Sri Datta Puranam

By Mohan Publications (Author)
Rs.900
Rs.900

Sri Datta Puranam
INR
MANIMN3635
In Stock
900.0
Rs.900


In Stock
Ships in 4 - 9 Days
Check for shipping and cod pincode

Description

ఓం శ్రీ గణేశాయ నమః

ఓం శ్రీ సరస్వత్యైనమః

ఓం శ్రీ గురుభ్యోనమః శ్రీదత్త పురాణము

ప్రథమ భాగం

నైమిశారణ్యములో మునులకు దత్త ప్రత్యక్షం

ధ్యానమూలం గురోర్మూర్తి: పూజా మూలం గురో: పదమ్ |
మంత్రమూలం గురోర్వాక్యం మోక్షమూలం గురో: కృపా |
గురుర్ర్బహ్మ గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః |
గురుపాక్షాత్ పరంబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః |

శుక శౌనకాది మునులందరూ కలసి నైమిశారణ్యంలో దీర్ఘసత్రయాగం చేస్తున్నారు. నిరాటంకంగా హోమాలు జరుగుతున్నాయి. ఒక రోజు విరామ సమయంలో ప్రశాంత వాతావరణంలో మునులందరూ ధ్యానంలో నిమగ్నమైయున్నారు. అందరూ పద్మాసనములు వేసుకొని రెండు చేతులూ ఒడిలో సంధించి అరమోడ్పు కన్నులతో అంతర్ దృష్టిని భ్రూ మధ్యస్థానంలో బంధించి శ్వాస ప్రక్రియలను క్రమ మార్గంలో వుంచి తేజ స్వరూపుడైన నారాయణుని నిష్టతో ఏకాగ్రమైన మనస్సుతో ధ్యానిస్తున్నారు. మన శరీరాలను స్తంభింపజేసి శిలా ప్రతిమలై అత్యంత నిష్టలో ధ్యానంలో వున్నారు. అంతలో చల్లని గాలి ఆ ప్రాంతాన్ని పరిమళ భరితంతో ముంచెత్తింది. కోటి సూర్యుల కాంతితో ఒక దివ్యజ్యోతి వారి నడుమ సాక్షాత్కరించింది. అదొక అద్భుత కాంతి. కేవలమైన తేజస్సు, ఆకారం లేని తేజస్సు, కోటి సూర్యుల కాంతితో కోటి చంద్రుల చల్లదనం కలగలిపిన మహా మహస్సు, ధ్యానంలో వున్న మునులందరూ దివ్యమైన అనుభూతితో కళ్ళు తెరిచారు. ఎదురుగా కన్నులు మిరుమిట్లు గొలిపే కాంతి పుంజం. ఆ రేజస్సు దశదిశలా వ్యాపించింది. మంగళవాయిద్యాలు మనోహరంగా వినిపిస్తున్నాయి. శౌనకాది మునులందరూ ఆ కాంతిపుంజాన్ని చూడలేక కన్నులు మూసుకున్నారు. చేతులు జోడించి ఆర్తితో "మహానుభావా | తేజ స్వరూపా! నువ్వు అనుగ్రహించి మా ఎదుట నిలిచినా నిన్ను దర్శించలేని అశక్తులము. అద్భుతమైన ఆ తేజస్సును మా కన్నులు తట్టుకోలేకపోతున్నాయి. మనస్సులు మాత్రం పరమానందంలో మునిగివున్నాయి. ఈ అనుభూతిని మేమెన్నడూ అనుభవించనిది. దయామయా నీ రూపాన్ని దర్శించగల్లే శక్తి మాకు ప్రసాదించు" అంటూ మునులందరూ సాష్టాంగ ప్రణామములు ఆచరించారు.

అప్పుడు ఆ తేజస్సు నుండి ఇలా వినిపించింది. మహామునులారా ! కన్నులు తెరవండి. మునులందరూ నిన్నులు తెరిచారు. అదే తేజోస్యరూపం. ఎరుపు, నలుపు, తెలుపూ కలయికగా కాంతి. ఆ కాంతిలోనే శ్రీమన్నారాయణుడు దర్శనమిచ్చాడు. అత్రి, భుగు, మరీచి మొదలగు మహర్పులందరూ పరివేష్టించి యున్నారు. చతుర్వేదాలను పఠిస్తున్నారు. ఆ నీల నీరదశ్యాముడు చిరునవ్వులు చిందిస్తున్నాడు. వక్షస్థలంలోని కౌస్తుభమణితో సుదేవుని ముఖం మరింత కాంతిమంతం అయింది. నాలుగు భుజాలతో శంఖం, చక్రం, గద, పద్మం నాలుగు..............

ఓం శ్రీ గణేశాయ నమః ఓం శ్రీ సరస్వత్యైనమః ఓం శ్రీ గురుభ్యోనమః శ్రీదత్త పురాణము ప్రథమ భాగంనైమిశారణ్యములో మునులకు దత్త ప్రత్యక్షం ధ్యానమూలం గురోర్మూర్తి: పూజా మూలం గురో: పదమ్ | మంత్రమూలం గురోర్వాక్యం మోక్షమూలం గురో: కృపా | గురుర్ర్బహ్మ గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః |గురుపాక్షాత్ పరంబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః | శుక శౌనకాది మునులందరూ కలసి నైమిశారణ్యంలో దీర్ఘసత్రయాగం చేస్తున్నారు. నిరాటంకంగా హోమాలు జరుగుతున్నాయి. ఒక రోజు విరామ సమయంలో ప్రశాంత వాతావరణంలో మునులందరూ ధ్యానంలో నిమగ్నమైయున్నారు. అందరూ పద్మాసనములు వేసుకొని రెండు చేతులూ ఒడిలో సంధించి అరమోడ్పు కన్నులతో అంతర్ దృష్టిని భ్రూ మధ్యస్థానంలో బంధించి శ్వాస ప్రక్రియలను క్రమ మార్గంలో వుంచి తేజ స్వరూపుడైన నారాయణుని నిష్టతో ఏకాగ్రమైన మనస్సుతో ధ్యానిస్తున్నారు. మన శరీరాలను స్తంభింపజేసి శిలా ప్రతిమలై అత్యంత నిష్టలో ధ్యానంలో వున్నారు. అంతలో చల్లని గాలి ఆ ప్రాంతాన్ని పరిమళ భరితంతో ముంచెత్తింది. కోటి సూర్యుల కాంతితో ఒక దివ్యజ్యోతి వారి నడుమ సాక్షాత్కరించింది. అదొక అద్భుత కాంతి. కేవలమైన తేజస్సు, ఆకారం లేని తేజస్సు, కోటి సూర్యుల కాంతితో కోటి చంద్రుల చల్లదనం కలగలిపిన మహా మహస్సు, ధ్యానంలో వున్న మునులందరూ దివ్యమైన అనుభూతితో కళ్ళు తెరిచారు. ఎదురుగా కన్నులు మిరుమిట్లు గొలిపే కాంతి పుంజం. ఆ రేజస్సు దశదిశలా వ్యాపించింది. మంగళవాయిద్యాలు మనోహరంగా వినిపిస్తున్నాయి. శౌనకాది మునులందరూ ఆ కాంతిపుంజాన్ని చూడలేక కన్నులు మూసుకున్నారు. చేతులు జోడించి ఆర్తితో "మహానుభావా | తేజ స్వరూపా! నువ్వు అనుగ్రహించి మా ఎదుట నిలిచినా నిన్ను దర్శించలేని అశక్తులము. అద్భుతమైన ఆ తేజస్సును మా కన్నులు తట్టుకోలేకపోతున్నాయి. మనస్సులు మాత్రం పరమానందంలో మునిగివున్నాయి. ఈ అనుభూతిని మేమెన్నడూ అనుభవించనిది. దయామయా నీ రూపాన్ని దర్శించగల్లే శక్తి మాకు ప్రసాదించు" అంటూ మునులందరూ సాష్టాంగ ప్రణామములు ఆచరించారు. అప్పుడు ఆ తేజస్సు నుండి ఇలా వినిపించింది. మహామునులారా ! కన్నులు తెరవండి. మునులందరూ నిన్నులు తెరిచారు. అదే తేజోస్యరూపం. ఎరుపు, నలుపు, తెలుపూ కలయికగా కాంతి. ఆ కాంతిలోనే శ్రీమన్నారాయణుడు దర్శనమిచ్చాడు. అత్రి, భుగు, మరీచి మొదలగు మహర్పులందరూ పరివేష్టించి యున్నారు. చతుర్వేదాలను పఠిస్తున్నారు. ఆ నీల నీరదశ్యాముడు చిరునవ్వులు చిందిస్తున్నాడు. వక్షస్థలంలోని కౌస్తుభమణితో సుదేవుని ముఖం మరింత కాంతిమంతం అయింది. నాలుగు భుజాలతో శంఖం, చక్రం, గద, పద్మం నాలుగు..............

Features

  • : Sri Datta Puranam
  • : Mohan Publications
  • : Mohan Publications
  • : MANIMN3635
  • : Hard binding
  • : 2022
  • : 252
  • : Telugu

Reviews

Be the first one to review this product

Discussion:Sri Datta Puranam

Be the first to start a discussion Start a new discussion

Browse all Discussions on Books
Powered by infibeam