ఏదీ మరోమారు నవ్వు.. నాకోసం
ఏదీ తోచని సమయాల్లో నీ నవ్వునే
సెలయేరు సవ్వడిలా జ్ఞాపకం తెచ్చుకుంటాను
కాంతి కిరణంలా తళుక్కున నీ ముఖంలో
మెరిసి మాయమయ్యే నవ్వును వెతుకుతుంటాను
తొలివలపుల కాలంలో
ఇద్దరి మధ్యనా నలిగిన నవ్వులకు గుర్తు
ఒక్కోసారి సాయంకాలాలు ఆ నవ్వే
చంద్రుని వెన్నెల కాంతి రేఖగా మారిపోతుంది
జోరువానలో మెరుపులా ఉంటుందది ఒక్కోసారి
రాత్రి వేళలో పూసే బీరపువ్వు అందం దానిది
నీ చిరునవ్వే
ఉషోదయాల్లో ఆకులపై
మంచు బిందువులై నిలుస్తుంది మరోసారి
వానొచ్చినపుడు కనిపించే ఇంద్రధనుస్సు ఇంకోసారి
నువ్వు నవ్వే నవ్వు పువ్వుల్లో దాగున్న జుంటితేనె
అదృశ్యమైన వనదేవతల నవ్వల్లే
నన్ను బలంగా తాకుతుంది.
ఏదీ మరోమారు నవ్వు.. నాకోసం.....................
ఏదీ మరోమారు నవ్వు.. నాకోసం ఏదీ తోచని సమయాల్లో నీ నవ్వునేసెలయేరు సవ్వడిలా జ్ఞాపకం తెచ్చుకుంటానుకాంతి కిరణంలా తళుక్కున నీ ముఖంలోమెరిసి మాయమయ్యే నవ్వును వెతుకుతుంటాను తొలివలపుల కాలంలో ఇద్దరి మధ్యనా నలిగిన నవ్వులకు గుర్తు ఒక్కోసారి సాయంకాలాలు ఆ నవ్వే చంద్రుని వెన్నెల కాంతి రేఖగా మారిపోతుంది జోరువానలో మెరుపులా ఉంటుందది ఒక్కోసారి రాత్రి వేళలో పూసే బీరపువ్వు అందం దానిది నీ చిరునవ్వే ఉషోదయాల్లో ఆకులపై మంచు బిందువులై నిలుస్తుంది మరోసారి వానొచ్చినపుడు కనిపించే ఇంద్రధనుస్సు ఇంకోసారి నువ్వు నవ్వే నవ్వు పువ్వుల్లో దాగున్న జుంటితేనె అదృశ్యమైన వనదేవతల నవ్వల్లే నన్ను బలంగా తాకుతుంది. ఏదీ మరోమారు నవ్వు.. నాకోసం.....................© 2017,www.logili.com All Rights Reserved.