Maha Kavi- Maha Purushudu Gurajaada Apparao

By Setti Eswara Rao (Author)
Rs.40
Rs.40

Maha Kavi- Maha Purushudu Gurajaada Apparao
INR
NAVOPH0496
In Stock
40.0
Rs.40


In Stock
Ships in 4 - 9 Days
Check for shipping and cod pincode

Description

         శ్రీశ్రీ ప్రచండమైన వేగంతో అభ్యుదయ భావజాలాన్ని ప్రచారం చేయడం మూలానా, కమ్యూనిస్టు భావజాలం యావత్ ప్రపంచాన్ని ఉక్కిరిబిక్కిరి చేయడం వల్లనూ గురజాడ వేసిన రహదారి మీద పేరుకున్న దుమ్ముధూళి చెదిరిపోయాయి. రహదారిని ఆక్రమించుకున్న కంచే తుమ్మచెట్లు విరిగిపోయాయి. తెలుగుదేశంలోని ప్రధాన జీవనస్రవంతి ఆ రహదారిమీద ప్రయాణం మొదలుపెట్టింది. కమ్యూనిస్టు పార్టీవారు, అభ్యుదయ రచయితలూ గురజాడను మహాకవి, యుగకర్త అనీ పిలవకముందే దేవులపల్లి కృష్ణశాస్త్రి గురజాడను మహాకవి అని సంబోధించాడు.

          గురజాడ తన అసమ్మతి పత్రంలో "తెలుగు సాహిత్యానికి సంకెళ్ళు వేసి కడుపు మాడ్చాడమా, లేక దానికి జవసత్వాలనిచ్చి, దాన్ని ఒక గొప్ప నాగరిక శక్తిగా చేయడమా అనేది మన పై ఆధారపడి వుంది." అన్న చిరస్మరణీయ వాక్యాన్ని మరోసారి మననం చేసుకుంటూ గురజాడ జీవిత చరిత్రను మీ ముందుకు తేవడానికి శెట్టి ఈశ్వరరావు ఎంతో కృషి చేశారు. ఈ పుస్తకం ఆధునికులకు ఎంతో ప్రయోజనకరమైనది. అంత గొప్ప మహాకవి గురించి ఎంతో గొప్పగా రాసిన పుస్తకం ఇది. గురజాడ భక్తుడినైన నేను ఈ నాలుగు ముక్కలరాత నెపంతో నా దేవుడికి నేను నమస్కరిస్తున్నాను.

                                                                                                 - కె ఎన్ వై పతంజలి          

         శ్రీశ్రీ ప్రచండమైన వేగంతో అభ్యుదయ భావజాలాన్ని ప్రచారం చేయడం మూలానా, కమ్యూనిస్టు భావజాలం యావత్ ప్రపంచాన్ని ఉక్కిరిబిక్కిరి చేయడం వల్లనూ గురజాడ వేసిన రహదారి మీద పేరుకున్న దుమ్ముధూళి చెదిరిపోయాయి. రహదారిని ఆక్రమించుకున్న కంచే తుమ్మచెట్లు విరిగిపోయాయి. తెలుగుదేశంలోని ప్రధాన జీవనస్రవంతి ఆ రహదారిమీద ప్రయాణం మొదలుపెట్టింది. కమ్యూనిస్టు పార్టీవారు, అభ్యుదయ రచయితలూ గురజాడను మహాకవి, యుగకర్త అనీ పిలవకముందే దేవులపల్లి కృష్ణశాస్త్రి గురజాడను మహాకవి అని సంబోధించాడు.           గురజాడ తన అసమ్మతి పత్రంలో "తెలుగు సాహిత్యానికి సంకెళ్ళు వేసి కడుపు మాడ్చాడమా, లేక దానికి జవసత్వాలనిచ్చి, దాన్ని ఒక గొప్ప నాగరిక శక్తిగా చేయడమా అనేది మన పై ఆధారపడి వుంది." అన్న చిరస్మరణీయ వాక్యాన్ని మరోసారి మననం చేసుకుంటూ గురజాడ జీవిత చరిత్రను మీ ముందుకు తేవడానికి శెట్టి ఈశ్వరరావు ఎంతో కృషి చేశారు. ఈ పుస్తకం ఆధునికులకు ఎంతో ప్రయోజనకరమైనది. అంత గొప్ప మహాకవి గురించి ఎంతో గొప్పగా రాసిన పుస్తకం ఇది. గురజాడ భక్తుడినైన నేను ఈ నాలుగు ముక్కలరాత నెపంతో నా దేవుడికి నేను నమస్కరిస్తున్నాను.                                                                                                  - కె ఎన్ వై పతంజలి          

Features

  • : Maha Kavi- Maha Purushudu Gurajaada Apparao
  • : Setti Eswara Rao
  • : Navodaya Publishers
  • : NAVOPH0496
  • : Paperback
  • : 2015
  • : 104
  • : Telugu

Reviews

Be the first one to review this product

Discussion:Maha Kavi- Maha Purushudu Gurajaada Apparao

Be the first to start a discussion Start a new discussion

Browse all Discussions on Books
Powered by infibeam