నిజామ్ పాలన చివరి రోజులు - నా హైదరాబాదు జ్ఞాపకాలు
ఈ అనువాదం ఎందుకు?
సెప్టెంబరు 17, 1948న నిజామ్ పాలిత ప్రాంతాలన్నీ భారతదేశంలో భాగం అయ్యాయి. స్వతంత్రంగా నిలవాలన్న నిజామ్ కల కలగానే మిగిలిపోయింది. ఆ కాలంలో ఏం జరిగిందన్న విషయంలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి ఇప్పటికీ. ఎవరెవరి రాజకీయ సిద్ధాంతాలను, దృష్టిని బట్టి ఆ సంఘటన గురించి వాదోపవాదాలు కొనసాగుతున్నాయి. గమనిస్తే అందుబాటులో ఉన్న అనేక పుస్తకాలు - Tragedy of Hyderabad, Hyderabad 1948, An Avoidable Invasion, The Destruction of Hyderabad వంటి పుస్తకాలు దాదాపుగా ఒకే రకమైన దృక్కోణంలో Do. Tragedy of Hyderabad, V.P. Menon Ŏ Integration of the Indian Statesలో హైదరాబాద్కు సంబంధించిన అధ్యాయాల తెలుగు అనువాదాలున్నాయి కానీ ఈ సంఘటనలకు ప్రత్యక్ష సాక్షి అయి, ఆనాటి సంఘటనల అలల నడుమ ఉన్న కె.ఎం. మున్నీ రచించిన 'The End of an Era: Hyderabad Memories' తెలుగులో అందుబాటులో లేదు. ఇతర పుస్తకాలు చదివి ఆవేశంగా. వాదించే అధికులకు మునీ ఇలాంటి పుస్తకం ఒకటి రాశాడని తెలియదు. వారు చదివిన పుస్తకాలను బట్టి వారి దృష్టిలో మున్షీ కాంగ్రెస్ మనిషి, ఒక విలన్. ఆయన కావాలని అబద్ధాలు చెప్పాడనీ, ఆయన జరిపిన కుట్ర ఇదంతా అని పలువురు అంతా తెలిసినట్లు - ఆవేశంగా వాదిస్తుంటే ఆశ్చర్యం అనిపించింది.
ఒకే సత్యాన్ని పలువురు పలు రకాలుగా దర్శిస్తారని చెప్పిన వైజ్ఞానిక సమన్వయ దృక్పథం గల సమాజంలో మేధావులుగా పరిగణనకు గురయ్యేవారు, ప్రజల భాగ్య విధాతలుగా మన్ననలందుకునేవారు ఇలా ఏక పక్ష దృక్కోణాన్ని ప్రదర్శించటం, ఏనుగు అయిదుగురు గుడ్డివారి కథలో గుడ్డివారిలా ప్రవర్తించటం బాధ కలిగించింది. ఫలితంగా కె.ఎం. మున్నీ రచించిన 'ది ఎండ్ ఆఫ్ ఏన్ ఎరా' గురించి అందరికి తెలిసేట్టు చేయాలన్న ఆలోచన కలిగింది. ఒక విషయం గురించి పలు రకాల దృక్కోణాలలో వ్యక్తపరిచిన ఆలోచనలు ప్రజలకు అందుబాటులో ఉంచి, వాటి ఆధారంగా సత్యనిర్ధారణ ఎవరికి వారు చేసుకునే వీలు నివ్వటం ఉత్తమం అనిపించింది. ఫలితంగా 'ది ఎండ్ ఆఫ్ ఏన్ ఎరా' పుస్తకాన్ని తెలుగులో అనువదించేందుకు భారతీయ విద్యా భవన్ నుంచి అనుమతిని అభ్యర్థించాను. సహృదయంతో వారు ఈ పుస్తకాన్ని అనువదించి సంచికలో సీరియల్గా ప్రచురించేందుకు అనుమతినిచ్చారు. అలా సాధ్యమయింది 'ది ఎండ్ ఆఫ్ ఏన్ ఎరా' తెలుగు అనువాదం.........................
నిజామ్ పాలన చివరి రోజులు - నా హైదరాబాదు జ్ఞాపకాలు ఈ అనువాదం ఎందుకు? సెప్టెంబరు 17, 1948న నిజామ్ పాలిత ప్రాంతాలన్నీ భారతదేశంలో భాగం అయ్యాయి. స్వతంత్రంగా నిలవాలన్న నిజామ్ కల కలగానే మిగిలిపోయింది. ఆ కాలంలో ఏం జరిగిందన్న విషయంలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి ఇప్పటికీ. ఎవరెవరి రాజకీయ సిద్ధాంతాలను, దృష్టిని బట్టి ఆ సంఘటన గురించి వాదోపవాదాలు కొనసాగుతున్నాయి. గమనిస్తే అందుబాటులో ఉన్న అనేక పుస్తకాలు - Tragedy of Hyderabad, Hyderabad 1948, An Avoidable Invasion, The Destruction of Hyderabad వంటి పుస్తకాలు దాదాపుగా ఒకే రకమైన దృక్కోణంలో Do. Tragedy of Hyderabad, V.P. Menon Ŏ Integration of the Indian Statesలో హైదరాబాద్కు సంబంధించిన అధ్యాయాల తెలుగు అనువాదాలున్నాయి కానీ ఈ సంఘటనలకు ప్రత్యక్ష సాక్షి అయి, ఆనాటి సంఘటనల అలల నడుమ ఉన్న కె.ఎం. మున్నీ రచించిన 'The End of an Era: Hyderabad Memories' తెలుగులో అందుబాటులో లేదు. ఇతర పుస్తకాలు చదివి ఆవేశంగా. వాదించే అధికులకు మునీ ఇలాంటి పుస్తకం ఒకటి రాశాడని తెలియదు. వారు చదివిన పుస్తకాలను బట్టి వారి దృష్టిలో మున్షీ కాంగ్రెస్ మనిషి, ఒక విలన్. ఆయన కావాలని అబద్ధాలు చెప్పాడనీ, ఆయన జరిపిన కుట్ర ఇదంతా అని పలువురు అంతా తెలిసినట్లు - ఆవేశంగా వాదిస్తుంటే ఆశ్చర్యం అనిపించింది. ఒకే సత్యాన్ని పలువురు పలు రకాలుగా దర్శిస్తారని చెప్పిన వైజ్ఞానిక సమన్వయ దృక్పథం గల సమాజంలో మేధావులుగా పరిగణనకు గురయ్యేవారు, ప్రజల భాగ్య విధాతలుగా మన్ననలందుకునేవారు ఇలా ఏక పక్ష దృక్కోణాన్ని ప్రదర్శించటం, ఏనుగు అయిదుగురు గుడ్డివారి కథలో గుడ్డివారిలా ప్రవర్తించటం బాధ కలిగించింది. ఫలితంగా కె.ఎం. మున్నీ రచించిన 'ది ఎండ్ ఆఫ్ ఏన్ ఎరా' గురించి అందరికి తెలిసేట్టు చేయాలన్న ఆలోచన కలిగింది. ఒక విషయం గురించి పలు రకాల దృక్కోణాలలో వ్యక్తపరిచిన ఆలోచనలు ప్రజలకు అందుబాటులో ఉంచి, వాటి ఆధారంగా సత్యనిర్ధారణ ఎవరికి వారు చేసుకునే వీలు నివ్వటం ఉత్తమం అనిపించింది. ఫలితంగా 'ది ఎండ్ ఆఫ్ ఏన్ ఎరా' పుస్తకాన్ని తెలుగులో అనువదించేందుకు భారతీయ విద్యా భవన్ నుంచి అనుమతిని అభ్యర్థించాను. సహృదయంతో వారు ఈ పుస్తకాన్ని అనువదించి సంచికలో సీరియల్గా ప్రచురించేందుకు అనుమతినిచ్చారు. అలా సాధ్యమయింది 'ది ఎండ్ ఆఫ్ ఏన్ ఎరా' తెలుగు అనువాదం.........................© 2017,www.logili.com All Rights Reserved.