Vaagu Vacchindi Vaagu

Rs.240
Rs.240

Vaagu Vacchindi Vaagu
INR
MANIMN2910
In Stock
240.0
Rs.240


In Stock
Ships in 4 - 9 Days
Check for shipping and cod pincode

Description

                            1857 సిపాయిల తిరుగుబాటు, ఉప్పు సత్యాగ్రహం, మహత్ముడి హత్య-దేశ చరిత్రలోని ప్రధాన ఘట్టాల మద్య ఉతర కరాటకలోని మధ్య బ్రాహ్మణ కుటుంబంలో నాలుగు తరాల జీవితం ఎలాంటి మార్పులకు గురెందో చెప్పే "పీరియడ్” నవల “వాగు వచ్చింది. వాగు". విప్లవవాది బాబాసాహెబ్ పిలుపు మేరకు కాశీ నుంచి వచ్చి చిక్కుకుపోయిన కమలనాభుడు కాలక్రమేణా కమలనాభపంగా మారిన వైనం-అటు తరువాత ఆ కుటుంబంలోని నాలుగు తరాల జీవితం దేశస్వాతంత్ర్య పోరాటాల నేపథ్యంలో ఎన్ని మలుపులు తిరిగిందో ఈ నవల చర్చిస్తుంది. ఇందులో సాంస్కృతిక చరిత్రను, దేశ చరిత్రను రెండింటిని సమన్వయం చేసిన తీరు అభినందనీయం. సంప్రదాయానికి, ఆధునికతకు మధ్య వైరుధ్యాన్ని, ఒక కుటుంబంలోని అనేక పాత్రల ద్వారా, ఒక ఊరిలోని అనేక సంఘటనల ద్వారా సమర్థవంతంగా చిత్రిక పట్టారు శ్రీనివాస వైద్య. ఇందులోని పాత్రల వైవిధ్యం, కథనం, శిల్పం, జీవిత సంఘర్షణలు, శైలిలోని కొత్తదనం పాఠకులను వెంటాడుతాయి. ఈ నవల ఒక సాంస్కతిక జ్ఞాపకంగా నిలిచిపోతుంది.

                            శ్రీనివాస వైద్య కథకులుగా, నవలాకారులుగా ప్రసిద్ధి చెందినవారు. ధారవాడ జిల్లాకు చెందిన నవలగుందలో జన్మించారు. ఉన్నత విద్యావంతులై, సుమారు నాలుగు దశాబ్దాలపాటు బ్యాంకులో ఉద్యోగం చేశారు. పదవీ విరమణ తరువాత సాహిత్యాన్ని గంభీరంగా తీసుకుని 7 కథా సంపుటాలు ప్రచురించారు. వారి అనేక కథలను విజయవంతమైన నాటకాలుగా రూపొందించారు. వారు రాసిన 'హళ్ళ బంతు హళ్ళ'కు 2004లో కర్ణాటక సాహిత్య అకాడెమీ పురస్కారం, 2008లో కేంద్ర సాహిత్య అకాడెమి పురస్కారం లభించింది. వారి సాహిత్య కృషికి కర్ణాటక రాజ్యోత్సవ అవార్డుతోపాటు అనేక సాహిత్య సాంస్కృతిక సంస్థల నుంచి ఇతర పురస్కారాలు, అవార్డులు అందుకున్నారు.

                            రంగనాథ రామచంద్రరావు తెలుగు పాఠకులకు రచయితగా, అనువాదకులుగా సుపరిచితులు. వీరి సాహిత్య కృషికి చిహ్నాలుగా 11 అనువాద నవలలు, 15 అనువాద కథా సంకలనాలు, 4 ఆత్మకథలు, ఒక జీవిత చరిత్ర, 3 సొంత కథా సంపుటాలు, 2 సొంత నవలలు, సాహిత్య అకాడెమి కోసం చేసిన రి అనువాదాలు, బాలల కోసం రాసిన 10 పుస్తకాలు వెలువడ్డాయి. సాహిత్య అకాడెమీ కోసం అనువదించిన పి. లంకేశ్ గారి రాళ్ళు కరిగే వేళకు పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం పురస్కారం అందుకున్నారు. సమకాలీన కన్నడ దళిత కథలు' అనువాదకథల సంకలనానికి 'శశిశ్రీ స్మారక సాహిత్య పురస్కారం' లభించింది. 'కర్రోడు త్రిశూలం పట్టిన కథ' అనువాద సంపుటికి ప్రతిష్టాత్మకమైన 'కువెంపు భాషాభారతి' పురస్కారం లభించింది.

                            1857 సిపాయిల తిరుగుబాటు, ఉప్పు సత్యాగ్రహం, మహత్ముడి హత్య-దేశ చరిత్రలోని ప్రధాన ఘట్టాల మద్య ఉతర కరాటకలోని మధ్య బ్రాహ్మణ కుటుంబంలో నాలుగు తరాల జీవితం ఎలాంటి మార్పులకు గురెందో చెప్పే "పీరియడ్” నవల “వాగు వచ్చింది. వాగు". విప్లవవాది బాబాసాహెబ్ పిలుపు మేరకు కాశీ నుంచి వచ్చి చిక్కుకుపోయిన కమలనాభుడు కాలక్రమేణా కమలనాభపంగా మారిన వైనం-అటు తరువాత ఆ కుటుంబంలోని నాలుగు తరాల జీవితం దేశస్వాతంత్ర్య పోరాటాల నేపథ్యంలో ఎన్ని మలుపులు తిరిగిందో ఈ నవల చర్చిస్తుంది. ఇందులో సాంస్కృతిక చరిత్రను, దేశ చరిత్రను రెండింటిని సమన్వయం చేసిన తీరు అభినందనీయం. సంప్రదాయానికి, ఆధునికతకు మధ్య వైరుధ్యాన్ని, ఒక కుటుంబంలోని అనేక పాత్రల ద్వారా, ఒక ఊరిలోని అనేక సంఘటనల ద్వారా సమర్థవంతంగా చిత్రిక పట్టారు శ్రీనివాస వైద్య. ఇందులోని పాత్రల వైవిధ్యం, కథనం, శిల్పం, జీవిత సంఘర్షణలు, శైలిలోని కొత్తదనం పాఠకులను వెంటాడుతాయి. ఈ నవల ఒక సాంస్కతిక జ్ఞాపకంగా నిలిచిపోతుంది.                             శ్రీనివాస వైద్య కథకులుగా, నవలాకారులుగా ప్రసిద్ధి చెందినవారు. ధారవాడ జిల్లాకు చెందిన నవలగుందలో జన్మించారు. ఉన్నత విద్యావంతులై, సుమారు నాలుగు దశాబ్దాలపాటు బ్యాంకులో ఉద్యోగం చేశారు. పదవీ విరమణ తరువాత సాహిత్యాన్ని గంభీరంగా తీసుకుని 7 కథా సంపుటాలు ప్రచురించారు. వారి అనేక కథలను విజయవంతమైన నాటకాలుగా రూపొందించారు. వారు రాసిన 'హళ్ళ బంతు హళ్ళ'కు 2004లో కర్ణాటక సాహిత్య అకాడెమీ పురస్కారం, 2008లో కేంద్ర సాహిత్య అకాడెమి పురస్కారం లభించింది. వారి సాహిత్య కృషికి కర్ణాటక రాజ్యోత్సవ అవార్డుతోపాటు అనేక సాహిత్య సాంస్కృతిక సంస్థల నుంచి ఇతర పురస్కారాలు, అవార్డులు అందుకున్నారు.                             రంగనాథ రామచంద్రరావు తెలుగు పాఠకులకు రచయితగా, అనువాదకులుగా సుపరిచితులు. వీరి సాహిత్య కృషికి చిహ్నాలుగా 11 అనువాద నవలలు, 15 అనువాద కథా సంకలనాలు, 4 ఆత్మకథలు, ఒక జీవిత చరిత్ర, 3 సొంత కథా సంపుటాలు, 2 సొంత నవలలు, సాహిత్య అకాడెమి కోసం చేసిన రి అనువాదాలు, బాలల కోసం రాసిన 10 పుస్తకాలు వెలువడ్డాయి. సాహిత్య అకాడెమీ కోసం అనువదించిన పి. లంకేశ్ గారి రాళ్ళు కరిగే వేళకు పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం పురస్కారం అందుకున్నారు. సమకాలీన కన్నడ దళిత కథలు' అనువాదకథల సంకలనానికి 'శశిశ్రీ స్మారక సాహిత్య పురస్కారం' లభించింది. 'కర్రోడు త్రిశూలం పట్టిన కథ' అనువాద సంపుటికి ప్రతిష్టాత్మకమైన 'కువెంపు భాషాభారతి' పురస్కారం లభించింది.

Features

  • : Vaagu Vacchindi Vaagu
  • : Ranganatha Ramachandra Rao
  • : Sahithi Publications
  • : MANIMN2910
  • : Paperback
  • : 2021
  • : 280
  • : Telugu

Reviews

Be the first one to review this product

Discussion:Vaagu Vacchindi Vaagu

Be the first to start a discussion Start a new discussion

Browse all Discussions on Books
Powered by infibeam