Oka Samskartha Bharya Atma Kadha Oka Patala Kavi Bharya Manovedana

By Ranganayakamma (Author)
Rs.40
Rs.40

Oka Samskartha Bharya Atma Kadha Oka Patala Kavi Bharya Manovedana
INR
APHRNY0045
In Stock
40.0
Rs.40


In Stock
Ships in 4 - 9 Days
Check for shipping and cod pincode

Description

ఈ పుస్తకంలో కనిపించే గాధలు నేను రాసినవి కావు.

         ఒక సంస్కర్త భార్యా, ఒక పాటల కవి భార్యా రాసినవి. ఆ ఇద్దరు స్త్రీల చరిత్రలూ, భార్యలుగా అవమానాలు భరించిన గాధలే. "చింతామణి" నాటకం రాసిన రచయిత కాళ్ళకూరి నారాయణ రావు. " భార్యగా ఉండడమే భార్య తప్పు" అని, సమాజంలో వున్న ఒక నగ్నసత్యాన్ని స్త్రీల పట్ల ఆదరంతో చెబుతాడు. అది, స్త్రీలను హేళన చేయడం కాదు. స్త్రీలకు, ఒక సత్యాన్ని చూపించడం! ఆ రచన, వ్యభిచార సంబంధాల్ని తీవ్రంగా వ్యతిరేకిస్తుంది.

       స్త్రీ పురుషుల కుటుంబ సంబంధాల్ని ద్వంసం చేసే  అసలైన నీచ విషయం, వ్యభిచారాలే. అవి, పురుషాధిక్యత నుంచి పుట్టుకు వచ్చే నేరాలే. ఆ నేరాలు, భర్తలవి అయినా,  భార్యలవి అయినా, అవి కుటుంబ శాంతి సౌఖ్యాల్నీ, బిడ్డల అనురాగ పెంపకాల్ని ద్వంసం చేసే నేరాలే.

        ఈ స్త్రీల చరిత్రలు చూపించిన పురుషాహంకారాలు, కట్టు కథలు కావు. సాహిత్య కల్పనలు కావు. యదార్ధంగా ఆ భార్యలు రాసిన సత్యాలు! ఆ భార్యలు రాల్చిన కన్నీటి చుక్కలు! కన్నీటి ధారలు! వేరు వేరు సందర్భాల్లో ఇవి నా చేతుల్లోకి వచ్చాయి. వీటిని నేను ఏళ్ల తరబడీ భద్రపరచి ఉంచాను. ఇప్పటికి వీటిని బయట పెడుతున్నాను.

       ఆ స్త్రీల భర్తల పేరులూ, వారి వూరులూ, అవసరం లేదు. జరిగిన విషయాలూ, సంఘటనలూ, కనబడితే చాలు. తెలుసుకోవలసింది వాటినే.

- రంగనాయకమ్మ 

ఈ పుస్తకంలో కనిపించే గాధలు నేను రాసినవి కావు.          ఒక సంస్కర్త భార్యా, ఒక పాటల కవి భార్యా రాసినవి. ఆ ఇద్దరు స్త్రీల చరిత్రలూ, భార్యలుగా అవమానాలు భరించిన గాధలే. "చింతామణి" నాటకం రాసిన రచయిత కాళ్ళకూరి నారాయణ రావు. " భార్యగా ఉండడమే భార్య తప్పు" అని, సమాజంలో వున్న ఒక నగ్నసత్యాన్ని స్త్రీల పట్ల ఆదరంతో చెబుతాడు. అది, స్త్రీలను హేళన చేయడం కాదు. స్త్రీలకు, ఒక సత్యాన్ని చూపించడం! ఆ రచన, వ్యభిచార సంబంధాల్ని తీవ్రంగా వ్యతిరేకిస్తుంది.        స్త్రీ పురుషుల కుటుంబ సంబంధాల్ని ద్వంసం చేసే  అసలైన నీచ విషయం, వ్యభిచారాలే. అవి, పురుషాధిక్యత నుంచి పుట్టుకు వచ్చే నేరాలే. ఆ నేరాలు, భర్తలవి అయినా,  భార్యలవి అయినా, అవి కుటుంబ శాంతి సౌఖ్యాల్నీ, బిడ్డల అనురాగ పెంపకాల్ని ద్వంసం చేసే నేరాలే.         ఈ స్త్రీల చరిత్రలు చూపించిన పురుషాహంకారాలు, కట్టు కథలు కావు. సాహిత్య కల్పనలు కావు. యదార్ధంగా ఆ భార్యలు రాసిన సత్యాలు! ఆ భార్యలు రాల్చిన కన్నీటి చుక్కలు! కన్నీటి ధారలు! వేరు వేరు సందర్భాల్లో ఇవి నా చేతుల్లోకి వచ్చాయి. వీటిని నేను ఏళ్ల తరబడీ భద్రపరచి ఉంచాను. ఇప్పటికి వీటిని బయట పెడుతున్నాను.        ఆ స్త్రీల భర్తల పేరులూ, వారి వూరులూ, అవసరం లేదు. జరిగిన విషయాలూ, సంఘటనలూ, కనబడితే చాలు. తెలుసుకోవలసింది వాటినే. - రంగనాయకమ్మ 

Features

  • : Oka Samskartha Bharya Atma Kadha Oka Patala Kavi Bharya Manovedana
  • : Ranganayakamma
  • : Sweet Home Publications
  • : APHRNY0045
  • : Paperback
  • : 2015
  • : 141
  • : Telugu

Reviews

Be the first one to review this product

Discussion:Oka Samskartha Bharya Atma Kadha Oka Patala Kavi Bharya Manovedana

Be the first to start a discussion Start a new discussion

Browse all Discussions on Books
Powered by infibeam