O Hrudayam Leni Priyurala

By Dr K Kiran Kumar (Author)
Rs.80
Rs.80

O Hrudayam Leni Priyurala
INR
VAIBHAV025
Out Of Stock
80.0
Rs.80
Out of Stock
Out Of Stock
Check for shipping and cod pincode

Description

ఓ రోమియో జూలియట్, ఓ లైలా మజ్నూ, ఓ పార్వతీ దేవదాస్ ప్రేమకథలకు ఏ మాత్రం తీసిపోని అద్భుత ప్రేమ కథాకావ్యం.

       అవి రెండవ ప్రపంచ యుద్ధం జరుగుతున్న రోజులు. ప్రపంచాన్ని గుప్పెట్లో ఉంచుకోవాలనుకున్న  జర్మనీ తన శత్రుదేశాలైన  అమెరికా, రష్యా, బ్రిటన్లతో హోరాహోరీగా పోరాడసాగింది. హిట్లర్ నాయకత్వంలో నాజీ సైన్యం ఒక్కొక్క దేశాన్ని కబళించి పోతూ విజయవంతంగా ముందుకు సాగింది. ఆ నాజీ సైన్యాన్ని తరిమికొట్టడానికి శత్రుదేశాలు తమ వ్యూహాన్ని సరిదిద్దు కొంటున్నాయి.

       సరిగ్గా అప్పుడు - స్వీడిష్ నోబుల్ కమిటీ 1839వ సంవత్సరానికి నోబుల్ అవార్డులను ప్రకటించింది. అందులో రసాయన శాస్త్రానికి గాను నోబుల్ ప్రైజ్ ని జర్మనీకి చెందిన జీవరసాయన శాస్త్రవేత్త అడాల్ఫ్ బుటేనాన్డ్ కి ప్రకటించారు. ఫెరమోన్స్ ని కనిపెట్టి ఆ రంగంలో విశేషమైన కృషి నిలిపినందుకు గాను ఆయనని ఆ అవార్డు వరించింది.

       ఆడ, మగజీవుల మధ్య పరస్పరం సెక్స్ ఆకర్షణని కలిగించే వాసనా సంకేతాన్ని 'ఫెరమోన్స్' అంటారు. ఆ 'ఫెరమోన్స్' ద్వారా ఓ జంతువు పశుపక్ష్యాదులు ఇంకో జంతువుని, ఇతర పక్ష్యాదుల్ని సెక్సువల్ గా ఆకర్షింపజేసి తద్వారా మానవాళికి ఉపయోగపడే జంతు సంఖ్యను పెంచి పాలు, కొన్ని రకాల మందులలో వాడె ముడిపదార్థాలను ఎక్కువగా పొందటానికి వీలవుతుంది. ఆప్రయోగం గురించి విన్న దేశ దేశాల శాస్త్రజ్ఞులు అబ్బురపడ్డారు. ఆ జర్మనీ శాస్త్రజ్ఞుడి ఆవిరళకృషికి జోహార్లు అర్పించారు.

       కాని...పరాయిదేశాల వారు తమ దేశంలోని సైంటిస్ట్ కి నోబుల్ బహుమతిని ఇవ్వడం జర్మనీ సుప్రీమ్ కమాండర్ - దీ గ్రేట్ హిట్లర్ కి నచ్చలేదు. ఆ బహుమతిని తీసుకోవడానికి వీల్లేదని ఆ సైంటిస్ట్ కి ఆజ్ఞలు జారీ చేసారు. ఫలితంగా ఆ సైంటిస్ట్ నోబుల్ ప్రైజ్ ని స్వీకరించడానికి వెళ్ళలేదు. ఈ సంఘటన నిజంగా చరిత్రలో జరిగింది.

       ఇది జరిగిన కొద్దిరోజులకు, అతను హిట్లర్ ముందుకు పిలవబడ్డాడు. ఆ ఫెరమోన్స్ తాలుకూ ఫార్ములాని మనుషులకు పనిచేసేటట్లుగా తాయారు చేసి ఇవ్వమన్నాడు. ఆ మందుని శత్రుదేశాలన్నింటి పైన ప్రయోగిస్తే, దానితో అక్కడి ప్రజలు, సైనికులు, సెక్సువల్ గా ఆకర్షింపబడి కర్తవ్యo మర్చిపోతారు. అప్పుడు ఆ దేశాలపై దాడి చేసి వాటిని నా ఆధీనంలోకి తెచ్చుకుంటాను' అన్నాడు. ఆ సైంటిస్ట్ ఆ మందుని ఆరు పెద్ద సీసాలలో సీల్ చేసి హిట్లర్ ముందుంచాడు. మరుక్షణం ఆ సైంటిస్ట్ కి సైనైడ్ మాత్ర ఇవ్వబడింది.ఆ సైంటిస్ట్ చనిపోయిన నలుగు గంటలలోపు హిట్లర్ ఆదేశాల మేరకు అతని నలుగురు ప్రధాన సైనికాధికారులు 'జెట్ ప్లేన్' లో ఈ బాటిల్స్ ని తీసుకెళ్ళి  శత్రుదేశాలపైన వెదజల్లడానికి బయలుదేరారు. 

       సరిగ్గా అప్పుడు... ఇంజన్ లో ఏం లోపముందోగాని ఆ ప్లేన్ అటూ ఇటూ ఊగసాగింది.పైలైట్ ఎంత కంట్రోల్ చేసినా లాభం లేకపోయింది. ఆ ప్లేన్ ఒక్క ఉదుటున కిందికి దూసుకెళ్ళి అరేబియన్ సముద్రంలో 'క్రాష్' అయింది. ఆ ప్లేన్ లో ఉన్న సైనికాధికారులు, ఫార్ములా తాలూకు మందు ఆ ప్లేన్ తో కలిసి అగ్నికి ఆహుతి అయిపోతూ అరేబియన్ సముద్రంలో కలిసిపోయాయి. అలా ఆ భయంకర విధ్వంసం తాలూకు కుట్ర ఘోరంగా విఫలమైంది. 

   అలంటి 'ఫెరమోన్స్' ని మనుషులపైన ప్రయోగించే సంఘటన మళ్ళీ భవిష్యత్తులో సంభవిస్తే?    అప్పుడు పరిస్టితి ఎలా ఉంటుందో తెలుసుకోవాలంటే ఈ ప్రేమకదను చదవాల్సిందే....

                                                                                                                                      - డా.కె.కిరణ్ కుమార్

 

ఓ రోమియో జూలియట్, ఓ లైలా మజ్నూ, ఓ పార్వతీ దేవదాస్ ప్రేమకథలకు ఏ మాత్రం తీసిపోని అద్భుత ప్రేమ కథాకావ్యం.        అవి రెండవ ప్రపంచ యుద్ధం జరుగుతున్న రోజులు. ప్రపంచాన్ని గుప్పెట్లో ఉంచుకోవాలనుకున్న  జర్మనీ తన శత్రుదేశాలైన  అమెరికా, రష్యా, బ్రిటన్లతో హోరాహోరీగా పోరాడసాగింది. హిట్లర్ నాయకత్వంలో నాజీ సైన్యం ఒక్కొక్క దేశాన్ని కబళించి పోతూ విజయవంతంగా ముందుకు సాగింది. ఆ నాజీ సైన్యాన్ని తరిమికొట్టడానికి శత్రుదేశాలు తమ వ్యూహాన్ని సరిదిద్దు కొంటున్నాయి.        సరిగ్గా అప్పుడు - స్వీడిష్ నోబుల్ కమిటీ 1839వ సంవత్సరానికి నోబుల్ అవార్డులను ప్రకటించింది. అందులో రసాయన శాస్త్రానికి గాను నోబుల్ ప్రైజ్ ని జర్మనీకి చెందిన జీవరసాయన శాస్త్రవేత్త అడాల్ఫ్ బుటేనాన్డ్ కి ప్రకటించారు. ఫెరమోన్స్ ని కనిపెట్టి ఆ రంగంలో విశేషమైన కృషి నిలిపినందుకు గాను ఆయనని ఆ అవార్డు వరించింది.        ఆడ, మగజీవుల మధ్య పరస్పరం సెక్స్ ఆకర్షణని కలిగించే వాసనా సంకేతాన్ని 'ఫెరమోన్స్' అంటారు. ఆ 'ఫెరమోన్స్' ద్వారా ఓ జంతువు పశుపక్ష్యాదులు ఇంకో జంతువుని, ఇతర పక్ష్యాదుల్ని సెక్సువల్ గా ఆకర్షింపజేసి తద్వారా మానవాళికి ఉపయోగపడే జంతు సంఖ్యను పెంచి పాలు, కొన్ని రకాల మందులలో వాడె ముడిపదార్థాలను ఎక్కువగా పొందటానికి వీలవుతుంది. ఆప్రయోగం గురించి విన్న దేశ దేశాల శాస్త్రజ్ఞులు అబ్బురపడ్డారు. ఆ జర్మనీ శాస్త్రజ్ఞుడి ఆవిరళకృషికి జోహార్లు అర్పించారు.        కాని...పరాయిదేశాల వారు తమ దేశంలోని సైంటిస్ట్ కి నోబుల్ బహుమతిని ఇవ్వడం జర్మనీ సుప్రీమ్ కమాండర్ - దీ గ్రేట్ హిట్లర్ కి నచ్చలేదు. ఆ బహుమతిని తీసుకోవడానికి వీల్లేదని ఆ సైంటిస్ట్ కి ఆజ్ఞలు జారీ చేసారు. ఫలితంగా ఆ సైంటిస్ట్ నోబుల్ ప్రైజ్ ని స్వీకరించడానికి వెళ్ళలేదు. ఈ సంఘటన నిజంగా చరిత్రలో జరిగింది.        ఇది జరిగిన కొద్దిరోజులకు, అతను హిట్లర్ ముందుకు పిలవబడ్డాడు. ఆ ఫెరమోన్స్ తాలుకూ ఫార్ములాని మనుషులకు పనిచేసేటట్లుగా తాయారు చేసి ఇవ్వమన్నాడు. ఆ మందుని శత్రుదేశాలన్నింటి పైన ప్రయోగిస్తే, దానితో అక్కడి ప్రజలు, సైనికులు, సెక్సువల్ గా ఆకర్షింపబడి కర్తవ్యo మర్చిపోతారు. అప్పుడు ఆ దేశాలపై దాడి చేసి వాటిని నా ఆధీనంలోకి తెచ్చుకుంటాను' అన్నాడు. ఆ సైంటిస్ట్ ఆ మందుని ఆరు పెద్ద సీసాలలో సీల్ చేసి హిట్లర్ ముందుంచాడు. మరుక్షణం ఆ సైంటిస్ట్ కి సైనైడ్ మాత్ర ఇవ్వబడింది.ఆ సైంటిస్ట్ చనిపోయిన నలుగు గంటలలోపు హిట్లర్ ఆదేశాల మేరకు అతని నలుగురు ప్రధాన సైనికాధికారులు 'జెట్ ప్లేన్' లో ఈ బాటిల్స్ ని తీసుకెళ్ళి  శత్రుదేశాలపైన వెదజల్లడానికి బయలుదేరారు.         సరిగ్గా అప్పుడు... ఇంజన్ లో ఏం లోపముందోగాని ఆ ప్లేన్ అటూ ఇటూ ఊగసాగింది.పైలైట్ ఎంత కంట్రోల్ చేసినా లాభం లేకపోయింది. ఆ ప్లేన్ ఒక్క ఉదుటున కిందికి దూసుకెళ్ళి అరేబియన్ సముద్రంలో 'క్రాష్' అయింది. ఆ ప్లేన్ లో ఉన్న సైనికాధికారులు, ఫార్ములా తాలూకు మందు ఆ ప్లేన్ తో కలిసి అగ్నికి ఆహుతి అయిపోతూ అరేబియన్ సముద్రంలో కలిసిపోయాయి. అలా ఆ భయంకర విధ్వంసం తాలూకు కుట్ర ఘోరంగా విఫలమైంది.     అలంటి 'ఫెరమోన్స్' ని మనుషులపైన ప్రయోగించే సంఘటన మళ్ళీ భవిష్యత్తులో సంభవిస్తే?    అప్పుడు పరిస్టితి ఎలా ఉంటుందో తెలుసుకోవాలంటే ఈ ప్రేమకదను చదవాల్సిందే....                                                                                                                                       - డా.కె.కిరణ్ కుమార్  

Features

  • : O Hrudayam Leni Priyurala
  • : Dr K Kiran Kumar
  • : Vaibhava Publishers
  • : VAIBHAV025
  • : Paperback
  • : 2014
  • : 195
  • : Telugu

Reviews

Be the first one to review this product

Discussion:O Hrudayam Leni Priyurala

Be the first to start a discussion Start a new discussion

Browse all Discussions on Books
Powered by infibeam