Nirvachanottara Ramayanamu

Rs.322
Rs.322

Nirvachanottara Ramayanamu
INR
MANIMN3702
In Stock
322.0
Rs.322


In Stock
Ships in 4 - 9 Days
Check for shipping and cod pincode

Description

పీఠిక

ఇది నిర్వచనోత్తర రామాయణము. ఈ పద్య కావ్యమును రచించినది తిక్కన. ఇది 1280 పద్యములతో ఉన్న కావ్యము. ఇందు వచనములు లేవు. ఇది - నిర్, వచన, ఉత్తర రామాయణము - కనుక ఇది 'నిర్వచనోత్తర రామాయణము'గా ప్రసిద్ధి పొందెను. సాధారణముగ తెనుగు కావ్యములు, పద్యగద్యములతో ఉండును. ఇట్లు వ్రాయుటను, సంస్కృతమున చంపూపద్దతి అందురు. అట్లు కాక,గద్యములు అనగా వచనములు లేకుండగా వ్రాయబడినది అగుటవలన, ఈ కావ్యము - నిర్వచన -- అని ప్రత్యేకముగ చెప్పబడుచున్నది. దీనిని, 'ఉత్తర రామాయణము' అనియే తిక్కన చెప్పెను. అనంతర కాలమున, 'నిర్వచన' అని విశేషణమును చేర్చి చెప్పుట వ్యాప్తి పొందెను. పూర్వ ప్రసిద్ధ కావ్యములలో, మఱియొక ఉత్తర రామాయణము కలదు. అది కంకంటి పాపరాజు రచించిన కావ్యము. ఈ రెండు కావ్యముల భేదము తెలియుటకు, మఱియు వచనములు లేని కావ్యమను ప్రత్యేకత చెప్పుటకు, తిక్కనగారి రచన, 'నిర్వచనోత్తర రామాయణము' అని వ్యవహరింపబడుచున్నది.

తిక్కన జీవితము

తిక్కన ఇంటి పేరు కొట్టరువు. వీరిది గౌతమ గోత్రము. తిక్కన తల్లిదండ్రులు - అన్నమ, కొమ్మన, కొమ్మన తండ్రి అనగా తిక్కనకు తాత - మంత్రి భాస్కరుడు. ఇతడు గుంటూరు విభుడు. తిక్కన తండ్రి, తన కుటుంబముతో నెల్లూరుకు తరలి వచ్చెను. నెల్లూరు రాజ్యాధిపతియైన మనుమసిద్ధి వద్ద తిక్కన మంత్రిత్వము | చేసెను. వీరిరువురకు మిక్కిలి స్నేహము. మనుమసిద్ధి, తిక్కనను 'మామా' అని పిలుచునంతటి మిత్రత్వము. క్రీ.శ. 1249 ప్రాంతమున మనుమసిద్ధి రాజయ్యెను.

పీఠిక ఇది నిర్వచనోత్తర రామాయణము. ఈ పద్య కావ్యమును రచించినది తిక్కన. ఇది 1280 పద్యములతో ఉన్న కావ్యము. ఇందు వచనములు లేవు. ఇది - నిర్, వచన, ఉత్తర రామాయణము - కనుక ఇది 'నిర్వచనోత్తర రామాయణము'గా ప్రసిద్ధి పొందెను. సాధారణముగ తెనుగు కావ్యములు, పద్యగద్యములతో ఉండును. ఇట్లు వ్రాయుటను, సంస్కృతమున చంపూపద్దతి అందురు. అట్లు కాక,గద్యములు అనగా వచనములు లేకుండగా వ్రాయబడినది అగుటవలన, ఈ కావ్యము - నిర్వచన -- అని ప్రత్యేకముగ చెప్పబడుచున్నది. దీనిని, 'ఉత్తర రామాయణము' అనియే తిక్కన చెప్పెను. అనంతర కాలమున, 'నిర్వచన' అని విశేషణమును చేర్చి చెప్పుట వ్యాప్తి పొందెను. పూర్వ ప్రసిద్ధ కావ్యములలో, మఱియొక ఉత్తర రామాయణము కలదు. అది కంకంటి పాపరాజు రచించిన కావ్యము. ఈ రెండు కావ్యముల భేదము తెలియుటకు, మఱియు వచనములు లేని కావ్యమను ప్రత్యేకత చెప్పుటకు, తిక్కనగారి రచన, 'నిర్వచనోత్తర రామాయణము' అని వ్యవహరింపబడుచున్నది. తిక్కన జీవితము తిక్కన ఇంటి పేరు కొట్టరువు. వీరిది గౌతమ గోత్రము. తిక్కన తల్లిదండ్రులు - అన్నమ, కొమ్మన, కొమ్మన తండ్రి అనగా తిక్కనకు తాత - మంత్రి భాస్కరుడు. ఇతడు గుంటూరు విభుడు. తిక్కన తండ్రి, తన కుటుంబముతో నెల్లూరుకు తరలి వచ్చెను. నెల్లూరు రాజ్యాధిపతియైన మనుమసిద్ధి వద్ద తిక్కన మంత్రిత్వము | చేసెను. వీరిరువురకు మిక్కిలి స్నేహము. మనుమసిద్ధి, తిక్కనను 'మామా' అని పిలుచునంతటి మిత్రత్వము. క్రీ.శ. 1249 ప్రాంతమున మనుమసిద్ధి రాజయ్యెను.

Features

  • : Nirvachanottara Ramayanamu
  • : Sri Tikkanamatya Pranitamu
  • : Reem Publications Pvt Ltd
  • : MANIMN3702
  • : Paperback
  • : 2016
  • : 249
  • : Telugu

Reviews

Be the first one to review this product

Discussion:Nirvachanottara Ramayanamu

Be the first to start a discussion Start a new discussion

Browse all Discussions on Books
Powered by infibeam