Gajula Lakshmaninarasu Chetty

Rs.100
Rs.100

Gajula Lakshmaninarasu Chetty
INR
MANIMN2594
In Stock
100.0
Rs.100


In Stock
Ships in 4 - 9 Days
Check for shipping and cod pincode

Description

గాజుల లక్ష్మీనరసు చెట్టి (1806-1868) మద్రాస్ ప్రెసిడెన్సీలో 19వ శతాబ్ది ప్రజా ఉద్యమ నిర్మాత, నిర్దేశకుడు. ఆయన కుటుంబం ఆంధ్ర తీరప్రాంతం (మచిలీపట్నం) నుండి మద్రాసు వలసవెళ్ళిన కుటుంబం. ఆయన చిన్నతనం నుండే సామాజిక దృష్టిని పెంపొందించుకొన్నాడు. సమకాలీన సాహిత్య సంఘాల చర్చలు, ఉపన్యాసాల్లో పాల్గొని, తన ఆలోచనాపరిధిని విస్తరించుకున్నాడు. వలస ప్రభుత్వ ప్రజావ్యతిరేక చర్యలపై గళమెత్తి, పోరాటం సాగించిన తొలి రాజకీయ వైతాళికుడు. మద్రాసు గవర్నర్ శాసన మండలి సభ్యుడిగా ప్రజాప్రతినిధుల ఎన్నిక విధానంపై ఆయన స్పందించాడు. ప్రజాహక్కులు, పౌర ప్రజాస్వామ్య పద్దతులపై తన వాదనను బలంగా వినిపించాడు. సమకాలీన మేధావులు ముక్తకంఠంతో లక్ష్మీనరసు చెట్టిని మద్రాస్ ప్రెసిడెన్సీలో 'తొలి ప్రజాపోరాట యోధుడు'గా వర్ణించారు. ఆయన జీవితచరిత్ర భావితరాలకు శిరోధార్యం.

వకుళాభరణం రామకృష్ణ చరిత్ర అధ్యాపకునిగా హైదరాబాదు కేంద్రీయ విశ్వవిద్యాలయం నుండి పదవీ విరమణ చేశారు. ఆధునిక ఆంధ్రలో సంఘసంస్కరణ ఉద్యమాలపై ఆయన సిద్ధాంత వ్యాసం రచించి, న్యూఢిల్లి లోని జవహర్ లాల్ నెహ్రూ - విశ్వవిద్యాలయం నుండి ప్రొ|| సర్వేపల్లి గోపాల్ పర్యవేక్షణలో డాక్టరేట్ డిగ్రీ పొందారు. జవహర్ భారతి (కావలి), న్యాయ విశ్వవిద్యాలయం (నల్సార్, హైదరాబాదు) మొదలగు సంస్థల్లో కూడా ఆయన చరిత్రను బోధించారు. ఆంధ్రప్రదేశ్ చరిత్ర కాంగ్రెస్ వ్యవస్థాపక సభ్యుల్లో ఒకరు.

అఖిల భారత చరిత్ర కాంగ్రెస్జాతీయ కార్యదర్శిగా కూడా పనిచేశారు. శాస్త్రీయ, లౌకిక దృష్టితో అనేక చరిత్ర గ్రంథాలను, వ్యాసాలను ప్రచురించారు. ఆయన సంపాదక పర్యవేక్షణలో ఇటీవల ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చరిత్ర, సంస్కృతులపై తొమ్మిది సంపుటాలు ప్రచురితమైనాయి. శాస్త్రీయ, లౌకికచరిత్ర రచనలో యువ చరిత్రకారులకు నేటికీ మార్గనిర్దేశనం చేస్తున్నారు.

గాజుల లక్ష్మీనరసు చెట్టి (1806-1868) మద్రాస్ ప్రెసిడెన్సీలో 19వ శతాబ్ది ప్రజా ఉద్యమ నిర్మాత, నిర్దేశకుడు. ఆయన కుటుంబం ఆంధ్ర తీరప్రాంతం (మచిలీపట్నం) నుండి మద్రాసు వలసవెళ్ళిన కుటుంబం. ఆయన చిన్నతనం నుండే సామాజిక దృష్టిని పెంపొందించుకొన్నాడు. సమకాలీన సాహిత్య సంఘాల చర్చలు, ఉపన్యాసాల్లో పాల్గొని, తన ఆలోచనాపరిధిని విస్తరించుకున్నాడు. వలస ప్రభుత్వ ప్రజావ్యతిరేక చర్యలపై గళమెత్తి, పోరాటం సాగించిన తొలి రాజకీయ వైతాళికుడు. మద్రాసు గవర్నర్ శాసన మండలి సభ్యుడిగా ప్రజాప్రతినిధుల ఎన్నిక విధానంపై ఆయన స్పందించాడు. ప్రజాహక్కులు, పౌర ప్రజాస్వామ్య పద్దతులపై తన వాదనను బలంగా వినిపించాడు. సమకాలీన మేధావులు ముక్తకంఠంతో లక్ష్మీనరసు చెట్టిని మద్రాస్ ప్రెసిడెన్సీలో 'తొలి ప్రజాపోరాట యోధుడు'గా వర్ణించారు. ఆయన జీవితచరిత్ర భావితరాలకు శిరోధార్యం. వకుళాభరణం రామకృష్ణ చరిత్ర అధ్యాపకునిగా హైదరాబాదు కేంద్రీయ విశ్వవిద్యాలయం నుండి పదవీ విరమణ చేశారు. ఆధునిక ఆంధ్రలో సంఘసంస్కరణ ఉద్యమాలపై ఆయన సిద్ధాంత వ్యాసం రచించి, న్యూఢిల్లి లోని జవహర్ లాల్ నెహ్రూ - విశ్వవిద్యాలయం నుండి ప్రొ|| సర్వేపల్లి గోపాల్ పర్యవేక్షణలో డాక్టరేట్ డిగ్రీ పొందారు. జవహర్ భారతి (కావలి), న్యాయ విశ్వవిద్యాలయం (నల్సార్, హైదరాబాదు) మొదలగు సంస్థల్లో కూడా ఆయన చరిత్రను బోధించారు. ఆంధ్రప్రదేశ్ చరిత్ర కాంగ్రెస్ వ్యవస్థాపక సభ్యుల్లో ఒకరు.అఖిల భారత చరిత్ర కాంగ్రెస్జాతీయ కార్యదర్శిగా కూడా పనిచేశారు. శాస్త్రీయ, లౌకిక దృష్టితో అనేక చరిత్ర గ్రంథాలను, వ్యాసాలను ప్రచురించారు. ఆయన సంపాదక పర్యవేక్షణలో ఇటీవల ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చరిత్ర, సంస్కృతులపై తొమ్మిది సంపుటాలు ప్రచురితమైనాయి. శాస్త్రీయ, లౌకికచరిత్ర రచనలో యువ చరిత్రకారులకు నేటికీ మార్గనిర్దేశనం చేస్తున్నారు.

Features

  • : Gajula Lakshmaninarasu Chetty
  • : Vakulabharanam Ramakrishna
  • : Prajashakthi Book House
  • : MANIMN2594
  • : Paperback
  • : 2021
  • : 104
  • : Telugu

Reviews

Be the first one to review this product

Discussion:Gajula Lakshmaninarasu Chetty

Be the first to start a discussion Start a new discussion

Browse all Discussions on Books
Powered by infibeam