Maha Vamsham

Rs.250
Rs.250

Maha Vamsham
INR
MANIMN3656
In Stock
250.0
Rs.250


In Stock
Ships in 4 - 9 Days
Check for shipping and cod pincode

Description

పూజ్య ఆచార్య బుద్దరక్షిత భంతే శత జయంతి సంచిక

పూజ్య ఆచార్య బుద్ధ రక్షిత భంతే (బడా భంతే) గారు భారతదేశంలోని మణిపూర్ రాష్ట్ర రాజధాని ఇంఫాలో 1922 మార్చి 12న ఫాల్గుణ పౌర్ణమి రోజున జన్మించారు. బుద్ధధమ్మం పునరుద్దరణ కోసం సర్వస్వం త్యాగం చేసిన గొప్ప వ్యక్తిత్వం గల గౌరవనీయులైన బదా భంతే గారి జయంతిని ఈ 2021-22 సంవత్సరం భారతదేశం మొత్తంలో జరుపుకుంటున్నాము. సామరస్యాన్ని, శాంతిని జనులకు అవగాహన కల్పిస్తూ అందరిని ప్రోత్సహిస్తూ 67 సంవత్సరాల పాటు ఆయన చేసిన 'అంకితమైన సేవలు' ఈ నాటి ఆధునిక కాలంలోని బౌద్ధ చరిత్ర పేజీలలో చెరిగిపోని ముద్రను వేసింది...

తేటతెల్లమైన ఆయన జీవితం స్ఫూర్తిదాయకమైన సంఘటనలతో నిండి ఉంది. అలాంటి పారాలు గల ఆయన జీవితం మాకు ఒక గొప్ప పుస్తకం, ఆయన జీవితమంతా కూడా ఎంతో స్పష్టత గల దృష్టి కోణానికి తార్కాణమే. ఎన్నో పోరాటాల్లో ఆయన తీసుకొన్న నిర్ణయాలు, సాధించిన విజయాలు మనకు ఎప్పటికీ మార్గదర్శకాలే.

ఈ దార్శనిక భిక్షువు తన యవ్వనంలో సైనికునిగా రెండవ ప్రపంచ యుద్ధపు గందరగోళాన్ని ఎదుర్కొన్న తరువాత 25 సంవత్సరాల వయస్సులో ఇంటిని విడిచిపెట్టాడు. జీవితంలో సత్యం కోసం చేసిన అన్వేషణ ఆయనను భారతదేశంలోని మూల మూలలకు తీసుకెళ్లింది. చివరికి బుద్ధ భగవానుని ధర్మదీపం ఆయనకు స్వేచ్ఛ, సంతోషాల అంతిమ మార్గాన్ని చూపింది. ఆయన నిజాయితీ, పక్షపాతం లేని సత్యాన్వేషణ, అతడిని ధమ్మం అధ్యయనం చేయడానికి, అభ్యాసానికి, సత్య సాక్షాత్కారానికి ఆయనను అంకితం చేసింది.

1949వ సంవత్సరం నిండు పౌర్ణమి రోజున ఆయన కుషీనగరంలో అత్యంత గౌరవనీయులైన పూజ్యులైన చందమణి మహాథీరా వద్ద ప్రవ్రజ్య తీసుకొన్నారు. భిక్షు జీవితంలో బుద్దరక్షిత అనే పేరు ఆయనకు ఇవ్వబడింది. శ్రీలంక మరియు మయన్మార్‌లో ఆ కాలంలోని ప్రముఖ ఆచార్యుల వద్ద ధమ్మ పాఠాలు | నేర్చుకోవడం చాలా అదృష్టంగా ఆయన భావించేవారు. ఛట సంగాయనాలో అనువిశోధకునిగా పాల్గొనడం - ఆయన జీవితంలో చాలా ముఖ్యమైన ఘట్టం. అత్యంత చారిత్రక విలువ కలిగిన యాంగోలో జరిగిన ఆరవ బౌద్ధ మండలిలో పాల్గొనడం అరుదైన విశేషం.

భారతదేశానికి తిరిగి వచ్చిన ఆయన నలందలోని నవ నలంద పోస్ గ్రాడ్యుయేట్ ఇనిస్టిట్యూట్‌లో ప్రొఫెసర్‌గా పనిచేశారు. 5 జూన్ 1956 న ఆయన బోధిగయ నుండి పవిత్రమైన బోధి వృక్షపు శాఖతో బెంగళూరుకు చేరుకుని మహా బోధి సొసైటీని ప్రారంభించారు. ఆయన కరుణ అపారం. ఆయన సహాయం | సంసిద్ధం. ఎవరికి ఎక్కడ ఏ ఔషధం అవసరమైనా సరే, ఏ సహాయం కావాలన్నా సరే ఆయన అక్కడ ప్రత్యక్షమయ్యేవాడు. ఆధ్యాత్మికత, మానవత్వం రెంటి అవిభాజ్యతకు ఆయన అద్భుతమైన ఉదాహరణ. ఆయన చేసే ప్రతి కార్యకలాపంలో రెండూ మిళితమై పోయి ఉండేవి. వాస్తవానికి, అతను చేసిన ప్రతి పని | ఆధ్యాత్మికంగా ప్రేరేపించబడింది. ధ్యాన బోధన, ధమ్మ ఉపన్యాసాలు, ఆసుపత్రులు, కృత్రిమ అవయవాల | కేంద్రం (artificial limbs) నడపడం ఆయన ఆధ్యాత్మిక పురోగతికి మరింత దారి తీసింది. వాటి నిర్వహణ ఆదర్శప్రాయమై నిలచింది. తాను చేసిన ఏ సేవనైనా ఆయన ఎల్లప్పుడూ బుద్ధుని పాదాల వద్ద వినయపూర్వకంగా సమర్పించేవారు. తనను తాను 'బుద్ధ దాస' అని భావించుకొనే వారు...........

పూజ్య ఆచార్య బుద్దరక్షిత భంతే శత జయంతి సంచిక పూజ్య ఆచార్య బుద్ధ రక్షిత భంతే (బడా భంతే) గారు భారతదేశంలోని మణిపూర్ రాష్ట్ర రాజధాని ఇంఫాలో 1922 మార్చి 12న ఫాల్గుణ పౌర్ణమి రోజున జన్మించారు. బుద్ధధమ్మం పునరుద్దరణ కోసం సర్వస్వం త్యాగం చేసిన గొప్ప వ్యక్తిత్వం గల గౌరవనీయులైన బదా భంతే గారి జయంతిని ఈ 2021-22 సంవత్సరం భారతదేశం మొత్తంలో జరుపుకుంటున్నాము. సామరస్యాన్ని, శాంతిని జనులకు అవగాహన కల్పిస్తూ అందరిని ప్రోత్సహిస్తూ 67 సంవత్సరాల పాటు ఆయన చేసిన 'అంకితమైన సేవలు' ఈ నాటి ఆధునిక కాలంలోని బౌద్ధ చరిత్ర పేజీలలో చెరిగిపోని ముద్రను వేసింది... తేటతెల్లమైన ఆయన జీవితం స్ఫూర్తిదాయకమైన సంఘటనలతో నిండి ఉంది. అలాంటి పారాలు గల ఆయన జీవితం మాకు ఒక గొప్ప పుస్తకం, ఆయన జీవితమంతా కూడా ఎంతో స్పష్టత గల దృష్టి కోణానికి తార్కాణమే. ఎన్నో పోరాటాల్లో ఆయన తీసుకొన్న నిర్ణయాలు, సాధించిన విజయాలు మనకు ఎప్పటికీ మార్గదర్శకాలే. ఈ దార్శనిక భిక్షువు తన యవ్వనంలో సైనికునిగా రెండవ ప్రపంచ యుద్ధపు గందరగోళాన్ని ఎదుర్కొన్న తరువాత 25 సంవత్సరాల వయస్సులో ఇంటిని విడిచిపెట్టాడు. జీవితంలో సత్యం కోసం చేసిన అన్వేషణ ఆయనను భారతదేశంలోని మూల మూలలకు తీసుకెళ్లింది. చివరికి బుద్ధ భగవానుని ధర్మదీపం ఆయనకు స్వేచ్ఛ, సంతోషాల అంతిమ మార్గాన్ని చూపింది. ఆయన నిజాయితీ, పక్షపాతం లేని సత్యాన్వేషణ, అతడిని ధమ్మం అధ్యయనం చేయడానికి, అభ్యాసానికి, సత్య సాక్షాత్కారానికి ఆయనను అంకితం చేసింది. 1949వ సంవత్సరం నిండు పౌర్ణమి రోజున ఆయన కుషీనగరంలో అత్యంత గౌరవనీయులైన పూజ్యులైన చందమణి మహాథీరా వద్ద ప్రవ్రజ్య తీసుకొన్నారు. భిక్షు జీవితంలో బుద్దరక్షిత అనే పేరు ఆయనకు ఇవ్వబడింది. శ్రీలంక మరియు మయన్మార్‌లో ఆ కాలంలోని ప్రముఖ ఆచార్యుల వద్ద ధమ్మ పాఠాలు | నేర్చుకోవడం చాలా అదృష్టంగా ఆయన భావించేవారు. ఛట సంగాయనాలో అనువిశోధకునిగా పాల్గొనడం - ఆయన జీవితంలో చాలా ముఖ్యమైన ఘట్టం. అత్యంత చారిత్రక విలువ కలిగిన యాంగోలో జరిగిన ఆరవ బౌద్ధ మండలిలో పాల్గొనడం అరుదైన విశేషం. భారతదేశానికి తిరిగి వచ్చిన ఆయన నలందలోని నవ నలంద పోస్ గ్రాడ్యుయేట్ ఇనిస్టిట్యూట్‌లో ప్రొఫెసర్‌గా పనిచేశారు. 5 జూన్ 1956 న ఆయన బోధిగయ నుండి పవిత్రమైన బోధి వృక్షపు శాఖతో బెంగళూరుకు చేరుకుని మహా బోధి సొసైటీని ప్రారంభించారు. ఆయన కరుణ అపారం. ఆయన సహాయం | సంసిద్ధం. ఎవరికి ఎక్కడ ఏ ఔషధం అవసరమైనా సరే, ఏ సహాయం కావాలన్నా సరే ఆయన అక్కడ ప్రత్యక్షమయ్యేవాడు. ఆధ్యాత్మికత, మానవత్వం రెంటి అవిభాజ్యతకు ఆయన అద్భుతమైన ఉదాహరణ. ఆయన చేసే ప్రతి కార్యకలాపంలో రెండూ మిళితమై పోయి ఉండేవి. వాస్తవానికి, అతను చేసిన ప్రతి పని | ఆధ్యాత్మికంగా ప్రేరేపించబడింది. ధ్యాన బోధన, ధమ్మ ఉపన్యాసాలు, ఆసుపత్రులు, కృత్రిమ అవయవాల | కేంద్రం (artificial limbs) నడపడం ఆయన ఆధ్యాత్మిక పురోగతికి మరింత దారి తీసింది. వాటి నిర్వహణ ఆదర్శప్రాయమై నిలచింది. తాను చేసిన ఏ సేవనైనా ఆయన ఎల్లప్పుడూ బుద్ధుని పాదాల వద్ద వినయపూర్వకంగా సమర్పించేవారు. తనను తాను 'బుద్ధ దాస' అని భావించుకొనే వారు...........

Features

  • : Maha Vamsham
  • : Tiyagura Sitarami Reddy
  • : Buddha Vachana Trust
  • : MANIMN3656
  • : paparback
  • : April, 2022
  • : 157
  • : Telugu

Reviews

Be the first one to review this product

Discussion:Maha Vamsham

Be the first to start a discussion Start a new discussion

Browse all Discussions on Books
Powered by infibeam