Navala Naivedyam

By Simha Prasad (Author)
Rs.80
Rs.80

Navala Naivedyam
INR
MANIMN4881
In Stock
80.0
Rs.80


In Stock
Ships in 4 - 9 Days
Check for shipping and cod pincode

Description

స్త్రీ కేంద్రీత నవలల్లో ఘర్షణ

సాహిత్యంలో స్త్రీ జీవితంలోని అన్ని అంశాలను స్పృశించేలా రాయడం అంత తేలికైన విషయమేమి కాదు. అది నిజానికి సాహసమనే చెప్పాలి. సింహప్రసాద్ గారు స్త్రీ కేంద్రంగా రాసిన నవలల్లో అనేక రకాల మనస్తత్వాల సంఘర్షణను ఆ పాత్ర భావ ఘర్షణను, దానికి సమాజానికి మధ్య ఉన్న దూరాన్ని కూడా సమన్వయం చేస్తూ రాశారు. వాస్తవానికి ఏ జీవితం ఐడియల్ కాదు. ప్రతి జీవితంలోనూ ఎన్నో కష్టాలు, అసంతృప్తులు ఉంటాయి. వాటిని సహజం అనుకుని అలాగే ఉండిపోవడమా, ఆ పరిస్థితి మార్చే ప్రయత్నం చేయడమా అన్న ఆలోచన దగ్గరే పాత్ర ఆత్మ జన్మిస్తుంది.

సింహప్రసాద్ గారి రచనల్లో ఆధునిక స్త్రీ-పురుష సంబంధాలను చర్చించే నవలలు, వివాహంలో తమను తాము కోల్పోయినా స్త్రీల ఆత్మలు సజీవంగా ఉన్నాయి. 1999లో ఆయన రాసిన 'వెలుగుల తీరం', 2013 లో రాసిన 'ఒక ఆడ + ఒక మగ' రెండు కూడా సహజీవనం గురించి చర్చించేవే. కానీ 'వెలుగుల తీరం' సహజీవనాన్ని సమర్ధిస్తే, 'ఒక ఆడ + ఒక మగ' మాత్రం వివాహ వ్యవస్థను ఆచరణీయం అన్న భావనను స్పష్టం చేస్తుంది.

పాత్ర ఆత్మను, వ్యక్తిత్వాన్ని బట్టి అభిప్రాయ స్థిరత్వం ఉంటుంది. 'వెలుగుల తీరం'లో మేఘన వ్యక్తిత్వాన్ని ప్రభావితం చేసింది ఆమె బాల్యం, తల్లిదండ్రులు. అప్పటి నుండి ఆమెలో ఏర్పడిన పురుష విముఖత వల్ల ఆమె పురుషులతో అనుబంధాలను ధృఢం చేసుకోలేదు. వారు ఆమె దృష్టిలో సాటి మనుషులు మాత్రమే. ఆమె సంబంధం 4 పెట్టుకున్నవారు ఆమెకు మాత్రమే సొంతమే అన్న భావనతో ఆమె లేదు. వారికి భార్య ద ఉండటం ఆమెకు ఎటువంటి అభద్రతను కలిగించలేదు. ఆమె పెరిగిన బాల్యం, కష్టపడిన తీరు ఆమె వ్యక్తిత్వాన్ని సహజీవన విధానాన్ని మాతృస్వామ్య వ్యవస్థను సమర్థించటానికి ఎంతగానో ఉపకరించాయి. అందుకే ఆమె సహజీవనంలో ఒడిదుడుకులు ఎదుర్కుంటూనే ఆ పద్ధతిలో నేర్చుకుంటూ దానిని జీవిత విధానంగా అంగీకరించిన స్త్రీ.

'ఒక ఆడ + ఒక మగ'లో స్వప్నిక పాత్ర మేఘన పాత్రకు భిన్నమైనది. మేఘన కుటుంబ జీవితంలో చక్కగా పెరిగింది. తాను విన్నా, చదివినా, చూసినా వాటిని బట్టి ఆమె సహజీవనం వివాహం కన్నా గొప్పదని భావించిందే తప్ప ఆమెకు....................

స్త్రీ కేంద్రీత నవలల్లో ఘర్షణ సాహిత్యంలో స్త్రీ జీవితంలోని అన్ని అంశాలను స్పృశించేలా రాయడం అంత తేలికైన విషయమేమి కాదు. అది నిజానికి సాహసమనే చెప్పాలి. సింహప్రసాద్ గారు స్త్రీ కేంద్రంగా రాసిన నవలల్లో అనేక రకాల మనస్తత్వాల సంఘర్షణను ఆ పాత్ర భావ ఘర్షణను, దానికి సమాజానికి మధ్య ఉన్న దూరాన్ని కూడా సమన్వయం చేస్తూ రాశారు. వాస్తవానికి ఏ జీవితం ఐడియల్ కాదు. ప్రతి జీవితంలోనూ ఎన్నో కష్టాలు, అసంతృప్తులు ఉంటాయి. వాటిని సహజం అనుకుని అలాగే ఉండిపోవడమా, ఆ పరిస్థితి మార్చే ప్రయత్నం చేయడమా అన్న ఆలోచన దగ్గరే పాత్ర ఆత్మ జన్మిస్తుంది. సింహప్రసాద్ గారి రచనల్లో ఆధునిక స్త్రీ-పురుష సంబంధాలను చర్చించే నవలలు, వివాహంలో తమను తాము కోల్పోయినా స్త్రీల ఆత్మలు సజీవంగా ఉన్నాయి. 1999లో ఆయన రాసిన 'వెలుగుల తీరం', 2013 లో రాసిన 'ఒక ఆడ + ఒక మగ' రెండు కూడా సహజీవనం గురించి చర్చించేవే. కానీ 'వెలుగుల తీరం' సహజీవనాన్ని సమర్ధిస్తే, 'ఒక ఆడ + ఒక మగ' మాత్రం వివాహ వ్యవస్థను ఆచరణీయం అన్న భావనను స్పష్టం చేస్తుంది. పాత్ర ఆత్మను, వ్యక్తిత్వాన్ని బట్టి అభిప్రాయ స్థిరత్వం ఉంటుంది. 'వెలుగుల తీరం'లో మేఘన వ్యక్తిత్వాన్ని ప్రభావితం చేసింది ఆమె బాల్యం, తల్లిదండ్రులు. అప్పటి నుండి ఆమెలో ఏర్పడిన పురుష విముఖత వల్ల ఆమె పురుషులతో అనుబంధాలను ధృఢం చేసుకోలేదు. వారు ఆమె దృష్టిలో సాటి మనుషులు మాత్రమే. ఆమె సంబంధం 4 పెట్టుకున్నవారు ఆమెకు మాత్రమే సొంతమే అన్న భావనతో ఆమె లేదు. వారికి భార్య ద ఉండటం ఆమెకు ఎటువంటి అభద్రతను కలిగించలేదు. ఆమె పెరిగిన బాల్యం, కష్టపడిన తీరు ఆమె వ్యక్తిత్వాన్ని సహజీవన విధానాన్ని మాతృస్వామ్య వ్యవస్థను సమర్థించటానికి ఎంతగానో ఉపకరించాయి. అందుకే ఆమె సహజీవనంలో ఒడిదుడుకులు ఎదుర్కుంటూనే ఆ పద్ధతిలో నేర్చుకుంటూ దానిని జీవిత విధానంగా అంగీకరించిన స్త్రీ. 'ఒక ఆడ + ఒక మగ'లో స్వప్నిక పాత్ర మేఘన పాత్రకు భిన్నమైనది. మేఘన కుటుంబ జీవితంలో చక్కగా పెరిగింది. తాను విన్నా, చదివినా, చూసినా వాటిని బట్టి ఆమె సహజీవనం వివాహం కన్నా గొప్పదని భావించిందే తప్ప ఆమెకు....................

Features

  • : Navala Naivedyam
  • : Simha Prasad
  • : Avirbhava Prachurana
  • : MANIMN4881
  • : paparback
  • : Jan, 2023
  • : 116
  • : Telugu

Reviews

Be the first one to review this product

Discussion:Navala Naivedyam

Be the first to start a discussion Start a new discussion

Browse all Discussions on Books
Powered by infibeam