Rajakiya Ardashastram

By Toleti Jaganmohanarao (Author)
Rs.400
Rs.400

Rajakiya Ardashastram
INR
MANIMN3995
In Stock
400.0
Rs.400


In Stock
Ships in 4 - 9 Days
Check for shipping and cod pincode

Description

ప్రచురణ కర్తల మాట

మార్సిస్టు-లెనినిస్టు సిద్ధాంతంలో మార్కిస్టు రాజకీయ అర్థశాస్త్రం చాలా ముఖ్యమైన

పెట్టుబడిదారీ అణచివేత నుండి విముక్తి కోసం కార్మిక వర్గమూ, మొత్తం శ్రామిక జనావళీ చేసే పోరాటంలో మార్క్సిస్టు-లెనినిస్టు రాజకీయ అర్థశాస్త్రం ఒక శక్తివంతమైన ఆలోచనాయుధం అవుతుంది. శ్రామిక వర్గానికీ, శ్రామిక జనావళికి సామాజికార్థికాభివృద్ధి సూత్రాల జ్ఞానాన్ని ఇచ్చి సైద్ధాంతికంగా సాయుధుల్ని చేస్తుంది. కమ్యూనిజం అంతిమ విజయం అనివార్యమని స్పష్టంగా చూపించి, ఆ విజయాన్ని సాధించగలమనే ఆత్మ విశ్వాసాన్ని కలిగిస్తుంది.

ఈ వాస్తవాలను దృష్టిలో ఉంచుకుని, తమ పార్టీ కేడర్ సైద్ధాంతిక స్థాయిని పెంచే లక్ష్యంతో రాజకీయ అర్థశాస్త్రం గురించి ఒక పాఠ్య గ్రంధాన్ని తయారు చెయ్యాలని సోవియట్ కమ్యూనిస్టు పార్టీ కేంద్ర కమిటీ 1937లో నిర్ణయించింది.

కమ్యూనిజం విజయానికి రాజకీయ అర్థశాస్త్ర పాఠ్యగ్రంధం ఒక అవసరమనీ, ఈ పాఠ్యగ్రంధం లేకుంటే 'మన ప్రజలు దిగజారిపోతారనీ, మనం నాశనమైపోతామనీ, మనకు బతకడానికి గాలి ఎంత అవసరమో ఈ పుస్తకం కూడా అంతే అవసరమనీ' స్టాలిన్ అన్నాడు. రాజకీయ అర్థశాస్త్ర అధ్యయనం కమ్యూనిస్టు పార్టీల సభ్యులకు ఎంత అవసరమో స్టాలిన్ వ్యాఖ్య వెల్లడిస్తుంది.

-

మానవ సమాజ చరిత్రలోని ప్రధాన ఉత్పత్తి సంబంధాల స్వరూపాలను - ఆదిమ కమ్యూనిస్టు వ్యవస్థ, బానిస వ్యవస్థ, ఫ్యూడలిజం, పెట్టుబడిదారీ విధానం, సోషలిజాలను రాజకీయ ఆర్ధ శాస్త్రం అధ్యయనం చేస్తుంది. దిగువ దశల నుండి ఎగువ దశలకు సామాజిక ఉత్పత్తి ఎలా అభివృద్ధి చెందుతున్నదీ, మనిషిని మనిషి దోచుకోవడం మీద ఆధారపడిన సామాజిక వ్యవస్థలు ఎలా ఏర్పడి, అభివృద్ధి చెంది, రద్దు చెయ్యబడుతున్నదీ రాజకీయ అర్థ శాస్త్రం పరిశోధిస్తుంది. మొత్తం చారిత్రకాభివృద్ధి క్రమం, సోషలిస్టు ఉత్పత్తి విధాన విజయానికి మార్గాన్ని ఎలా ఏర్పరుస్తున్నదీ ఈ శాస్త్రం వెల్లడిస్తుంది. అంతేకాక, సోషలిజం ఆర్థిక సూత్రాలనూ, సోషలిస్టు సమాజ పుట్టుక తర్వాత ఉన్నత కమ్యూనిస్టు దశకు చేరే మార్గంలో ఆ సమాజ అభివృద్ధి సూత్రాలనూ అది అధ్యయనం చేస్తుంది.

మార్క్సిస్టు రాజకీయ అర్థశాస్త్ర పద్ధతి, గతి తార్కిక భౌతికవాద పద్ధతి. గతితర్క, చారిత్రక భౌతికవాద మౌలిక ప్రతిపాదనలను సమాజ ఆర్థిక వ్యవస్థ అధ్యయనానికి.......................

ప్రచురణ కర్తల మాట మార్సిస్టు-లెనినిస్టు సిద్ధాంతంలో మార్కిస్టు రాజకీయ అర్థశాస్త్రం చాలా ముఖ్యమైన పెట్టుబడిదారీ అణచివేత నుండి విముక్తి కోసం కార్మిక వర్గమూ, మొత్తం శ్రామిక జనావళీ చేసే పోరాటంలో మార్క్సిస్టు-లెనినిస్టు రాజకీయ అర్థశాస్త్రం ఒక శక్తివంతమైన ఆలోచనాయుధం అవుతుంది. శ్రామిక వర్గానికీ, శ్రామిక జనావళికి సామాజికార్థికాభివృద్ధి సూత్రాల జ్ఞానాన్ని ఇచ్చి సైద్ధాంతికంగా సాయుధుల్ని చేస్తుంది. కమ్యూనిజం అంతిమ విజయం అనివార్యమని స్పష్టంగా చూపించి, ఆ విజయాన్ని సాధించగలమనే ఆత్మ విశ్వాసాన్ని కలిగిస్తుంది. ఈ వాస్తవాలను దృష్టిలో ఉంచుకుని, తమ పార్టీ కేడర్ సైద్ధాంతిక స్థాయిని పెంచే లక్ష్యంతో రాజకీయ అర్థశాస్త్రం గురించి ఒక పాఠ్య గ్రంధాన్ని తయారు చెయ్యాలని సోవియట్ కమ్యూనిస్టు పార్టీ కేంద్ర కమిటీ 1937లో నిర్ణయించింది. కమ్యూనిజం విజయానికి రాజకీయ అర్థశాస్త్ర పాఠ్యగ్రంధం ఒక అవసరమనీ, ఈ పాఠ్యగ్రంధం లేకుంటే 'మన ప్రజలు దిగజారిపోతారనీ, మనం నాశనమైపోతామనీ, మనకు బతకడానికి గాలి ఎంత అవసరమో ఈ పుస్తకం కూడా అంతే అవసరమనీ' స్టాలిన్ అన్నాడు. రాజకీయ అర్థశాస్త్ర అధ్యయనం కమ్యూనిస్టు పార్టీల సభ్యులకు ఎంత అవసరమో స్టాలిన్ వ్యాఖ్య వెల్లడిస్తుంది. - మానవ సమాజ చరిత్రలోని ప్రధాన ఉత్పత్తి సంబంధాల స్వరూపాలను - ఆదిమ కమ్యూనిస్టు వ్యవస్థ, బానిస వ్యవస్థ, ఫ్యూడలిజం, పెట్టుబడిదారీ విధానం, సోషలిజాలను రాజకీయ ఆర్ధ శాస్త్రం అధ్యయనం చేస్తుంది. దిగువ దశల నుండి ఎగువ దశలకు సామాజిక ఉత్పత్తి ఎలా అభివృద్ధి చెందుతున్నదీ, మనిషిని మనిషి దోచుకోవడం మీద ఆధారపడిన సామాజిక వ్యవస్థలు ఎలా ఏర్పడి, అభివృద్ధి చెంది, రద్దు చెయ్యబడుతున్నదీ రాజకీయ అర్థ శాస్త్రం పరిశోధిస్తుంది. మొత్తం చారిత్రకాభివృద్ధి క్రమం, సోషలిస్టు ఉత్పత్తి విధాన విజయానికి మార్గాన్ని ఎలా ఏర్పరుస్తున్నదీ ఈ శాస్త్రం వెల్లడిస్తుంది. అంతేకాక, సోషలిజం ఆర్థిక సూత్రాలనూ, సోషలిస్టు సమాజ పుట్టుక తర్వాత ఉన్నత కమ్యూనిస్టు దశకు చేరే మార్గంలో ఆ సమాజ అభివృద్ధి సూత్రాలనూ అది అధ్యయనం చేస్తుంది. మార్క్సిస్టు రాజకీయ అర్థశాస్త్ర పద్ధతి, గతి తార్కిక భౌతికవాద పద్ధతి. గతితర్క, చారిత్రక భౌతికవాద మౌలిక ప్రతిపాదనలను సమాజ ఆర్థిక వ్యవస్థ అధ్యయనానికి.......................

Features

  • : Rajakiya Ardashastram
  • : Toleti Jaganmohanarao
  • : Navashakam Prachuranalu
  • : MANIMN3995
  • : Paperback
  • : Dec, 2022
  • : 333
  • : Telugu

Reviews

Be the first one to review this product

Discussion:Rajakiya Ardashastram

Be the first to start a discussion Start a new discussion

Browse all Discussions on Books
Powered by infibeam