివంగతలయ్యే వరకు కొనసాగినది. విద్యాభ్యాసానంతరము, శ్రీసుబ్బారావు గారు భారత ప్రభుత్వ రక్షణశాఖలో సివిల్ ఉద్యోగిగా అనేక పదవులు నిర్వహించి 1968సంవత్సరంలో పదవీ విరమణ చేసినారు.                  వీరికి చిన్నతనము నుండి జ్యోతిష్యశాస్త్రము మీద ఆసక్తి వున్న కారణముచేత, ఆశాస్త్రములో విశేషమైన కృషి సల్పిరి. వీరు వ్రాసిన అనేక పరిశీలనా వ్యాసములు, సాధికి రచనలు ఆనాటి ప్రముఖ పత్రికలు భారతి, ఆంధ్రపత్రిక, ఆంధ్రప్రభ, జ్యోతిష్య విజ్ఞాన పత్రిక, గోల్కొండ పత్రిక, Astrological Magazine మున్నగు వానిలో ప్రచురింపబడినవి. వీరికి సంస్కృతములోనే గాక, ఆంగ్ల, తమిళ, హిందీభాషలలో గూడ మంచి ప్రావీణ్యమువున్న కారణముచేత, ఆయా భాషల ప్రాచీన గ్రంధముల నుండి గూడ జ్యోతిష్యశాస్త్రమునకు సంబంధించిన విషయములను, రహస్యములను వీరి రచనలలో సందర్భోచితముగా వుదహరించుట చేతను వీరిగ్రంథములకు విశేష ప్రాచుర్యము లభించినది.                 1960 దశకంలో వీరు పరాశరహోర (రెండు భాగములు), ఆయుర్భావము, ధనయోగాఫలప్రదర్శనము, రాజయోగములు, జాతక బలము - ఫలము, గ్రహసంబంధములు, Benifies & Malafies(ఆంగ్లములో), 1970 దశకంలో జ్యోతిషసిద్ధాంతము, భాగ్యభావము, కళత్రభావము, అష్టకవర్గు - ఫలక్రమము, గ్రహరాశులు (మేషము నుండి మీనము వరకు) మున్నగు గ్రంధములను, 1980 దశకంలో జ్యోతిష సర్వస్వము (3 భాగములు), ద్వాదశ భావఫలములు (2 భాగములు) Maha Yogas(ఆంగ్లములో) రచించిరి. ఇవిగాకవారి రచనలనేకములు ఆకాశవాణిలో ప్రసారమయినవి. భారతదేశములో జరిగిన పెక్కు జ్యోతిషసభలలో కీలక ఉపన్యాసములు చేయుటయే గాక, నవీన సిద్ధాంతములను ప్రతిపాదించిన, ఈ శాస్త్రములో వారికి గల పరిశోధనాశక్తి, ప్రజ్ఞాపాటవములను చాటి చెప్పి అనేకమంది జ్యోతిష్యులకు ఆదర్శప్రయులు, మార్గదర్శకులును అయినారు. జ్యోతిష పరిజ్ఞానము, ఆసక్తి వున్నవారికి సుబ్బారావు గారి గ్రంధములు ఎంతగానో ఉపయుక్తము అయినవి. ఇవి చదువని జ్యోతిష్యులు ఆంధ్రప్రదేశములో లేరనుట అతిశయోక్తికాదు. ప్రముఖ జ్యోతిషగ్రంధములను సమీక్ష చేయుచూ - "జ్యోతిషంలో శాస్త్రమే గాక అనుభవము గూడా ఎక్కువ ఉపయోగపడుతుంది. శ్రీదివాకరుని వెంకట సుబ్బారావు గారు వారి అనుభవాన్ని వారి గ్రంధములలో జ్యోతిషముపై ఉత్సాహం కలిగేటట్లుగా రచన సాగించినారు" అని ప్రశంసించినారు. మరియొక ప్రముఖ సమీక్షకులు శ్రీ ఆయాస్య ఇలా వ్రాసినారు - జ్యోతిషములో విషయాన్ని సుస్పష్టంగా సులభం చేసి రచన సాగించగల కొద్దిమంది జ్యోతిర్విద్యావేత్తలలో శ్రీదివాకరుని వేంకట సుబ్బారావు గారు అగ్రగణ్యులు. వీరి రామాయణ గ్రంధములలో అందలి ప్రధాన పత్రాలను గురించి, జ్యోతిష సంబంధముగా అనేక రహస్యములను వెల్లడించినారు".               శ్రీ దివాకరుని వేంకట సుబ్బారావుగారు జ్యోతిష శాస్త్రములో చేసిన కృషికి, సేవలకు మెచ్చుకొని పెక్కు సంస్థలు అనేక సన్మానములను, బిరుదు ప్రధానములను చేసినారు.

Features

  • : Langna Nadi
  • : Divakaruni Venkata Subbarao
  • : Vasundhara Publications
  • : GOLLAPU148
  • : Hard Bound
  • : 695
  • : Telugu

Reviews

Be the first one to review this product

Discussion:Langna Nadi

Be the first to start a discussion Start a new discussion

Browse all Discussions on Books
Powered by infibeam