గీతాంజలి
గీతాంజలి తమకు నచ్చదన్నా, తమకు అర్థం కాదన్నా, నా కా మాట విపరీతంగా వినబడుతుంది. సంగీతం ఇష్టం లేనివాడి సంగతి లొరెనో అన్న మాటలన్నీ జ్ఞాపకం వస్తాయి
నా కాలేజీ దశ నించి నన్ను కలకాలమూ Influence చేసిన పుస్తకం ఈ గీతాంజలి. మొదట ఒక వాక్యం వినగానే పరవశం చెంది, నా హృదయం భక్తితో వికసించి, ఎక్కడ? ఎవరు? ఎట్లా? అని వెతకటం ప్రారంభించింది. కలలో కనపడ్డ ప్రియురాలికై లోకాన్ని గాలించే ఉన్మత్తుడి విధాన వెతికాను, ఆ పుస్తకం దొరికిందాకా.
గీతాంజలి నాకో కొత్త దృక్పథాన్ని, Philosophy of life ని, నేను అనుభవించే అందాలకి ఓ వెలుగుని, నా ఆశలకో అర్థాన్ని ఇచ్చింది. ఎక్కడో అందరాని ఈశ్వరుణ్ణి, నా సుఖ దుఖ నిత్యసహచారికి, నా అనంత జీవిత పథచారినిగా చేసి నా ప్రక్కన నిలబెట్టింది. ఈశ్వరుడు అమృత మయుడని ఈనాడు తెలుసుకున్నాను. నే ననుభవించేదంతా అమృతం. అమృతం ఈశ్వరుడు.
అదీకాదు, అనుభవించేది నేనుకాదు. నేను నువ్వు కలిసి,
అదీకాదు, నువ్వూ నేననే భేదమే లేదు. అంతా నువ్వే, నేను లేను.
నువ్వేకాని, నేనేకాని, ఉన్నది ఒకరే.
ఇదీ ఆధ్యాత్మిక ఆరోహణ సోపానం.......................
© 2017,www.logili.com All Rights Reserved.