Muhurtha Darpanamu

By Sri Poluri Koundinya (Author)
Rs.250
Rs.250

Muhurtha Darpanamu
INR
MANIMN3108
In Stock
250.0
Rs.250


In Stock
Ships in 4 - 9 Days
Check for shipping and cod pincode

Description

                       ఆకాశంలో పరిభ్రమించే గ్రహల ప్రభావం మానవులపై ఉంటుందనటానికి ప్రత్యక్ష సాక్ష్యం సూర్యుడు. మానవాళి మనుగడకు ప్రధాన ఆధారం సూర్యుడు. సూర్య కిరణాలలోని శక్తిని గ్రహించి కిరణజన్య సంయోగక్రియ జరిపి వృక్షాలు ఆహారాన్ని స్వయంగా తయారు చేసుకుంటాయి. ఆ వృక్షాలను, వృక్ష సంబంధమైన పదార్థాలను ఆహారంగా తీసుకొని శాఖాహార జంతువులు జీవిస్తాయి. శాఖాహార జంతువులను ఆహారంగా తీసుకొని మాంసాహార జంతువులు బతుకుతాయి. వృక్ష సంబంధమైన, జంతు సంబంధమైన పదార్థాలను ఆహారంగా తీసుకొని మానవులు మనుగడ సాగిస్తారు. ఈ విధంగా మానవాళి మనుగడకు సూర్యుడు ప్రధాన కారణము.

                       అదేవిధంగా చంద్రుని ప్రభావం కూడ భూమిపై ప్రత్యక్షంగా కనపడుతోంది. అమావాస్య, పౌర్ణమి దినాల్లో సముద్రంలోని ఆటుపోట్లకు ప్రధాన కారణం చంద్రుడు. మానవుని మనస్తత్వంపై కూడ చంద్రుని ప్రభావం ఉంటుందని మనస్తత్వ శాస్త్రవేత్తలు నిరూపించారు.

                       మానవ జీవితముపై సూర్యచంద్రుల ప్రభావం కనిపించినంతగా ఇతర గ్రహాల ప్రభావం మనకు ప్రత్యక్షంగా కనిపించదు. కాని మహర్షులు మానవ జీవితంపై గ్రహాల ప్రభావాన్ని సూక్ష్మ దృష్టితో దర్శించి జ్యోతిశ్శాస్త్ర గ్రంథాలలో వివరించారు. పుట్టిన సమయంలోని గ్రహస్థితిని బట్టి మానవ జీవితంలో జరిగే సంఘటనలను తెలిపే శాస్త్ర విజ్ఞానమే జ్యోతిషశాస్త్రం.

                       జ్యోతిశ్శాస్త్రం ప్రధానంగా 1) సిద్ధాంతము, 2) జాతకము, 3) ముహూర్తము లేదా సంహితా విభాగం అనే మూడు విధానాలున్నాయి. ఇందులో సిద్ధాంత విభాగంలో ఏఏ గ్రహాలు, ఎప్పుడు ఎక్కడ ఎంతసేపు ఉంటాయో తెలుపుతుంది. తిథి, వార, నక్షత్ర, యోగ, కరణాలనే పంచాంగాల గణన ఈ సిద్ధాంత విభాగం తెల్పుతుంది. పంచాంగ రచన ఈ విభాగం ద్వారానే సాధ్యమవుతుంది. గ్రహస్థితులు మానవ జీవితంపై ఎటువంటి ప్రభావం కల్గిస్తాయో జాతక విభాగం తెల్పుతుంచె. ఏ కాలంలో ఏ పని చేస్తే ఎటువంటి ఫలితం వస్తుందో ముహూర్త విభాగం తెలుపుతుంది. మానవ జీవితంలో జరిగే జాతకర్మ, అన్నప్రాసన, చౌలము, ఉప నయనము, వివాహం వంటి శుభకార్యములకు మంచి సమయాలను ఎలా నిర్ణయించాలో కూడ ముహూర్త విభాగం తెలుపుతుంది.

                       ఆకాశంలో పరిభ్రమించే గ్రహల ప్రభావం మానవులపై ఉంటుందనటానికి ప్రత్యక్ష సాక్ష్యం సూర్యుడు. మానవాళి మనుగడకు ప్రధాన ఆధారం సూర్యుడు. సూర్య కిరణాలలోని శక్తిని గ్రహించి కిరణజన్య సంయోగక్రియ జరిపి వృక్షాలు ఆహారాన్ని స్వయంగా తయారు చేసుకుంటాయి. ఆ వృక్షాలను, వృక్ష సంబంధమైన పదార్థాలను ఆహారంగా తీసుకొని శాఖాహార జంతువులు జీవిస్తాయి. శాఖాహార జంతువులను ఆహారంగా తీసుకొని మాంసాహార జంతువులు బతుకుతాయి. వృక్ష సంబంధమైన, జంతు సంబంధమైన పదార్థాలను ఆహారంగా తీసుకొని మానవులు మనుగడ సాగిస్తారు. ఈ విధంగా మానవాళి మనుగడకు సూర్యుడు ప్రధాన కారణము.                        అదేవిధంగా చంద్రుని ప్రభావం కూడ భూమిపై ప్రత్యక్షంగా కనపడుతోంది. అమావాస్య, పౌర్ణమి దినాల్లో సముద్రంలోని ఆటుపోట్లకు ప్రధాన కారణం చంద్రుడు. మానవుని మనస్తత్వంపై కూడ చంద్రుని ప్రభావం ఉంటుందని మనస్తత్వ శాస్త్రవేత్తలు నిరూపించారు.                        మానవ జీవితముపై సూర్యచంద్రుల ప్రభావం కనిపించినంతగా ఇతర గ్రహాల ప్రభావం మనకు ప్రత్యక్షంగా కనిపించదు. కాని మహర్షులు మానవ జీవితంపై గ్రహాల ప్రభావాన్ని సూక్ష్మ దృష్టితో దర్శించి జ్యోతిశ్శాస్త్ర గ్రంథాలలో వివరించారు. పుట్టిన సమయంలోని గ్రహస్థితిని బట్టి మానవ జీవితంలో జరిగే సంఘటనలను తెలిపే శాస్త్ర విజ్ఞానమే జ్యోతిషశాస్త్రం.                        జ్యోతిశ్శాస్త్రం ప్రధానంగా 1) సిద్ధాంతము, 2) జాతకము, 3) ముహూర్తము లేదా సంహితా విభాగం అనే మూడు విధానాలున్నాయి. ఇందులో సిద్ధాంత విభాగంలో ఏఏ గ్రహాలు, ఎప్పుడు ఎక్కడ ఎంతసేపు ఉంటాయో తెలుపుతుంది. తిథి, వార, నక్షత్ర, యోగ, కరణాలనే పంచాంగాల గణన ఈ సిద్ధాంత విభాగం తెల్పుతుంది. పంచాంగ రచన ఈ విభాగం ద్వారానే సాధ్యమవుతుంది. గ్రహస్థితులు మానవ జీవితంపై ఎటువంటి ప్రభావం కల్గిస్తాయో జాతక విభాగం తెల్పుతుంచె. ఏ కాలంలో ఏ పని చేస్తే ఎటువంటి ఫలితం వస్తుందో ముహూర్త విభాగం తెలుపుతుంది. మానవ జీవితంలో జరిగే జాతకర్మ, అన్నప్రాసన, చౌలము, ఉప నయనము, వివాహం వంటి శుభకార్యములకు మంచి సమయాలను ఎలా నిర్ణయించాలో కూడ ముహూర్త విభాగం తెలుపుతుంది.

Features

  • : Muhurtha Darpanamu
  • : Sri Poluri Koundinya
  • : Victory Publications
  • : MANIMN3108
  • : Paperback
  • : 2017
  • : 288
  • : Telugu

Reviews

Be the first one to review this product

Discussion:Muhurtha Darpanamu

Be the first to start a discussion Start a new discussion

Browse all Discussions on Books
Powered by infibeam