మున్నుడి
పి.వి. నరసింహారావు
భారతపూర్వ ప్రధానమంత్రి
1960లలో ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ వారు భారతీయ భాషా సాహిత్యాలపై పరిచయాత్మక పుస్తకాలు ప్రచురించి భారతీయ సాహిత్య స్వరూపాన్ని చదువరులకు ఏకీకృతంగా అందించారు. అవన్నీ ఏదో సందర్భంలో చదివినప్పుడు వాటిలో హిందీ సాహిత్యం లేదని నేను గమనించలేదు. హిందీ సాహిత్యచరిత్రను గురించి కొంత పరిజ్ఞానం నాకదివరకే ఉన్నందువల్ల కాబోలు, ఆ లోపం నా దృష్టికి రాలేదు. ఇటీవల యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ గారు నాకీ విషయం చెప్పారు. తాము రచించిన హిందీ సాహిత్య చరిత్రకు పరిచయ వాక్యాలు రాయాలని నన్ను కోరినప్పుడు ఆయన రాసిన ఈ గ్రంథమే తెలుగులో మొదటి హిందీ గ్రంథాల రచనలు, అనువాదాలు, ప్రస్తావనలు, వెలువడుతూ వచ్చిన తెలుగులో హిందీ సాహిత్యచరిత్రే లేని లోపం నేడు తీర్చుతున్నందుకు లక్ష్మీప్రసాద్ గారు అభినందనీయులు.
ఒక భాషాసాహిత్య చరిత్రను ఇతర భాషీయులు చదివి అర్థం చేసుకోవడంలో సహజంగానే కొన్ని అడ్డంకులుంటాయి. సాహిత్య రచనలనైతే అనువాదాల ద్వారా అర్ధం చేసుకుంటారు. అనువదించడంలో కొంత మూలరచనలోని స్వారస్యం పలుచబడిపోయినా మొత్తానికి అవగాహన కలుగుతుంది. ఈనాడు మనమందరం ఫ్రెంచి, ఇంగ్లీషు, జర్మన్, స్పానిష్, జపనీస్ మొదలైన భాషల సాహిత్యాన్ని ఇలాగే చదువుకుంటున్నాం. కాని ఆయా భాషల సాహిత్యాల ఆద్యంత వికాసక్రమాన్ని గురించి తెలుసుకోవడమంటే అదంత తేలిక కాదు. ఆయా దేశాల రాజకీయ సాంఘిక సాంస్కృతిక చారిత్రక వివరాలు కొంతైనా తెలుసుకోవడం అవసరమౌతుంది. అలాగే హిందీ సాహిత్య చారిత్రాధ్యయనంలో ఉత్తరభారత చరిత్రలోని ముఖ్య ఘట్టాలను పరిశీలించవలసి ఉంటుంది. ఏ యుగంలోనైనా సరే, ప్రజా జీవితంతో విడదీయరానంతగా పెనవేసుకుంటూ వచ్చిన హిందీ సాహిత్యం గురించి ఇది మరింత చరితార్ధమౌతుంది.
ఐతే భారతీయ భాషా సాహిత్యాలు పరస్పరావగాహనలో ఒక అపూర్వ సౌలభ్యం ఉంది. అది భారతీయ సంస్కృతిలోని అనేకతలో విరాజిల్లుతున్న............................
మున్నుడి పి.వి. నరసింహారావు భారతపూర్వ ప్రధానమంత్రి 1960లలో ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ వారు భారతీయ భాషా సాహిత్యాలపై పరిచయాత్మక పుస్తకాలు ప్రచురించి భారతీయ సాహిత్య స్వరూపాన్ని చదువరులకు ఏకీకృతంగా అందించారు. అవన్నీ ఏదో సందర్భంలో చదివినప్పుడు వాటిలో హిందీ సాహిత్యం లేదని నేను గమనించలేదు. హిందీ సాహిత్యచరిత్రను గురించి కొంత పరిజ్ఞానం నాకదివరకే ఉన్నందువల్ల కాబోలు, ఆ లోపం నా దృష్టికి రాలేదు. ఇటీవల యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ గారు నాకీ విషయం చెప్పారు. తాము రచించిన హిందీ సాహిత్య చరిత్రకు పరిచయ వాక్యాలు రాయాలని నన్ను కోరినప్పుడు ఆయన రాసిన ఈ గ్రంథమే తెలుగులో మొదటి హిందీ గ్రంథాల రచనలు, అనువాదాలు, ప్రస్తావనలు, వెలువడుతూ వచ్చిన తెలుగులో హిందీ సాహిత్యచరిత్రే లేని లోపం నేడు తీర్చుతున్నందుకు లక్ష్మీప్రసాద్ గారు అభినందనీయులు. ఒక భాషాసాహిత్య చరిత్రను ఇతర భాషీయులు చదివి అర్థం చేసుకోవడంలో సహజంగానే కొన్ని అడ్డంకులుంటాయి. సాహిత్య రచనలనైతే అనువాదాల ద్వారా అర్ధం చేసుకుంటారు. అనువదించడంలో కొంత మూలరచనలోని స్వారస్యం పలుచబడిపోయినా మొత్తానికి అవగాహన కలుగుతుంది. ఈనాడు మనమందరం ఫ్రెంచి, ఇంగ్లీషు, జర్మన్, స్పానిష్, జపనీస్ మొదలైన భాషల సాహిత్యాన్ని ఇలాగే చదువుకుంటున్నాం. కాని ఆయా భాషల సాహిత్యాల ఆద్యంత వికాసక్రమాన్ని గురించి తెలుసుకోవడమంటే అదంత తేలిక కాదు. ఆయా దేశాల రాజకీయ సాంఘిక సాంస్కృతిక చారిత్రక వివరాలు కొంతైనా తెలుసుకోవడం అవసరమౌతుంది. అలాగే హిందీ సాహిత్య చారిత్రాధ్యయనంలో ఉత్తరభారత చరిత్రలోని ముఖ్య ఘట్టాలను పరిశీలించవలసి ఉంటుంది. ఏ యుగంలోనైనా సరే, ప్రజా జీవితంతో విడదీయరానంతగా పెనవేసుకుంటూ వచ్చిన హిందీ సాహిత్యం గురించి ఇది మరింత చరితార్ధమౌతుంది. ఐతే భారతీయ భాషా సాహిత్యాలు పరస్పరావగాహనలో ఒక అపూర్వ సౌలభ్యం ఉంది. అది భారతీయ సంస్కృతిలోని అనేకతలో విరాజిల్లుతున్న............................© 2017,www.logili.com All Rights Reserved.