Kakettukellindi

Rs.70
Rs.70

Kakettukellindi
INR
MANIMN3094
In Stock
70.0
Rs.70


In Stock
Ships in 4 - 9 Days
Check for shipping and cod pincode

Description

                               'బాలబంధు' అలపర్తి వెంకటసుబ్బారావు బాల సాహిత్యంలో వివిధ ప్రక్రియలలో విశేషంగా కృషిచేసి బాలబంధు బిరుదాంకితులైన వెంకట సుబ్బారావుగారు తెనాలి మండలం అంగలకుదురు గ్రామంలో 15 మే 1934న జన్మించారు. నందివెలుగు గ్రామంలో స్థిరపడిన వీరి రచనలు 1952 నుండి వివిధ పత్రికలలో ప్రచురించబడ్డాయి. 1955లో దీప్తి పబ్లికేషన్స్ ప్రారంభించి, 'బాలానందం' తొలి గ్రంథం ప్రచురించారు. 1957 నుండి 2014 వరకు అనేక పుస్తకాలు వెలువరించారు.

                                మినీగేయాలు - మావూరివారు, చిట్టి కవితలు, బాలగేయాలు - పిల్లనగ్రోవి, తాయం, ఆటలపాటలు, పండుగల పాటలు, శ్రుతిలయలు, గేయకథలు - నెమలికన్నులు, వీర్బల్ వినోదాలు, నిమ్మతొనలు, స్వర్ణపుష్పాలు, గేయకావ్యాలు - ఏకలవ్యుడు, స్నేహధర్మం, పద్యరచన - బంగారుపాప, సంగీత నాటిక - వారసత్వం, ఇందిర అలుకమానింది (బొమ్మలకథ), చివరకుమిగిలేది (నాటిక), చిన్నారిలోకం (బాల మనస్తత్వ విశ్లేషణ), ఇంకా బంగారుపాప, ఐకమత్యమే మహాబలం, కలసి వుంటే కలదు బలం, జడకుచ్చులు, గాలిపటం చెప్పింది, అక్కయ్య జాబు మొ|| అనేక కథలు రచించారు.

                                విజయవాడ, ఆకాశవాణి కేంద్రం ద్వారా 'బొమ్మరిల్లు' పాటలు, నెహ్రు జయంతి సందర్భంగా కొన్ని పాటలు, పూదోట (సంగీత రూపకం), ప్రకృతి - వికృతి (సంగీత రూపకం) ప్రసారితం. ఉయ్యూరులో, ఆకాశవాణి ఆధ్వర్యంలో 'పూదోట' రంగస్థల ప్రదర్శన జరిగింది.

                               2010 'బాలబంధు” “అలపర్తి వెంకట సుబ్బారావు - రచనలు - పరిశీలన” అనే అంశంపై పరిశోధన చేసి శ్రీ రావెళ్ళ శ్రీనివాసరావు, పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం నుండి పిహెచ్.డి పట్టా పొందారు. -

                               ఆంధ్రప్రదేశ్ బాలల అకాడమిచే, 'పాలవెన్నెల', (1983) ప్రచురణ జరిగింది. 1983లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ నాల్గవ తరగతి తెలుగు వాచకం రచన చేశారు. ఆంధ్రప్రదేశ్ బాలల అకాడమిచే 'బాలబంధు' బిరుదు ప్రదానం చేయబడింది. 1997లో శ్రీరామారూరల్ కళాశాల (చిలుమూరు) వారిచే చక్రపాణి - కొలసాని అవార్డుతో సత్కరించబడ్డారు. 'శ్రుతిలయలు' గ్రంథానికి పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయంవారి 2012 బాల సాహిత్య పురస్కార ప్రదానం జరిగింది. 2016లో "స్వర్ణ పుష్పాలు” గేయ కథామాలకు, బాలసాహిత్యంలో కేంద్ర సాహిత్య అకాడమి అవార్డు లభించింది.

                               'బాలబంధు' అలపర్తి వెంకటసుబ్బారావు బాల సాహిత్యంలో వివిధ ప్రక్రియలలో విశేషంగా కృషిచేసి బాలబంధు బిరుదాంకితులైన వెంకట సుబ్బారావుగారు తెనాలి మండలం అంగలకుదురు గ్రామంలో 15 మే 1934న జన్మించారు. నందివెలుగు గ్రామంలో స్థిరపడిన వీరి రచనలు 1952 నుండి వివిధ పత్రికలలో ప్రచురించబడ్డాయి. 1955లో దీప్తి పబ్లికేషన్స్ ప్రారంభించి, 'బాలానందం' తొలి గ్రంథం ప్రచురించారు. 1957 నుండి 2014 వరకు అనేక పుస్తకాలు వెలువరించారు.                                 మినీగేయాలు - మావూరివారు, చిట్టి కవితలు, బాలగేయాలు - పిల్లనగ్రోవి, తాయం, ఆటలపాటలు, పండుగల పాటలు, శ్రుతిలయలు, గేయకథలు - నెమలికన్నులు, వీర్బల్ వినోదాలు, నిమ్మతొనలు, స్వర్ణపుష్పాలు, గేయకావ్యాలు - ఏకలవ్యుడు, స్నేహధర్మం, పద్యరచన - బంగారుపాప, సంగీత నాటిక - వారసత్వం, ఇందిర అలుకమానింది (బొమ్మలకథ), చివరకుమిగిలేది (నాటిక), చిన్నారిలోకం (బాల మనస్తత్వ విశ్లేషణ), ఇంకా బంగారుపాప, ఐకమత్యమే మహాబలం, కలసి వుంటే కలదు బలం, జడకుచ్చులు, గాలిపటం చెప్పింది, అక్కయ్య జాబు మొ|| అనేక కథలు రచించారు.                                 విజయవాడ, ఆకాశవాణి కేంద్రం ద్వారా 'బొమ్మరిల్లు' పాటలు, నెహ్రు జయంతి సందర్భంగా కొన్ని పాటలు, పూదోట (సంగీత రూపకం), ప్రకృతి - వికృతి (సంగీత రూపకం) ప్రసారితం. ఉయ్యూరులో, ఆకాశవాణి ఆధ్వర్యంలో 'పూదోట' రంగస్థల ప్రదర్శన జరిగింది.                                2010 'బాలబంధు” “అలపర్తి వెంకట సుబ్బారావు - రచనలు - పరిశీలన” అనే అంశంపై పరిశోధన చేసి శ్రీ రావెళ్ళ శ్రీనివాసరావు, పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం నుండి పిహెచ్.డి పట్టా పొందారు. -                                ఆంధ్రప్రదేశ్ బాలల అకాడమిచే, 'పాలవెన్నెల', (1983) ప్రచురణ జరిగింది. 1983లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ నాల్గవ తరగతి తెలుగు వాచకం రచన చేశారు. ఆంధ్రప్రదేశ్ బాలల అకాడమిచే 'బాలబంధు' బిరుదు ప్రదానం చేయబడింది. 1997లో శ్రీరామారూరల్ కళాశాల (చిలుమూరు) వారిచే చక్రపాణి - కొలసాని అవార్డుతో సత్కరించబడ్డారు. 'శ్రుతిలయలు' గ్రంథానికి పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయంవారి 2012 బాల సాహిత్య పురస్కార ప్రదానం జరిగింది. 2016లో "స్వర్ణ పుష్పాలు” గేయ కథామాలకు, బాలసాహిత్యంలో కేంద్ర సాహిత్య అకాడమి అవార్డు లభించింది.

Features

  • : Kakettukellindi
  • : Alaparti Venkata Subbarao
  • : Amaravathi Publications
  • : MANIMN3094
  • : Paperback
  • : Jan-2018
  • : 51
  • : Telugu

Reviews

Be the first one to review this product

Discussion:Kakettukellindi

Be the first to start a discussion Start a new discussion

Browse all Discussions on Books
Powered by infibeam