Sundara Kandamu 1, 2&3

Rs.1,500
Rs.1,500

Sundara Kandamu 1, 2&3
INR
MANIMN3570
In Stock
1500.0
Rs.1,500


In Stock
Ships in 4 - 10 Days
Check for shipping and cod pincode

Description

పరిచయము

శ్రీ మధునాపంతుల సత్యనారాయణ శాస్త్రి గారు

రాజమహేంద్రవరము శ్రీమద్రామాయణము భారతీయ సాహిత్యమున శిఖరాయమానమైన మహాగ్రంథము. వాల్మీకి ప్రణీతమైన యాదికావ్యము. వేదమంత్రములవలనం దెలిసికొనఁదగిన పరమాత్ముఁడు దశరథాత్మజుడుగా నవతరించెను. ఏడు కాండములుగా నున్న రామాయణములో ఇరువదినాలుగువేల శ్లోకములు గలవు. గాయత్రీమంత్రాక్షరములు ఇరువదినాల్గు. వాల్మీకి

రామాయణములోని ప్రతి వేయవ శ్లోకము ఆ మంత్రాక్షరముతో నారంభమగును. దానివలన రామాయణము పారాయణము చేయుటవలనఁ గర్తకు సకలకార్యసిద్ధులగుచున్నవి. మనోహరమైన కవిత్వానందముతోపాటు మహిమసిద్ధిప్రదమైన

రామాయణమునకు సుందరకాండము శిరసానీయము. సప్తకాండమండితమైన శ్రీమద్రామాయణములో సుందరకాండమును ప్రత్యేకముగాఁ బారాయణము చేయుచుందురు. తత్పారాయణము అభిష్టసిద్ధి నొసగుచుండుటయు సర్వభక్తానుభవము.

'ఒక శ్లోకము, ఒక పాదము, ఒక పదము కూడ పుణ్యప్రదమని చెప్పఁబడినది. శ్రద్ధాభక్తులతో, అర్థజ్ఞానము కలిగి పారాయణ మొనర్చుటవలన గలిగెడి ప్రయోజన మనంతమైనది. సంస్కృతభాషాపరిచయము కలవారు ఆంధ్రులలో ఎందఱుందురు? అర్ధజిజ్ఞాసువులయిన ధార్మికులకు, ఆస్తికులకు, పారాయణాసక్తులకు సుబోధముగా నుండునట్లు “సుందరకాండము" ప్రచురిత మగుట తెలుగువారికి అపేక్షితము. ఇతఃపూర్వము వావిళ్ళవారు సార్థతాత్పర్యముగా ప్రచురించియున్నను, ఆ గ్రంథము లిపుడు లభ్యము గాకుండుటచేఁ బలువురు ఆంధ్రవివరణసహితమగు సుందరకాండమునకు బహుకాలముగాఁ బ్రతిక్షించుచున్నారు.

ఇపుడీ “సుబోధినీ” సహితమగు సుందరకాండము తెలుఁగువారి కోరికకు ఫలముగా వెలువడుచుండుట ఆనందదాయకము. ఈ పుణ్యకృతికి సంకల్పించినవారు శ్రీ బోయనపల్లి కామేశ్వరరావుగారు. వీరు రామనామప్రచారకాగ్రేసరులగు "శ్రీరామశరణు"గారి శిష్యులలో అగ్రగణ్యులు. త్యాగభోగములకుఁ దగిన సంపత్తితోపాటు ధార్మిక ప్రవృత్తి కలిగిన యుదారులు; నిరంతర శ్రీరామధ్యాన పూజాతత్పరులు. ఆంగ్లమున పట్టభద్రులయ్యును, భారతీయ సంప్రదాయములయెడ అవిచలితమైన శ్రద్ధాసక్తులు కలిగినవారు. వీరు తెనుఁగు పద్యరచన చేయ సహృదయులు. “అమృతోదయ” మన్న ఆంధ్రకావ్యమును కృతిపొందియన్నారు.......

పరిచయము శ్రీ మధునాపంతుల సత్యనారాయణ శాస్త్రి గారు రాజమహేంద్రవరము శ్రీమద్రామాయణము భారతీయ సాహిత్యమున శిఖరాయమానమైన మహాగ్రంథము. వాల్మీకి ప్రణీతమైన యాదికావ్యము. వేదమంత్రములవలనం దెలిసికొనఁదగిన పరమాత్ముఁడు దశరథాత్మజుడుగా నవతరించెను. ఏడు కాండములుగా నున్న రామాయణములో ఇరువదినాలుగువేల శ్లోకములు గలవు. గాయత్రీమంత్రాక్షరములు ఇరువదినాల్గు. వాల్మీకి రామాయణములోని ప్రతి వేయవ శ్లోకము ఆ మంత్రాక్షరముతో నారంభమగును. దానివలన రామాయణము పారాయణము చేయుటవలనఁ గర్తకు సకలకార్యసిద్ధులగుచున్నవి. మనోహరమైన కవిత్వానందముతోపాటు మహిమసిద్ధిప్రదమైన రామాయణమునకు సుందరకాండము శిరసానీయము. సప్తకాండమండితమైన శ్రీమద్రామాయణములో సుందరకాండమును ప్రత్యేకముగాఁ బారాయణము చేయుచుందురు. తత్పారాయణము అభిష్టసిద్ధి నొసగుచుండుటయు సర్వభక్తానుభవము. 'ఒక శ్లోకము, ఒక పాదము, ఒక పదము కూడ పుణ్యప్రదమని చెప్పఁబడినది. శ్రద్ధాభక్తులతో, అర్థజ్ఞానము కలిగి పారాయణ మొనర్చుటవలన గలిగెడి ప్రయోజన మనంతమైనది. సంస్కృతభాషాపరిచయము కలవారు ఆంధ్రులలో ఎందఱుందురు? అర్ధజిజ్ఞాసువులయిన ధార్మికులకు, ఆస్తికులకు, పారాయణాసక్తులకు సుబోధముగా నుండునట్లు “సుందరకాండము" ప్రచురిత మగుట తెలుగువారికి అపేక్షితము. ఇతఃపూర్వము వావిళ్ళవారు సార్థతాత్పర్యముగా ప్రచురించియున్నను, ఆ గ్రంథము లిపుడు లభ్యము గాకుండుటచేఁ బలువురు ఆంధ్రవివరణసహితమగు సుందరకాండమునకు బహుకాలముగాఁ బ్రతిక్షించుచున్నారు. ఇపుడీ “సుబోధినీ” సహితమగు సుందరకాండము తెలుఁగువారి కోరికకు ఫలముగా వెలువడుచుండుట ఆనందదాయకము. ఈ పుణ్యకృతికి సంకల్పించినవారు శ్రీ బోయనపల్లి కామేశ్వరరావుగారు. వీరు రామనామప్రచారకాగ్రేసరులగు "శ్రీరామశరణు"గారి శిష్యులలో అగ్రగణ్యులు. త్యాగభోగములకుఁ దగిన సంపత్తితోపాటు ధార్మిక ప్రవృత్తి కలిగిన యుదారులు; నిరంతర శ్రీరామధ్యాన పూజాతత్పరులు. ఆంగ్లమున పట్టభద్రులయ్యును, భారతీయ సంప్రదాయములయెడ అవిచలితమైన శ్రద్ధాసక్తులు కలిగినవారు. వీరు తెనుఁగు పద్యరచన చేయ సహృదయులు. “అమృతోదయ” మన్న ఆంధ్రకావ్యమును కృతిపొందియన్నారు.......

Features

  • : Sundara Kandamu 1, 2&3
  • : Sri Mailavarapu Subramanyam
  • : Mohan Publications
  • : MANIMN3570
  • : Paperback
  • : 2022
  • : 480, 620, 575
  • : Telugu

Reviews

Be the first one to review this product

Discussion:Sundara Kandamu 1, 2&3

Be the first to start a discussion Start a new discussion

Browse all Discussions on Books
Powered by infibeam