Nadee Prastanam

Rs.200
Rs.200

Nadee Prastanam
INR
MANIMN3761
In Stock
200.0
Rs.200


In Stock
Ships in 4 - 9 Days
Check for shipping and cod pincode

Description

నదీ విజ్ఞాన సర్వస్వ సంపత్తి

జీవరాశి అంతా జలావిర్భావం తరువాత జనించిందే. నదులను వెన్నంటియే నాగరికతా పరివ్యాప్తమయింది. జలంతో జనానికి అవినాభావ సంబంధం. “నీరే ప్రాణాధారం". హిందూ సాంప్రదాయం ప్రకారం జపతపాలు, కర్మకాండలు అన్నింటా వ్యవహారం నీటితో ముడిపడి వున్నదే. పుణ్యక్షేత్ర దర్శనం తీర్థయాత్రలుగా నీటితో అనుసంధానమైనవే. అలాగే శ్రాద్ధకర్మలు, పిండప్రదానాలు, తర్పణాలు అన్నీ జలంతో లంకె వేసుకున్నవే.

“ తైత్తరీయ ఉపనిషత్తు ” ననుసరించి బ్రహ్మ నుండి వాయువు, వాయువు నుండి జలం, జలం నుండి భూమి, భూమి నుండి ఔషధులు, ఔషధుల నుండి అన్నం, అన్నం నుండి జీవుడు పుట్టాయన్నది సిద్ధాంతం.

జీవకోటికి ప్రధానమైన జలం-నదుల నుండి లభించేది. త్రాగేనీరయినా, దేహమాలిన్య పరిశుభ్ర స్నానమయినా నదీ ప్రసాదమే! అందుకే నదులను దేవతలుగా

ఆరాధించడం, తల్లిగా సంభావించి పూజించడం హిందూ సంప్రదాయం. నదీ స్నానాలు, కోనేటి స్నానాలు, మాఘస్నానాలు, సముద్రస్నానాలు, మంగళస్నానాలు అంటూ పురిటి స్నానం నుండి శవస్నానం వరకూ మనిషి బ్రతుకు నీటితో ముడిపడింది. |

"ఏఱుల జన్మంబు-సురల జన్మంబు ఎరుగనగునె " అని ఓ ఆర్యోక్తి. నదుల పుట్టుక గురించి, దేవతల పుట్టుక గురించి అసలు మూలాలు తెలుసుకోవడం అంత సులభమైన పనేమీ కాదని దీని అర్ధం. వాటి వెనుక రహస్యాలు, దాగిన గాధలు, వాని | చుట్టూ పరివేష్టితమైన అంశాలు అనేకం వుంటాయని పిండితార్థం. కానీ నదుల పుట్టుపూర్వోత్తరాలనే కాదు, వాటి ప్రస్థానాన్నీ, ఆ నదీ తీరాల వెంబడి గల సాహిత్య, సంగీత, సాంస్కృతిక విశేషాలనూ, ఆ నదులు వెలయించిన నాగరికతనూ పుడిసిట బట్టిన అగస్త్యునిలా మిత్రుడు శ్రీ

రామవరపు వేంకట రమణమూర్తి విశేష శ్రమ దమాదుల కోర్చి, పరిశోధన చేసి సమగ్రంగా వెలయిస్తున్న నదుల చరిత్ర ఈ గ్రంథం. ఇంతటి “జల చరిత్ర”ను వెలికితీసి అందిస్తున్న తాను ఎంతయినా అభినందనీయుడు.

ఆకాశవాణిలో కార్యక్రమ నిర్వహణాధికారిగా ఆ సంస్థ వైభవ ప్రాభవాలకు దోహదపడిన సృజన శీలురులో శ్రీ రమణమూర్తి ఎంచదగినవారు. తనకున్న సహజ అనురక్తితో నదీపరమైన కార్యక్రమాలను రూపొందించి ప్రసారం చేసి శ్రోత జనాభిమానాన్ని చూరగొన్నవాడాయన. అంతేకాదు! జపాన్ రేడియో పురస్కారం పొంది టోక్యో హవాయి.....................

నదీ విజ్ఞాన సర్వస్వ సంపత్తి జీవరాశి అంతా జలావిర్భావం తరువాత జనించిందే. నదులను వెన్నంటియే నాగరికతా పరివ్యాప్తమయింది. జలంతో జనానికి అవినాభావ సంబంధం. “నీరే ప్రాణాధారం". హిందూ సాంప్రదాయం ప్రకారం జపతపాలు, కర్మకాండలు అన్నింటా వ్యవహారం నీటితో ముడిపడి వున్నదే. పుణ్యక్షేత్ర దర్శనం తీర్థయాత్రలుగా నీటితో అనుసంధానమైనవే. అలాగే శ్రాద్ధకర్మలు, పిండప్రదానాలు, తర్పణాలు అన్నీ జలంతో లంకె వేసుకున్నవే. “ తైత్తరీయ ఉపనిషత్తు ” ననుసరించి బ్రహ్మ నుండి వాయువు, వాయువు నుండి జలం, జలం నుండి భూమి, భూమి నుండి ఔషధులు, ఔషధుల నుండి అన్నం, అన్నం నుండి జీవుడు పుట్టాయన్నది సిద్ధాంతం. జీవకోటికి ప్రధానమైన జలం-నదుల నుండి లభించేది. త్రాగేనీరయినా, దేహమాలిన్య పరిశుభ్ర స్నానమయినా నదీ ప్రసాదమే! అందుకే నదులను దేవతలుగా ఆరాధించడం, తల్లిగా సంభావించి పూజించడం హిందూ సంప్రదాయం. నదీ స్నానాలు, కోనేటి స్నానాలు, మాఘస్నానాలు, సముద్రస్నానాలు, మంగళస్నానాలు అంటూ పురిటి స్నానం నుండి శవస్నానం వరకూ మనిషి బ్రతుకు నీటితో ముడిపడింది. | "ఏఱుల జన్మంబు-సురల జన్మంబు ఎరుగనగునె " అని ఓ ఆర్యోక్తి. నదుల పుట్టుక గురించి, దేవతల పుట్టుక గురించి అసలు మూలాలు తెలుసుకోవడం అంత సులభమైన పనేమీ కాదని దీని అర్ధం. వాటి వెనుక రహస్యాలు, దాగిన గాధలు, వాని | చుట్టూ పరివేష్టితమైన అంశాలు అనేకం వుంటాయని పిండితార్థం. కానీ నదుల పుట్టుపూర్వోత్తరాలనే కాదు, వాటి ప్రస్థానాన్నీ, ఆ నదీ తీరాల వెంబడి గల సాహిత్య, సంగీత, సాంస్కృతిక విశేషాలనూ, ఆ నదులు వెలయించిన నాగరికతనూ పుడిసిట బట్టిన అగస్త్యునిలా మిత్రుడు శ్రీ రామవరపు వేంకట రమణమూర్తి విశేష శ్రమ దమాదుల కోర్చి, పరిశోధన చేసి సమగ్రంగా వెలయిస్తున్న నదుల చరిత్ర ఈ గ్రంథం. ఇంతటి “జల చరిత్ర”ను వెలికితీసి అందిస్తున్న తాను ఎంతయినా అభినందనీయుడు. ఆకాశవాణిలో కార్యక్రమ నిర్వహణాధికారిగా ఆ సంస్థ వైభవ ప్రాభవాలకు దోహదపడిన సృజన శీలురులో శ్రీ రమణమూర్తి ఎంచదగినవారు. తనకున్న సహజ అనురక్తితో నదీపరమైన కార్యక్రమాలను రూపొందించి ప్రసారం చేసి శ్రోత జనాభిమానాన్ని చూరగొన్నవాడాయన. అంతేకాదు! జపాన్ రేడియో పురస్కారం పొంది టోక్యో హవాయి.....................

Features

  • : Nadee Prastanam
  • : Ramavarapu Venkata Ramanamurty
  • : Samata Publisher
  • : MANIMN3761
  • : Papar Back
  • : Nov, 2021
  • : 176
  • : Telugu

Reviews

Be the first one to review this product

Discussion:Nadee Prastanam

Be the first to start a discussion Start a new discussion

Browse all Discussions on Books
Powered by infibeam