Olga Tarangalu- Sahitya Samalochana

By Olga (Author)
Rs.100
Rs.100

Olga Tarangalu- Sahitya Samalochana
INR
VISHALA736
Out Of Stock
100.0
Rs.100
Out of Stock
Out Of Stock
Check for shipping and cod pincode

Description

         ఇప్పటివరకూ తనే సంపాదకురాలిగా, అనువాదకురాలిగా, విమర్శకురాలిగా, ఎందరో గొప్ప రచయితలను మనకు అందించిన ఓల్గా గురించి తోటి రచయితలు, విమర్శకులు అందించిన ఈ వ్యాసాలూ పాఠకాదరణ   పొందుతాయనే ఆశిస్తున్నాము. తన జీవిత పర్యంతం, స్త్రీల కోసం రాస్తూ, పని చేస్తూ, స్త్రీలకు ఏకకాలంలో ధైర్యాన్ని, ఊరటనూ కల్పిస్తూ, వారికి పథనిర్దేశనం చేస్తున్న ఓల్గాకు తెలుగు రచయితలు అందిస్తున్న ఒక పుష్పగుచ్చం ఈ గ్రంథం. ఇందులోని పూలు కేవలం సుగంధాన్ని అందించడానికే కాదు కఠోరవాస్తవాలను మృదువుగా, మధురంగా చెప్పడానికి ఉద్దేశించినవి. ఆమె సృజనలతో జీవితాలను, ఆలోచనలను తాజా చేసుకోవడమే ఈ పుష్పగుచ్చం లక్ష్యం.

                                                   - డా సి మృణాళిని

          మహిళల స్వేచ్ఛ, హక్కుల గురించి సామాన్యులకు అవగాహన కల్పించిన రచయితల్లో అగ్రస్థానం ఓల్గాదే. ఆమె రచనలు అనేక పునర్ముద్రణలు పొందడం, అసంఖ్యాక పాఠకులు ఆమెను ఆరాధించడం, పరిమిత సంఖ్య పాఠకులు ఆమెను దుమ్మెత్తిపోయడం - ఇవన్నీ ఆమె విప్లవాత్మక ఆలోచనా సరళికి, ఆమెలోని కాలిక స్పృహకు నిదర్శనాలు. ఆమె రచనల పట్ల కొందరిలో కలిగిన ఆగ్రహమే, వ్యవస్థీకృతమైపోయిన నమ్మకాలు, నిజాలను ఆమె సున్నితంగా ప్రశ్నిస్తున్నదనడానికి బలమైన సాక్ష్యం. ఆమెలోని ఇంకో ప్రత్యేకత - ఆమె ఎప్పుడూ నోరుపెట్టుకొని అరవదు అతి నెమ్మదిగా, సుతిమెత్తగా ఆమె సంధించే ప్రశ్నలు మనకు విషయాన్ని జీర్ణించుకున్న తర్వాతే పూర్తిగా అర్థమవుతాయి. ఒక ప్రవక్తకున్నంత ఉత్సాహంతో ఆమె అస్పష్టమైన భావనలను, సిద్ధాంతాలను కూడ సామాన్య పాఠకుడికి అవగతమయ్యేలా రాస్తుంది.

                                         - వసంత కన్నభిరాన్

         ఇప్పటివరకూ తనే సంపాదకురాలిగా, అనువాదకురాలిగా, విమర్శకురాలిగా, ఎందరో గొప్ప రచయితలను మనకు అందించిన ఓల్గా గురించి తోటి రచయితలు, విమర్శకులు అందించిన ఈ వ్యాసాలూ పాఠకాదరణ   పొందుతాయనే ఆశిస్తున్నాము. తన జీవిత పర్యంతం, స్త్రీల కోసం రాస్తూ, పని చేస్తూ, స్త్రీలకు ఏకకాలంలో ధైర్యాన్ని, ఊరటనూ కల్పిస్తూ, వారికి పథనిర్దేశనం చేస్తున్న ఓల్గాకు తెలుగు రచయితలు అందిస్తున్న ఒక పుష్పగుచ్చం ఈ గ్రంథం. ఇందులోని పూలు కేవలం సుగంధాన్ని అందించడానికే కాదు కఠోరవాస్తవాలను మృదువుగా, మధురంగా చెప్పడానికి ఉద్దేశించినవి. ఆమె సృజనలతో జీవితాలను, ఆలోచనలను తాజా చేసుకోవడమే ఈ పుష్పగుచ్చం లక్ష్యం.                                                    - డా సి మృణాళిని           మహిళల స్వేచ్ఛ, హక్కుల గురించి సామాన్యులకు అవగాహన కల్పించిన రచయితల్లో అగ్రస్థానం ఓల్గాదే. ఆమె రచనలు అనేక పునర్ముద్రణలు పొందడం, అసంఖ్యాక పాఠకులు ఆమెను ఆరాధించడం, పరిమిత సంఖ్య పాఠకులు ఆమెను దుమ్మెత్తిపోయడం - ఇవన్నీ ఆమె విప్లవాత్మక ఆలోచనా సరళికి, ఆమెలోని కాలిక స్పృహకు నిదర్శనాలు. ఆమె రచనల పట్ల కొందరిలో కలిగిన ఆగ్రహమే, వ్యవస్థీకృతమైపోయిన నమ్మకాలు, నిజాలను ఆమె సున్నితంగా ప్రశ్నిస్తున్నదనడానికి బలమైన సాక్ష్యం. ఆమెలోని ఇంకో ప్రత్యేకత - ఆమె ఎప్పుడూ నోరుపెట్టుకొని అరవదు అతి నెమ్మదిగా, సుతిమెత్తగా ఆమె సంధించే ప్రశ్నలు మనకు విషయాన్ని జీర్ణించుకున్న తర్వాతే పూర్తిగా అర్థమవుతాయి. ఒక ప్రవక్తకున్నంత ఉత్సాహంతో ఆమె అస్పష్టమైన భావనలను, సిద్ధాంతాలను కూడ సామాన్య పాఠకుడికి అవగతమయ్యేలా రాస్తుంది.                                          - వసంత కన్నభిరాన్

Features

  • : Olga Tarangalu- Sahitya Samalochana
  • : Olga
  • : Vishalandhra Publishers
  • : VISHALA736
  • : Paperback
  • : 2015
  • : 263
  • : Telugu

Reviews

Be the first one to review this product

Discussion:Olga Tarangalu- Sahitya Samalochana

Be the first to start a discussion Start a new discussion

Browse all Discussions on Books
Powered by infibeam