"వేంకటేశునితో సమమైన దేవుడు ఇంకుముందుండ లేదు. ఇకముందుండబోదు" అని అర్థం.
అలాంటి వేంకటేశుడు ఎక్కడ ఉంటాడో తెలుసా? ఆయన మన తెలుగు దేశంలోనే తిరుపతిలో ఉంటాడు. తిరుపతిలో తిరుమల అనే ఒక పెద్ద పర్వతం ఉంది. ఆ పర్వతం మీద ఉంటాడు ఆస్వామి. అది చాలా ఎత్తైన పర్వతం. అక్కడికి చేరాలంటే ఏడుకొండలు ఎక్కాలి. ఆ ఏడు కొండల వాణ్ణి సేవించుకోవడానికి రోజూ వేలాదిమంది యాత్రికులు వస్తుంటారు. అతడు అందరికీ కావాలనుకున్నవన్నీ ఇస్తాడు. అందుకే యుగయుగాలుగా దేవతల దగ్గరి నుంచి మనదాకా తిరుపతి వెళ్ళి సేవించి తరిస్తారు. అలాంటి గొప్ప దేవుని కథ చెపుతే బావుండదూ! బావుంటుంది కదా! అయితే చదవండి. ముందు ఆ స్వామి నివసించే పర్వతం ఎలా వచ్చిందో తెలుసుకుందాం.
వేంకటాద్రితో సరివచ్చే స్థలం ఈ లోకం మొత్తంలోనూ లేదని అర్థం. దాన్నే మనం తిరుపతి (తిరుమల) అని అంటాం.
చాలా కాలం క్రింద ఓసారి భూమి సముద్రంలోకి కుంగిపోయింది. భూమి సముద్రంలోకి కుంగితే మనుష్యులెలా ఉంటారు? అంతా నీటితో నిండిపోయింది. మనుష్యుల్లేకుండా లోకం నడుస్తుందా? అందుకని నారాయణుడు భూమిని పైకి తీయాలనుకున్నాడు. వరాహావతారం ఎత్తాడు. బుడుంగున నీటిలో మునిగాడు. భూమిని బంతిలా పైకి పట్టుకొచ్చాడు. మళ్ళీ భూమి ఎప్పటిలాగే ఉండిపోయింది. దేవతలంతా చాలా సంతోషించారు. ఆయన మీద పూలజల్లు కురిపించారు.
వరాహుడు ఏమనుకున్నాడంటే, మనుషులు పాపాలు ఎక్కువ చేస్తున్నారు. అందుకే భూమి పాపభారముతో మునిగిపోయింది. వారిని రక్షించాలి. అలా అనుకుని ఆయన భూమ్మీదనే ఉండిపోదామనుకున్నాడు. వెంటనే గురుత్మంతుణ్ణి పిల్చాడు. గురుత్మంతుడెవరో తెలుసు కదూ! అతడు శ్రీమన్నారాయణుని వాహనం. గరుత్మంతుడు వచ్చాడు. చేతులు జోడించి నుంచున్నాడు. వరాహమూర్తి గరుడుణ్ణి పరమపదం వెళ్ళమన్నాడు. పరమపదం నారాయణుని లోకం. అక్కడ ఉండే నారాయణాద్రిని తెమ్మన్నాడు. గరుత్మంతుడు రెక్కలు చాచి ఎగిరిపోయాడు......................
బాలల బొమ్మల శ్రీవేంకటేశ్వర లీలలు "వేంకటేశ నమోదేవో నభూతో నభవిష్యతి” అంటే "వేంకటేశునితో సమమైన దేవుడు ఇంకుముందుండ లేదు. ఇకముందుండబోదు" అని అర్థం. అలాంటి వేంకటేశుడు ఎక్కడ ఉంటాడో తెలుసా? ఆయన మన తెలుగు దేశంలోనే తిరుపతిలో ఉంటాడు. తిరుపతిలో తిరుమల అనే ఒక పెద్ద పర్వతం ఉంది. ఆ పర్వతం మీద ఉంటాడు ఆస్వామి. అది చాలా ఎత్తైన పర్వతం. అక్కడికి చేరాలంటే ఏడుకొండలు ఎక్కాలి. ఆ ఏడు కొండల వాణ్ణి సేవించుకోవడానికి రోజూ వేలాదిమంది యాత్రికులు వస్తుంటారు. అతడు అందరికీ కావాలనుకున్నవన్నీ ఇస్తాడు. అందుకే యుగయుగాలుగా దేవతల దగ్గరి నుంచి మనదాకా తిరుపతి వెళ్ళి సేవించి తరిస్తారు. అలాంటి గొప్ప దేవుని కథ చెపుతే బావుండదూ! బావుంటుంది కదా! అయితే చదవండి. ముందు ఆ స్వామి నివసించే పర్వతం ఎలా వచ్చిందో తెలుసుకుందాం. "వేంకటాద్రి సమంస్థానం బ్రహ్మాండే నాస్తికించన" అంటే వేంకటాద్రితో సరివచ్చే స్థలం ఈ లోకం మొత్తంలోనూ లేదని అర్థం. దాన్నే మనం తిరుపతి (తిరుమల) అని అంటాం. చాలా కాలం క్రింద ఓసారి భూమి సముద్రంలోకి కుంగిపోయింది. భూమి సముద్రంలోకి కుంగితే మనుష్యులెలా ఉంటారు? అంతా నీటితో నిండిపోయింది. మనుష్యుల్లేకుండా లోకం నడుస్తుందా? అందుకని నారాయణుడు భూమిని పైకి తీయాలనుకున్నాడు. వరాహావతారం ఎత్తాడు. బుడుంగున నీటిలో మునిగాడు. భూమిని బంతిలా పైకి పట్టుకొచ్చాడు. మళ్ళీ భూమి ఎప్పటిలాగే ఉండిపోయింది. దేవతలంతా చాలా సంతోషించారు. ఆయన మీద పూలజల్లు కురిపించారు. వరాహుడు ఏమనుకున్నాడంటే, మనుషులు పాపాలు ఎక్కువ చేస్తున్నారు. అందుకే భూమి పాపభారముతో మునిగిపోయింది. వారిని రక్షించాలి. అలా అనుకుని ఆయన భూమ్మీదనే ఉండిపోదామనుకున్నాడు. వెంటనే గురుత్మంతుణ్ణి పిల్చాడు. గురుత్మంతుడెవరో తెలుసు కదూ! అతడు శ్రీమన్నారాయణుని వాహనం. గరుత్మంతుడు వచ్చాడు. చేతులు జోడించి నుంచున్నాడు. వరాహమూర్తి గరుడుణ్ణి పరమపదం వెళ్ళమన్నాడు. పరమపదం నారాయణుని లోకం. అక్కడ ఉండే నారాయణాద్రిని తెమ్మన్నాడు. గరుత్మంతుడు రెక్కలు చాచి ఎగిరిపోయాడు......................© 2017,www.logili.com All Rights Reserved.