Zen Kathalu

Rs.50
Rs.50

Zen Kathalu
INR
MANIMN3876
In Stock
50.0
Rs.50


In Stock
Ships in 4 - 9 Days
Check for shipping and cod pincode

Description

జెన్

శిష్యుడు మరణ శయ్యపై ఉన్నాడు. శిష్యుడికేమైనా సాయం చేద్దామనిపించింది గురువుకు, "ఏమైనా చేయమంటావా?"

అని అడిగాడు.

"మీరేం చేయగలరు? అయినా మీతో నేను చేయించుకోవడమేమిటి? నేను ఒంటరిగానే వచ్చాను, ఒంటరిగానే పోతున్నాను" అన్నాడు శిష్యుడు. దీనికి గురువుగారి స్పందనేమిటో తెలుసా?

"రావడం పోవడమంటూ ఉన్నాయని నీవనుకుంటే నీవు అయోమయంలో ఉన్నట్టే. అది భ్రమ కూడా. నిజానికి రావడమూ లేదు, పోవడమూ లేదు. అసలైన నిజం" అని బోధించాడు.

ఒక శిష్యుడికి స్వర్గ నరకాలున్నాయా అని తెలుసుకోవాలనిపించింది. ఎవరినో అడగడమెందుకు సూటిగా గురువునే అడిగితే సరిపోతుంది కదా అనుకున్నాడు. ఒక రోజు గురువు ప్రశాంతంగా ఉన్న సమయంలో శిష్యుదాయనను సమీ పించాడు. అవీ ఇవీ మాట్లాడాడు.

"స్వామీ స్వర్గ నరకాలున్నాయా?" అని మెల్లగా అడిగాడు.

"ఉన్నాయి."

"స్వామీ! పొరుగూరిలో ఉన్న స్వామీజీ స్వర్గనరకాలు లేవంటున్నారండీ." "నీకు పెళ్ళయిందా?”

“అయింది స్వామి. ఇద్దరు పిల్లలు కూడా.”

"మరి ఆ స్వామీజీకి పెళ్ళయిందా?”

"లేదండి. ఆయన సన్యాసి కదా!"

"అందుకే ఆయనకు స్వర్గ నరకాలు లేవు. నీకున్నాయి" అన్నాడు గురువు.

*

జెన్ అంటే మనం నమ్మలేనంత సహజమైనది. ప్రకృతి సంబంధ మైనది. దానికి లక్ష్యాలు లేవు, నియమ నిబంధనలు లేవు. అది ఒక తత్త్వం కూడా కాదు.

ప్రపంచంలోని అన్నిరకాల తత్వజ్ఞానాల సంకెళ్ళను ఛేదించి మనిషికి పరిపూర్ణమైన ముక్తినిచ్చేది జెన్.

జెన్ ఒక జీవన విధానం కాదు. ప్రత్యేకమైన నియమాలూ లేవు. మేము జెన్ పద్ధతిలో జీవిస్తున్నామని చెప్పడానికి వీల్లేదంటారు. జెన్ జ్ఞానులు. జెన్లోనే జీవిస్తున్నామని చెప్పడం కూడా వారి దృష్టిలో తప్పే. జెన్గా ఉన్నామనాలి. అంటే అప్రమత్తంగా ఉండడం.

అందుకే జెన్ను వివరించడం కష్టం.

జెన్ శిష్యుడు మరణ శయ్యపై ఉన్నాడు. శిష్యుడికేమైనా సాయం చేద్దామనిపించింది గురువుకు, "ఏమైనా చేయమంటావా?" అని అడిగాడు. "మీరేం చేయగలరు? అయినా మీతో నేను చేయించుకోవడమేమిటి? నేను ఒంటరిగానే వచ్చాను, ఒంటరిగానే పోతున్నాను" అన్నాడు శిష్యుడు. దీనికి గురువుగారి స్పందనేమిటో తెలుసా? "రావడం పోవడమంటూ ఉన్నాయని నీవనుకుంటే నీవు అయోమయంలో ఉన్నట్టే. అది భ్రమ కూడా. నిజానికి రావడమూ లేదు, పోవడమూ లేదు. అసలైన నిజం" అని బోధించాడు. ఒక శిష్యుడికి స్వర్గ నరకాలున్నాయా అని తెలుసుకోవాలనిపించింది. ఎవరినో అడగడమెందుకు సూటిగా గురువునే అడిగితే సరిపోతుంది కదా అనుకున్నాడు. ఒక రోజు గురువు ప్రశాంతంగా ఉన్న సమయంలో శిష్యుదాయనను సమీ పించాడు. అవీ ఇవీ మాట్లాడాడు. "స్వామీ స్వర్గ నరకాలున్నాయా?" అని మెల్లగా అడిగాడు. "ఉన్నాయి." "స్వామీ! పొరుగూరిలో ఉన్న స్వామీజీ స్వర్గనరకాలు లేవంటున్నారండీ." "నీకు పెళ్ళయిందా?” “అయింది స్వామి. ఇద్దరు పిల్లలు కూడా.” "మరి ఆ స్వామీజీకి పెళ్ళయిందా?” "లేదండి. ఆయన సన్యాసి కదా!" "అందుకే ఆయనకు స్వర్గ నరకాలు లేవు. నీకున్నాయి" అన్నాడు గురువు. * జెన్ అంటే మనం నమ్మలేనంత సహజమైనది. ప్రకృతి సంబంధ మైనది. దానికి లక్ష్యాలు లేవు, నియమ నిబంధనలు లేవు. అది ఒక తత్త్వం కూడా కాదు. ప్రపంచంలోని అన్నిరకాల తత్వజ్ఞానాల సంకెళ్ళను ఛేదించి మనిషికి పరిపూర్ణమైన ముక్తినిచ్చేది జెన్. జెన్ ఒక జీవన విధానం కాదు. ప్రత్యేకమైన నియమాలూ లేవు. మేము జెన్ పద్ధతిలో జీవిస్తున్నామని చెప్పడానికి వీల్లేదంటారు. జెన్ జ్ఞానులు. జెన్లోనే జీవిస్తున్నామని చెప్పడం కూడా వారి దృష్టిలో తప్పే. జెన్గా ఉన్నామనాలి. అంటే అప్రమత్తంగా ఉండడం. అందుకే జెన్ను వివరించడం కష్టం.

Features

  • : Zen Kathalu
  • : D Candra Shekar Reddy
  • : Media House Publications
  • : MANIMN3876
  • : paparback
  • : Jan, 2025
  • : 108
  • : Telugu

Reviews

Be the first one to review this product

Discussion:Zen Kathalu

Be the first to start a discussion Start a new discussion

Browse all Discussions on Books
Powered by infibeam