Bhadratha Leni Bathukulu

By Dr Gurram Sitaramulu (Author)
Rs.100
Rs.100

Bhadratha Leni Bathukulu
INR
MANIMN0281
Out Of Stock
100.0
Rs.100
Out of Stock
Out Of Stock
Check for shipping and cod pincode

Description

              ఇందులో నమోదు అయిన ప్రతి జీవితం ఈ వ్యవస్థ గతికీ, గమనానికీ చోదక శక్తి. ఇందులో సౌడును సబ్బు చేసిన చాకలి, దేశానికి రక్షణ అయిన కోయ, చెంచు, గోండు, ఆధునిక నాగరికతకు నాట్యాన్ని, సంగీతాన్ని అందించిన వాళ్ళను, తోలును శుద్దిచేసి కాలికి చెప్పు, మాధ్యమానికి డప్పూ ఇచ్చిన వాళ్ళనూ, పంటకు నీటిని అందించిన నీరటి కాడూ, మలాన్ని చేతితో ఎత్తిన రెల్లి వ్యధలూ, చిందు, యక్షగానం, ఎరుకలి సోది నీ, ఢమరుక శబ్దం తో మేల్కొలిపే బుడబుక్కల బ్రతుకు వ్యధలూ వీరోచిత మంగోలియన్ తెగలకు రక్షకులుగా వచ్చిన దండాశీలూ, ఉత్తరాంధ్ర వారాంతపు సంతలో విధి తరిమితే యాచించిన నేత్తిగోతలూ, యాచక యాటలు వెతలూ, ఉత్తరభారతంలో భంగీలుగా, మెహతర్ లుగా పిలవబడే హడ్డీలూ, ఒక నాటి క్షత్రియ వీరోచిత గాధలను పలవరించే మాల మాస్తి, నాగరికతకు చెప్పును తొడిగిన గోడారీలూ, మనువాదపు దాస్టికాన్ని మోస్తున్న జంగాలూ, మందులోడో వోరి మాయ లోడో అని చేయని నేరాన్ని మోస్తున్న మందులోల్లు, ఒరియా భౌరీలూ, ఇందులో నమోదు అయిన ప్రతి సంచార బ్రతుకులు వ్యవస్థ విషాద చారికలు. ఇందులో చానా కులాలు అంతరించి పోతున్నాయి. ఎన్నో కులాలు నాటి వలసపాలన మొదలు నేటి ఆధునిక నాగరికుడి వ్యవస్థి కృత దాష్టీకానికి హంతకులుగా, దొంగలుగా, దొమ్మీ వాళ్ళుగా, దొమ్మరులుగా, యాచకులుగా, వేశ్యలుగా వెలివేయబడి బ్రతుకు భారంగా ఎలమారుతున్నారు.

          వాస్తవానికి 'భద్రతలేని బతుకులు' పేరుతో వస్తున్న ఈ సంచార జీవితాలు అత్యంత సంక్లిష్టమైనవి. ఆధిపత్య చర్చల్లో కనబడకుండా, వినబడకుండా పోయిన ఆనవాళ్ళు ఈ భద్రతలేని బతుకులు లో ఉన్నవి. ఈ సంచార జీవితాలు వాస్తవానికి ప్రత్యామ్నాయ బ్రతుకు చరిత్రను సజీవంగా ఉంచుతున్నారు.

                                                                                                 - డా. గుఱ్ఱం సీతారాములు      

              ఇందులో నమోదు అయిన ప్రతి జీవితం ఈ వ్యవస్థ గతికీ, గమనానికీ చోదక శక్తి. ఇందులో సౌడును సబ్బు చేసిన చాకలి, దేశానికి రక్షణ అయిన కోయ, చెంచు, గోండు, ఆధునిక నాగరికతకు నాట్యాన్ని, సంగీతాన్ని అందించిన వాళ్ళను, తోలును శుద్దిచేసి కాలికి చెప్పు, మాధ్యమానికి డప్పూ ఇచ్చిన వాళ్ళనూ, పంటకు నీటిని అందించిన నీరటి కాడూ, మలాన్ని చేతితో ఎత్తిన రెల్లి వ్యధలూ, చిందు, యక్షగానం, ఎరుకలి సోది నీ, ఢమరుక శబ్దం తో మేల్కొలిపే బుడబుక్కల బ్రతుకు వ్యధలూ వీరోచిత మంగోలియన్ తెగలకు రక్షకులుగా వచ్చిన దండాశీలూ, ఉత్తరాంధ్ర వారాంతపు సంతలో విధి తరిమితే యాచించిన నేత్తిగోతలూ, యాచక యాటలు వెతలూ, ఉత్తరభారతంలో భంగీలుగా, మెహతర్ లుగా పిలవబడే హడ్డీలూ, ఒక నాటి క్షత్రియ వీరోచిత గాధలను పలవరించే మాల మాస్తి, నాగరికతకు చెప్పును తొడిగిన గోడారీలూ, మనువాదపు దాస్టికాన్ని మోస్తున్న జంగాలూ, మందులోడో వోరి మాయ లోడో అని చేయని నేరాన్ని మోస్తున్న మందులోల్లు, ఒరియా భౌరీలూ, ఇందులో నమోదు అయిన ప్రతి సంచార బ్రతుకులు వ్యవస్థ విషాద చారికలు. ఇందులో చానా కులాలు అంతరించి పోతున్నాయి. ఎన్నో కులాలు నాటి వలసపాలన మొదలు నేటి ఆధునిక నాగరికుడి వ్యవస్థి కృత దాష్టీకానికి హంతకులుగా, దొంగలుగా, దొమ్మీ వాళ్ళుగా, దొమ్మరులుగా, యాచకులుగా, వేశ్యలుగా వెలివేయబడి బ్రతుకు భారంగా ఎలమారుతున్నారు.           వాస్తవానికి 'భద్రతలేని బతుకులు' పేరుతో వస్తున్న ఈ సంచార జీవితాలు అత్యంత సంక్లిష్టమైనవి. ఆధిపత్య చర్చల్లో కనబడకుండా, వినబడకుండా పోయిన ఆనవాళ్ళు ఈ భద్రతలేని బతుకులు లో ఉన్నవి. ఈ సంచార జీవితాలు వాస్తవానికి ప్రత్యామ్నాయ బ్రతుకు చరిత్రను సజీవంగా ఉంచుతున్నారు.                                                                                                  - డా. గుఱ్ఱం సీతారాములు      

Features

  • : Bhadratha Leni Bathukulu
  • : Dr Gurram Sitaramulu
  • : Kula Nirmulana Prachuranalu
  • : MANIMN0281
  • : Paperback
  • : 2018
  • : 243
  • : Telugu

Reviews

Be the first one to review this product

Discussion:Bhadratha Leni Bathukulu

Be the first to start a discussion Start a new discussion

Browse all Discussions on Books
Powered by infibeam