Deccan Gondula Charitra

By Bhangya Bhukya (Author)
Rs.150
Rs.150

Deccan Gondula Charitra
INR
MANIMN3804
In Stock
150.0
Rs.150


In Stock
Ships in 4 - 9 Days
Check for shipping and cod pincode

Description

పరిచయం

అడవి, ఏజన్సీ లేదా షెడ్యూల్డ్ ప్రాంతాల (ప్రభుత్వం పెట్టిన పేరు) పేర్లతో పిలవబడుతున్న ఆదివాసీ నివాస ప్రాంతాలు మొదటినుండి భారతదేశ ప్రధాన భూభాగానికి పొలిమేరలుగానే భావించబడ్డాయి, ఆ రకంగానే నిర్మితమయ్యాయి. ఆదివాసులలో అత్యధికులు ఈ రోజుకీ అడవిలో లేదా అడవి అంచులలో బతుకుతున్నవారే. ప్రధాన భూభాగపు భారతదేశానికీ (మైదానాలకు), ఆదివాసి ప్రాంతాలకూ (అడవులు/కొండలు) మధ్య చరిత్ర పొడవునా స్థిరపడిపోయిన తేడాలు ఎన్నో ఉన్నా రెండిటికీ మధ్య పరిపాలనాపరమైన విభజన రేఖ స్థిరపడింది మాత్రం బ్రిటిష్ పరిపాలనా కాలంలోనే. ఆ హద్దులే ఇప్పుడు వివాదాస్పదమయ్యాయి. ఎందుకంటే ఆదివాసులు, ఆదివాసేతరులు ఇద్దరూ నేటికీ - కొంత సఖ్యంగాను, కొంత ఘర్షణ పడుతూ కూడా - కలిసి జీవిస్తున్న చోటు అది. దీనికి కొంత కారణం మన దేశంలో కొండలు, అడవులు దేశ సరిహద్దుల్లో లేదా అంచుల్లో మాత్రమే కాక దేశం మధ్యలో కూడా ఉండడం. దట్టమైన అడవులతో నిండిన మధ్యభారతం, దక్కన్ పీఠభూమి చరిత్రలో చాలా సామ్రాజ్యాలకు పొలిమేరలుగా ఉంటూ వచ్చాయి. మైదానాల నుండి వలస వచ్చిన వారికి, మైదానాల నుండి తప్పించుకుని వచ్చిన వారికి, మైదానాల నుండి తరిమివేయబడ్డ వారికి అందరికీ ఆ ప్రాంతాలే ఆశ్రయమిచ్చాయని చేతన్ సింగ్ వంటి చరిత్రకారులు ఎత్తి చూపారు. అటువంటి వారందరినీ కలిపి లెక్కేస్తే మైదానాల నుండి వలస వచ్చిన వారి సంఖ్య కోట్లల్లోనే ఉండి ఉంటుంది. దీని అర్థం ప్రధాన భూభాగంలో లేదా మైదానాలలో నివసించే ఆధిపత్య వర్గాలకూ, బడుగు వర్గాలకూ మధ్య చరిత్ర పొడవునా జరిగిన ఘర్షణల ఫలితమే ఈ పొలిమేరల నిర్మాణం అని గుర్తించాల్సి ఉంటుంది.

అందుకే ఈ పొలిమేరలను కేవలం పరిపాలనా రేఖగానో, భౌగోళిక హద్దుగానో భావించరాదు, పొలిమేరల నిర్మాణం ఒక స్పష్టమైన రాజకీయ చర్య. ఆ విషయాన్ని గుర్తిస్తేనే 'ప్రధాన భూభాగం', 'పొలిమేర' అనే పదాలకు ఉన్న వాస్తవిక అర్థాలను, అంటే అవి స్పష్టమైన రాజకీయ, సాంస్కృతిక విభజన రేఖలని అర్థం చేసుకోగలుగుతాం. అయితే ఇప్పటిదాకా వీటిని ద్వంద్వాలు (binaries) గా అర్థం చేసుకోవడమనేది చాలా సాధారణమైపోయింది. అంటే నాగరిక - ఆదిమ, మచ్చిక చేయబడ్డ - మచ్చిక చేయబడని,................

పరిచయం అడవి, ఏజన్సీ లేదా షెడ్యూల్డ్ ప్రాంతాల (ప్రభుత్వం పెట్టిన పేరు) పేర్లతో పిలవబడుతున్న ఆదివాసీ నివాస ప్రాంతాలు మొదటినుండి భారతదేశ ప్రధాన భూభాగానికి పొలిమేరలుగానే భావించబడ్డాయి, ఆ రకంగానే నిర్మితమయ్యాయి. ఆదివాసులలో అత్యధికులు ఈ రోజుకీ అడవిలో లేదా అడవి అంచులలో బతుకుతున్నవారే. ప్రధాన భూభాగపు భారతదేశానికీ (మైదానాలకు), ఆదివాసి ప్రాంతాలకూ (అడవులు/కొండలు) మధ్య చరిత్ర పొడవునా స్థిరపడిపోయిన తేడాలు ఎన్నో ఉన్నా రెండిటికీ మధ్య పరిపాలనాపరమైన విభజన రేఖ స్థిరపడింది మాత్రం బ్రిటిష్ పరిపాలనా కాలంలోనే. ఆ హద్దులే ఇప్పుడు వివాదాస్పదమయ్యాయి. ఎందుకంటే ఆదివాసులు, ఆదివాసేతరులు ఇద్దరూ నేటికీ - కొంత సఖ్యంగాను, కొంత ఘర్షణ పడుతూ కూడా - కలిసి జీవిస్తున్న చోటు అది. దీనికి కొంత కారణం మన దేశంలో కొండలు, అడవులు దేశ సరిహద్దుల్లో లేదా అంచుల్లో మాత్రమే కాక దేశం మధ్యలో కూడా ఉండడం. దట్టమైన అడవులతో నిండిన మధ్యభారతం, దక్కన్ పీఠభూమి చరిత్రలో చాలా సామ్రాజ్యాలకు పొలిమేరలుగా ఉంటూ వచ్చాయి. మైదానాల నుండి వలస వచ్చిన వారికి, మైదానాల నుండి తప్పించుకుని వచ్చిన వారికి, మైదానాల నుండి తరిమివేయబడ్డ వారికి అందరికీ ఆ ప్రాంతాలే ఆశ్రయమిచ్చాయని చేతన్ సింగ్ వంటి చరిత్రకారులు ఎత్తి చూపారు. అటువంటి వారందరినీ కలిపి లెక్కేస్తే మైదానాల నుండి వలస వచ్చిన వారి సంఖ్య కోట్లల్లోనే ఉండి ఉంటుంది. దీని అర్థం ప్రధాన భూభాగంలో లేదా మైదానాలలో నివసించే ఆధిపత్య వర్గాలకూ, బడుగు వర్గాలకూ మధ్య చరిత్ర పొడవునా జరిగిన ఘర్షణల ఫలితమే ఈ పొలిమేరల నిర్మాణం అని గుర్తించాల్సి ఉంటుంది. అందుకే ఈ పొలిమేరలను కేవలం పరిపాలనా రేఖగానో, భౌగోళిక హద్దుగానో భావించరాదు, పొలిమేరల నిర్మాణం ఒక స్పష్టమైన రాజకీయ చర్య. ఆ విషయాన్ని గుర్తిస్తేనే 'ప్రధాన భూభాగం', 'పొలిమేర' అనే పదాలకు ఉన్న వాస్తవిక అర్థాలను, అంటే అవి స్పష్టమైన రాజకీయ, సాంస్కృతిక విభజన రేఖలని అర్థం చేసుకోగలుగుతాం. అయితే ఇప్పటిదాకా వీటిని ద్వంద్వాలు (binaries) గా అర్థం చేసుకోవడమనేది చాలా సాధారణమైపోయింది. అంటే నాగరిక - ఆదిమ, మచ్చిక చేయబడ్డ - మచ్చిక చేయబడని,................

Features

  • : Deccan Gondula Charitra
  • : Bhangya Bhukya
  • : Hydrabad Book Trust
  • : MANIMN3804
  • : papar back
  • : Nov, 2019
  • : 171
  • : Telugu

Reviews

Be the first one to review this product

Discussion:Deccan Gondula Charitra

Be the first to start a discussion Start a new discussion

Browse all Discussions on Books
Powered by infibeam