Samskruthi Samskaram

By Gujju Venkatareddy (Author)
Rs.80
Rs.80

Samskruthi Samskaram
INR
MANIMN3754
In Stock
80.0
Rs.80


In Stock
Ships in 4 - 9 Days
Check for shipping and cod pincode

Description

జీవించు - ప్రేమించు - నిష్క్రమించు

గౌరవనీయులు వెంకటరెడ్డి గారు రచించిన 'సంస్కృతి - సంస్కారము' పుస్తకానికి ముందుమాట రాయాలని కోరుతూ అయ్యబాబుగారు నాకు అర్థరాత్రి ఫోన్ చేసారు. వారు ఫోన్ చేసింది పగలు పదిన్నరగంటలకే అయి వుంటుంది, కానీ నేను అమెరికాలో వున్నందున అర్ధరాత్రి...! మర్నాడు ఉదయం వారికి నేను ఫోన్ చేసాను. (అయ్యబాబు గారు నాకు చిరకాల పరిచయం. ఓసారి వారి సాహిత్యసభకు కూడా (టెక్కలిలో) అతిథిగా వెళ్ళినట్టు గుర్తు) అప్పుడు చెప్పారు విషయాన్ని, చెపుతూ ఈ పుస్తకావిష్కరణకు అతిథిగా పిలిచారు. నేను అమెరికా నుంచి ఇప్పుడప్పుడే రాలేనంటే... నేనెప్పుడు వస్తే అప్పుడే ఆవిష్కరణన్నారు. ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే... నాపట్ల వారికి గల అభిమానాన్ని తెలియజేయడానికే. వెంకటరెడ్డిగారికీ, అయ్యబాబు గారికీ ధన్యవాదాలు.

వెంకటరెడ్డి గారి పుస్తకాన్ని మూడు నాలుగుసార్లు చదివాను. నిజానికి ఎన్నిసార్లు చదివినా మళ్ళీ మళ్ళీ చదవాలనిపించే పుస్తకమిది. అంటే ఇందులో అలా చదివించే కథ గానీ, కథను నడిపించే సన్నివేశాలుగానీ, సన్నివేశాల సస్పెన్స్ గానీ ఏమీ లేవు. ఇందులో వున్నదంతా జీవితాన్ని సంస్కరించుకోవడానికి, ఉన్నతీకరించుకోవడానికి, సార్ధకత కలిగించుకోవడానికి అవసరమైన జీవనసూత్రాలు, సూక్తులు, సుద్దులు వున్నాయి. ఇలాంటి సూత్రాలు, సూక్తులు, సుద్దులూ మునుపు ఏ పుస్తకంలోనూ లేవా, చదవలేదా అనంటే వుండొచ్చు, చదవొచ్చేమో గానీ వాటికి భిన్నమయినదేదో ఇందులో వుంది. అదేమిటన్నది | నేను చెప్పదలచుకోలేదు, చదివి మీరు తెలుసుకోవాలి. అంతే!

జీవించు - ప్రేమించు - నిష్క్రమించు గౌరవనీయులు వెంకటరెడ్డి గారు రచించిన 'సంస్కృతి - సంస్కారము' పుస్తకానికి ముందుమాట రాయాలని కోరుతూ అయ్యబాబుగారు నాకు అర్థరాత్రి ఫోన్ చేసారు. వారు ఫోన్ చేసింది పగలు పదిన్నరగంటలకే అయి వుంటుంది, కానీ నేను అమెరికాలో వున్నందున అర్ధరాత్రి...! మర్నాడు ఉదయం వారికి నేను ఫోన్ చేసాను. (అయ్యబాబు గారు నాకు చిరకాల పరిచయం. ఓసారి వారి సాహిత్యసభకు కూడా (టెక్కలిలో) అతిథిగా వెళ్ళినట్టు గుర్తు) అప్పుడు చెప్పారు విషయాన్ని, చెపుతూ ఈ పుస్తకావిష్కరణకు అతిథిగా పిలిచారు. నేను అమెరికా నుంచి ఇప్పుడప్పుడే రాలేనంటే... నేనెప్పుడు వస్తే అప్పుడే ఆవిష్కరణన్నారు. ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే... నాపట్ల వారికి గల అభిమానాన్ని తెలియజేయడానికే. వెంకటరెడ్డిగారికీ, అయ్యబాబు గారికీ ధన్యవాదాలు. వెంకటరెడ్డి గారి పుస్తకాన్ని మూడు నాలుగుసార్లు చదివాను. నిజానికి ఎన్నిసార్లు చదివినా మళ్ళీ మళ్ళీ చదవాలనిపించే పుస్తకమిది. అంటే ఇందులో అలా చదివించే కథ గానీ, కథను నడిపించే సన్నివేశాలుగానీ, సన్నివేశాల సస్పెన్స్ గానీ ఏమీ లేవు. ఇందులో వున్నదంతా జీవితాన్ని సంస్కరించుకోవడానికి, ఉన్నతీకరించుకోవడానికి, సార్ధకత కలిగించుకోవడానికి అవసరమైన జీవనసూత్రాలు, సూక్తులు, సుద్దులు వున్నాయి. ఇలాంటి సూత్రాలు, సూక్తులు, సుద్దులూ మునుపు ఏ పుస్తకంలోనూ లేవా, చదవలేదా అనంటే వుండొచ్చు, చదవొచ్చేమో గానీ వాటికి భిన్నమయినదేదో ఇందులో వుంది. అదేమిటన్నది | నేను చెప్పదలచుకోలేదు, చదివి మీరు తెలుసుకోవాలి. అంతే!

Features

  • : Samskruthi Samskaram
  • : Gujju Venkatareddy
  • : Visalandra book houses
  • : MANIMN3754
  • : Papar Back
  • : July, 2022
  • : 108
  • : Telugu

Reviews

Be the first one to review this product

Discussion:Samskruthi Samskaram

Be the first to start a discussion Start a new discussion

Browse all Discussions on Books
Powered by infibeam