ఆప్త వాక్యం
ఇద్దరు ‘బాబు’లం..!
బందరు బాబు, మండవ బాబు, గుంటూరు బాబు ఇలా ఎన్నో రకాల బాబులుగా పిలువబడే మండవ గోపాలకృష్ణ మాకు బంధువవుతాడని నా ఎస్ ఎస్ ఎల్సీ తర్వాతే తెలిసింది. నేను వేమూరి బాబుగా పిలవబడటంతో మేము 'బాబు' అయ్యాము బంధువుల్లో.
నేను ప్రీయూనివర్సిటీ బందరులో చదువుతున్నపుడు, గోపాలకృష్ణ కుటుంబం అక్కడ ఉండేది. వాళ్ళ నాన్న మండవ లక్ష్మయ్యగారు మా మేనమామ తోడల్లుడుగా మాకు చుట్టరికం. అక్కడే ఆ కుటుంబంతో నాకు గుర్తున్న తొలిపరిచయం. అక్కడే వాళ్ళింట్లో ‘టెలిఫోన్' తొలిసారి చూసాను.
వాళ్ళ డాబా వున్న ప్రదేశం చాలా బాగుండేది. చుట్టు ప్రక్కల చాలా ఖాళీ ప్రదేశాలు. అందులో సీతాఫలం తోటలు, ఆ తోటల్నుంచి దొంగతనంగా కోసుకొచ్చిన సీతాఫలాలు.పొద్దు పొద్దున్నే రాత్రి పప్పుచారుతో కలుపుకున్న అన్నంలో నంజుకున్న ఆవకాయ బద్దలూ, ఒక్క రూపాయితో ముగ్గురం నడుచుకుంటూ వెళ్లి పావలా టిక్కెట్టుతో చూసిన సినిమాలు జ్ఞాపకాలుగా దొర్లుతున్నాయి. తర్వాత నా డిగ్రీ చదువుకోసం గుంటూరు చేరటం అప్పటికి వీళ్ళుకూడా బందరు నుంచి గుంటూరు మారటంతో మాకు సాన్నిహిత్యం మరింత పెరిగింది. నెమ్మదిగా బంధుత్వం రెండో స్థానానికి జరిగి స్నేహానికి తొలి స్థానం ఇచ్చింది.
ఈ పుస్తకం గురించి నాలుగు మాటలు రాయాలని కూర్చుంటే, ఒక్కసారిగా నా గురించీ, ఈ రచయిత గురించి జ్ఞాపకాలు కలగాపులగంగా చుట్టుముట్టాయి................
ఆప్త వాక్యం ఇద్దరు ‘బాబు’లం..! బందరు బాబు, మండవ బాబు, గుంటూరు బాబు ఇలా ఎన్నో రకాల బాబులుగా పిలువబడే మండవ గోపాలకృష్ణ మాకు బంధువవుతాడని నా ఎస్ ఎస్ ఎల్సీ తర్వాతే తెలిసింది. నేను వేమూరి బాబుగా పిలవబడటంతో మేము 'బాబు' అయ్యాము బంధువుల్లో. నేను ప్రీయూనివర్సిటీ బందరులో చదువుతున్నపుడు, గోపాలకృష్ణ కుటుంబం అక్కడ ఉండేది. వాళ్ళ నాన్న మండవ లక్ష్మయ్యగారు మా మేనమామ తోడల్లుడుగా మాకు చుట్టరికం. అక్కడే ఆ కుటుంబంతో నాకు గుర్తున్న తొలిపరిచయం. అక్కడే వాళ్ళింట్లో ‘టెలిఫోన్' తొలిసారి చూసాను. వాళ్ళ డాబా వున్న ప్రదేశం చాలా బాగుండేది. చుట్టు ప్రక్కల చాలా ఖాళీ ప్రదేశాలు. అందులో సీతాఫలం తోటలు, ఆ తోటల్నుంచి దొంగతనంగా కోసుకొచ్చిన సీతాఫలాలు.పొద్దు పొద్దున్నే రాత్రి పప్పుచారుతో కలుపుకున్న అన్నంలో నంజుకున్న ఆవకాయ బద్దలూ, ఒక్క రూపాయితో ముగ్గురం నడుచుకుంటూ వెళ్లి పావలా టిక్కెట్టుతో చూసిన సినిమాలు జ్ఞాపకాలుగా దొర్లుతున్నాయి. తర్వాత నా డిగ్రీ చదువుకోసం గుంటూరు చేరటం అప్పటికి వీళ్ళుకూడా బందరు నుంచి గుంటూరు మారటంతో మాకు సాన్నిహిత్యం మరింత పెరిగింది. నెమ్మదిగా బంధుత్వం రెండో స్థానానికి జరిగి స్నేహానికి తొలి స్థానం ఇచ్చింది. ఈ పుస్తకం గురించి నాలుగు మాటలు రాయాలని కూర్చుంటే, ఒక్కసారిగా నా గురించీ, ఈ రచయిత గురించి జ్ఞాపకాలు కలగాపులగంగా చుట్టుముట్టాయి................© 2017,www.logili.com All Rights Reserved.