కథాకేళి
ఎన్నిక
ఇంటర్వ్యూ సరిగ్గా పదకొండున్నరకి.
నేను తొమ్మిదిన్నరకి బెంగుళూర్ చేరుకున్నాను. నన్ను ఇంటర్వ్యూకి పిలిచిన కంపెనీ వాళ్ళే నాకోసం ఓ పెద్ద హెూటల్లో గది బుక్ చేసారు.
ఆటోలో సరాసరి ఆ హెూటల్కి చేరుకున్నాను. నా పేరు చెప్పగానే గది నంబర్ చెప్పి నాకు గది తాళంచెవి ఇచ్చారు. హెూటల్ బాయ్ నా సూట్ కేస్ తీసుకువస్తే టిప్ దొరకచ్చని ఆశపడ్డాడు. కాని నా దగ్గర చిన్న బ్రీఫ్ కేస్ మాత్రమే ఉంది. నేను బెంగుళూర్లో ఉండేది ఒక్క రోజు మాత్రమే. మద్రాస్ నించి బెంగుళూరికి నిజానికి అది కూడా అవసరం లేదు. కాని తెచ్చాను.
గదిలో చేరాక ముందు బ్రీఫ్ కేస్ తెరిచి టవల్ తీసుకుని బాత్ రూమ్లోకి వెళ్ళి మొహం కడుక్కున్నాను. నా కాగితాలు పెడదామని ఆ గదిలోని డ్రెస్సింగ్ టేబులున్న డ్రాయర్ తెరిచాను.
నా గుండె ఝల్లుమనేలా ఎదురుగా ఆ డ్రాయర్లో రూపాయల కట్ట ఉంది. ఆ కట్టలో ఒక్క రూపాయి నోట్లే ఉన్నాయి. పాతవి, కొత్తవి, నలిగినవి, నలగనివి అన్ని రకాల రూపాయి నోట్లున్నాయి. లెక్క పెడితే సరిగ్గా వంద రూపాయలు..................
కథాకేళిఎన్నిక ఇంటర్వ్యూ సరిగ్గా పదకొండున్నరకి. నేను తొమ్మిదిన్నరకి బెంగుళూర్ చేరుకున్నాను. నన్ను ఇంటర్వ్యూకి పిలిచిన కంపెనీ వాళ్ళే నాకోసం ఓ పెద్ద హెూటల్లో గది బుక్ చేసారు. ఆటోలో సరాసరి ఆ హెూటల్కి చేరుకున్నాను. నా పేరు చెప్పగానే గది నంబర్ చెప్పి నాకు గది తాళంచెవి ఇచ్చారు. హెూటల్ బాయ్ నా సూట్ కేస్ తీసుకువస్తే టిప్ దొరకచ్చని ఆశపడ్డాడు. కాని నా దగ్గర చిన్న బ్రీఫ్ కేస్ మాత్రమే ఉంది. నేను బెంగుళూర్లో ఉండేది ఒక్క రోజు మాత్రమే. మద్రాస్ నించి బెంగుళూరికి నిజానికి అది కూడా అవసరం లేదు. కాని తెచ్చాను. గదిలో చేరాక ముందు బ్రీఫ్ కేస్ తెరిచి టవల్ తీసుకుని బాత్ రూమ్లోకి వెళ్ళి మొహం కడుక్కున్నాను. నా కాగితాలు పెడదామని ఆ గదిలోని డ్రెస్సింగ్ టేబులున్న డ్రాయర్ తెరిచాను. నా గుండె ఝల్లుమనేలా ఎదురుగా ఆ డ్రాయర్లో రూపాయల కట్ట ఉంది. ఆ కట్టలో ఒక్క రూపాయి నోట్లే ఉన్నాయి. పాతవి, కొత్తవి, నలిగినవి, నలగనివి అన్ని రకాల రూపాయి నోట్లున్నాయి. లెక్క పెడితే సరిగ్గా వంద రూపాయలు..................© 2017,www.logili.com All Rights Reserved.